మహిళా డాక్టర్ పై జరిగిన దాడికి నిరసనగా సూర్యాపేటలో కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించిన మహిళలు
ฝัง
- เผยแพร่เมื่อ 19 พ.ย. 2024
- కలకత్తాలో మహిళా డాక్టర్ పై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని మంగళవారం రాత్రి సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పి.ఎన్.ఆర్ టౌన్ షిప్ కు చెందిన మహిళలు పెద్ద ఎత్తున కొవ్వత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 1వ వార్డ్ కౌన్సిలర్ వేములకొండ పద్మ హాజరయ్యారు. అనంతరం కార్యక్రమ నిర్వహకులు మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునేలా మానవ మృగాలు చేసిన ఘటన యావత్ జాతి నివ్వెరపోయేలా చేసిందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన నేటి ఆధునిక కాలంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, పాలకులు, కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇలాంటి దుశ్చర్యలు పునరావృతం కాకుండా హత్యాచారం చేసి హత్యకు పాల్పడిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 1వార్డ్ కౌన్సిలర్ పద్మ, ఉమ, రజిత, స్వప్న, విమల కుమారి, శైలజ టౌన్ షిప్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. #news #suryapet #viralvideo #telugu