నిగూఢ తత్వార్థ బోధిని వేమన పద్యములు నిగూఢ తత్వ వివరము అయిదు వర్ణములనె యఖిలంబు తెలిసిన నయిదునందు ముక్తి యమరియుండు నయిదులోన నున్న యతడెపో యఖిలము విశ్వదాభిరామ వినురవేమా. 47 భావము:- ప్రకృతి అయిన పంచభూతములచే నిర్మింపబడిన శరీరమందే అఖిలజీవరాసులకు అధిపతియైన ఆత్మను తెలియవలయును. పంచ భూత నిర్మాణ శరీరమునకు బయట ఎంత వెదకిన అఖిల జీవులకు కారణమైనవాడు తెలియడు. పంచభూతములచే పంచీకరణ చెందిన శరీరమునందు మూల పురుషుడైన ఆత్మను తెలిసిన , శరీరము బయట పంచభూతములలో అణువణువున వ్యాపించి ఉన్న పరమాత్మను తెలియనగును. కావున అయిదు వర్ణములనె అఖిలంబు తెలిసిన అయిదునందు ముక్తి అమరి ఉండు అన్నారు. శరీరాంతర్గతమున సర్వజీవులకు కారణమైన ఆత్మను తెలిసిన, శరీరము బయట ఉన్న అయిదు భాగములైన పంచభూతములలో వ్యాపించినవాడు తెలియును. బయట అయిదు భాగములందు ఇమిడి ఉన్న పరమాత్మయే సర్వమునకు కారణము. అందువలన అయిదులోనున్న అతడెపో అఖిలము అన్నారు. అయిదు వర్ణములను శరీరముగ తెలిపి మిగత అయిదు భాగములను శరీర బయట పంచభూతములుగ తెలియవలయును. పూసల మధ్యలో కనిపించక, పూసలకు ఆధారమై ఉన్న దారము కనిపించనట్లు, పంచభూతములలో కనిపించక వ్యాపించి ఉన్నవాడు పరమాత్మని తెలియవలయును.
కలలు కల్పిత ప్రపంచాన్ని సృష్టించడం కాదు.కలలు కూడా మన ప్రారబ్ద కర్మానుసారంగా వస్తాయి.కలల్లో కూడా అనుభవాలు ఉంటాయి.అవే కర్మానుభవాలు.భౌతికంగా శరీరంతో జరిగే అవకాశం లేని కర్మలు కలల రూపంలో అనుభవానికి వస్తాయి కనుక అవి కల్పితం కాదు.ఉదాహరణకి కలలో ఒక దొంగ మనల్ని కొట్టి దోచుకునే ప్రయత్నం చేస్తే అప్పుడు మనకి భయంతో చెమటలు పట్టడం కూడా జరుగుతుంది.కల పూర్తి అయినప్పుడు మెలకువ వచ్చిన తర్వాత కూడా ఆ భయం ఇంకా మిగిలి ఉంటుంది కదా? మరి అది కల్పితం అని చెప్పే వీలు లేదు కదా.
నిగూఢ తత్వార్థ బోధిని
వేమన పద్యములు
నిగూఢ తత్వ వివరము
అయిదు వర్ణములనె యఖిలంబు తెలిసిన
నయిదునందు ముక్తి యమరియుండు
నయిదులోన నున్న యతడెపో యఖిలము
విశ్వదాభిరామ వినురవేమా. 47
భావము:- ప్రకృతి అయిన పంచభూతములచే నిర్మింపబడిన శరీరమందే అఖిలజీవరాసులకు అధిపతియైన ఆత్మను తెలియవలయును. పంచ భూత నిర్మాణ శరీరమునకు బయట ఎంత వెదకిన అఖిల జీవులకు కారణమైనవాడు తెలియడు. పంచభూతములచే పంచీకరణ చెందిన శరీరమునందు మూల పురుషుడైన ఆత్మను తెలిసిన , శరీరము బయట పంచభూతములలో అణువణువున వ్యాపించి ఉన్న పరమాత్మను తెలియనగును. కావున అయిదు వర్ణములనె అఖిలంబు తెలిసిన అయిదునందు ముక్తి అమరి ఉండు అన్నారు.
శరీరాంతర్గతమున సర్వజీవులకు కారణమైన ఆత్మను తెలిసిన, శరీరము బయట ఉన్న అయిదు భాగములైన పంచభూతములలో వ్యాపించినవాడు తెలియును. బయట అయిదు భాగములందు ఇమిడి ఉన్న పరమాత్మయే సర్వమునకు కారణము. అందువలన అయిదులోనున్న అతడెపో అఖిలము అన్నారు. అయిదు వర్ణములను శరీరముగ తెలిపి మిగత అయిదు భాగములను శరీర బయట పంచభూతములుగ తెలియవలయును. పూసల మధ్యలో కనిపించక, పూసలకు ఆధారమై ఉన్న దారము కనిపించనట్లు, పంచభూతములలో కనిపించక వ్యాపించి ఉన్నవాడు పరమాత్మని తెలియవలయును.
బాగుంది సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏
బాగుంది బాగా వివరించారు 👍👍💐💐💐
🙏🙏🙏🙏🙏🙏
గరుడు మూల కర్త గురుడుసర్వఘ్నడు
గురుడు లేక యున్న గురుతులేదు
గురుని గుట్టు దెలియ హరునకైనతరమే
రామ సుగుణ దీయ రామమూర్తి
హరునకైనాను సోడ్డు 🙏🙏🙏🙏🙏🙏
కలలు కల్పిత ప్రపంచాన్ని సృష్టించడం కాదు.కలలు కూడా మన ప్రారబ్ద కర్మానుసారంగా వస్తాయి.కలల్లో కూడా అనుభవాలు ఉంటాయి.అవే కర్మానుభవాలు.భౌతికంగా శరీరంతో జరిగే అవకాశం లేని కర్మలు కలల రూపంలో అనుభవానికి వస్తాయి కనుక అవి కల్పితం కాదు.ఉదాహరణకి కలలో ఒక దొంగ మనల్ని కొట్టి దోచుకునే ప్రయత్నం చేస్తే అప్పుడు మనకి భయంతో చెమటలు పట్టడం కూడా జరుగుతుంది.కల పూర్తి అయినప్పుడు మెలకువ వచ్చిన తర్వాత కూడా ఆ భయం ఇంకా మిగిలి ఉంటుంది కదా? మరి అది కల్పితం అని చెప్పే వీలు లేదు కదా.
మీది భావుకత కోణం
అది కేవలం కల్పిత భావం మాత్రమే
స్పందన వలన కలగిన అనుభవం.
హిప్నాటీజం లాంటిది
నిజం కాదు కదా సార్
God+Mind=Man అంటే ఏమిటి?
దైవంశ సంభూతుడు అని