Nuthanamina Krupa - నూతనమైన కృప | Pas. John Wesley Anna | 47th FEAST OF TEBERNACLE | 2024 New Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ม.ค. 2025

ความคิดเห็น • 3

  • @lillyaaradhya9394
    @lillyaaradhya9394 10 หลายเดือนก่อน +2

    నూతనమైన కృప - నవనూతనమైన కృప
    శాశ్వతమైన కృప - బహు ఉన్నతమైన కృప
    నిరంతరం నాపై చూపిన - నిత్య తేజుడా యేసయ్యా
    నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా
    నను నీ కోసమే ఇలా బ్రతికించిన జీవధిపతి నీవయ్యా
    ఇదే కదా నీలో పరవశం
    మరువలేని తియ్యని జ్ఞాపకం (2)
    చరణం 1:
    నా క్రయధనముకై రుధిరము కార్చితీవి
    ఫలవంతములైన తోటగా మార్చితివి (2)
    ఫలితము కోరకైన శోధన కలిగినను
    ప్రతి ఫలముగా నాకు ఘనతను నియమించి
    ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి
    అన్ని వేళలా యందు ఆశ్రయమైనావు
    ఎంతగా కీర్తించినా నీ ఋణము నే తీర్చగాలనా
    ఇదే కదా నీలో పరవశం
    మరువలేని తియ్యని జ్ఞాపకం " నూతన "
    చరణం 2:
    నీ వశమైయున్న ప్రాణాత్మ దేహమును
    పరిశుద్ధ పరచుటయే నీ కిష్టమాయెను
    పలు వేదనలలో నీతో నడిపించి
    తలవంచని తెగువ నీలో కలిగించి
    మదిలో నిలిచావు - మమతను పంచావు
    నా జీవితమంతా నిను కొనియాడేదను
    ఎంతగా కీర్తించినా నీ రుణమే నే తీర్చగలనా
    ఇదే కదా నీలో పరవశం
    మరువ లేని తియ్యని జ్ఞాపకం " నూతన "
    చరణం 3:
    సాక్షి సమూహము మేఘము వలె నుండి
    నాలో కోరిన ఆశలు నెరవేరగా
    వేలాది దూతల ఆనందము చూచి
    కృప మహిమైశ్వర్యము నే పొందిన వేళ
    మహిమలో నీ తోనే నిలిచిన వేళ
    మాధుర్య లోకాన నిను చూసిన వేళ
    ఎంతగా కీర్తించిన నీ ఋణము నే తీర్చగలనా
    ఇదే కదా నీలో పరవశం
    మరువలేని తియ్యని జ్ఞాపకం " నూతన "

  • @veereshtejpaul1789
    @veereshtejpaul1789 10 หลายเดือนก่อน +1

    Halleluya

  • @ramakrishnanaik1938
    @ramakrishnanaik1938 10 หลายเดือนก่อน

    Praise the lord