ఈ-ఆపీస్‌ అప్‌గ్రేడేషన్‌తో ఆటంకం | Upgradation of E-Office | Interrupts Public Services | Chandrababu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 พ.ค. 2024
  • రాష్ట్ర ప్రభుత్వం "ఈ -ఆఫీస్" అప్ గ్రేడ్ వ్యవహారం నిలిపివేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో... ఈ-ఆఫీస్ వెర్షన్ మార్పు నిర్ణయం సరికాదన్నారు. ఈమేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు చంద్రబాబు లేఖ రాశారు.
    అప్ గ్రేడ్ పేరుతో ఈ నెల 17నుంచి 25 వరకు "ఈ-ఆఫీస్" మూసివేతపై అనుమానాలు ఉన్నాయని.... ఇందులో అక్రమాలు జరిగే అవకాశం ఉందని లేఖలో అనుమానం వెలిబుచ్చారు. ఈ-ఆఫీస్ అప్ గ్రేడ్ వల్ల C.M.O, C.S, ప్రభుత్వ విభాగాల సేవలకు ఆటంకం కలుగుతుందన్నారు.
    గత ఐదేళ్లలో ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలపై జీవోలను ప్రభుత్వం రహస్యంగా ఉంచిందని... పారదర్శకతను ప్రశ్నించిన వారిపై దాడి చేసిందని గుర్తుచేశారు. మరికొన్ని రోజుల్లో కొత్త ప్రభుత్వం వస్తున్న వేళ.... ఇప్పటికిప్పుడు ఈ-ఆఫీస్ అప్ గ్రేడ్ అవసరం లేదన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా అప్ గ్రేడ్ వ్యవహారాన్ని ఆపాల్సిందిగా C.S.ను ఆదేశించాలని కోరారు. ఇప్పటికే పలు కీలకమైన రికార్డులు మాయమయ్యాయని, కొన్నిరోజుల క్రితం సీఐడీ పలు రికార్డులను కాల్చివేసిందని గుర్తుచేశారు. ప్రభుత్వ రికార్డుల మాయం, కాల్చివేతపై C.E.O.కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ నేపథ్యంలో అన్నిరకాల దస్త్రాలు, నోట్ ఫైళ్లు, రికార్డులను భద్రపరిచాలని, H.O.D కార్యాలయాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సాగిన ప్రభుత్వ వ్యవహారాలపై ఫిజికల్ డాక్యుమెంట్లు, డిజిటల్ డాక్యుమెంట్లు భద్రపరిచేలా సీఎస్‌కు ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్ ను కోరారు.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 7

  • @urvasidugana8875
    @urvasidugana8875 20 วันที่ผ่านมา

    Telangana best example

  • @PrudhviRajChokka
    @PrudhviRajChokka 18 วันที่ผ่านมา +1

    మాకు పoచాయతి అభివృద్ధి లేదు

  • @krr23
    @krr23 20 วันที่ผ่านมา +1

    Ohh Andhra ki capital lekunna, Governor vunnara?? 🤔
    Idhivaraku unna Andhra Telangana la ummadi governor garu adhikarika lanchanalatho vividha devalayala darsanam tho ayina varu kanipinchatam, vinipinchatam jarigedi. Present exclusive governor garu vunna vishayam mee media news lo political leaders applications ivvatam tho telustondi 🙏

  • @puttaputta610
    @puttaputta610 20 วันที่ผ่านมา

    కోర్టు కి వెళ్ళాలి

  • @user-mm2ny8bn2g
    @user-mm2ny8bn2g 20 วันที่ผ่านมา +2

    నిజమే, IAS, IPS లు చేసి