Naa Prapancham Short Film | LB Sriram Heart films | Bharath bandaru | Sai Srikanth | Tamada Media

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 พ.ย. 2024

ความคิดเห็น • 490

  • @lbsriram6916
    @lbsriram6916  2 ปีที่แล้ว +189

    5రోజుల్లో 100000 మంది ప్రేక్షకులు చూసిన--
    'ఒక్క వ్యక్తి యొక్క- మానసిక- సంఘర్షిత- ప్రపంచ' నేపథ్య విలక్షణ చిత్రాన్నీ , నేటి యువత అభిమతాన్నీ, సతమతాన్నీ, జీవిత సత్యాన్నీ-- ప్రయోగాత్మకంగా, ప్రబోధాత్మకంగా, మీదు మిక్కిలి ప్రతి కుటుంబంలోని అందరి సభ్యుల అభినందననీ అందుకునే చక్కటి కుటుంబ కథా చిత్రంగా తీర్చి దిద్దిన విధానాన్నీ, తన సాంకేతిక ప్రతిభనీ- ప్రతి ఫ్రేములో చాటుకుని, నిర్మించిన-
    'నా-ప్రపంచం' అనే గొప్ప విజయవంతమైన చిత్రాన్ని నా హార్ట్ ఫిలింస్ భాండాగారంలో జమ చేసిన నవ యువ దర్శకుడు 'సాయి శ్రీకాంత్' కి
    అనేక మనః పూర్వక అభినందనలూ, ఆశీస్సులూ అందిస్తూ-
    అతని ఉజ్వల భవిష్యత్తుని శుభాకాంక్షిస్తున్నాను!
    ఒక మంచి ప్రయోగాన్ని విజయవంతం చేసి, నా నమ్మకాన్ని గెలిపించిన వీక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను _/\_

    • @lbsriram6916
      @lbsriram6916  2 ปีที่แล้ว +22

      ఈ మొత్తం విజయంలో-
      నటీనటుల, సాంకేతిక నిపుణుల, మొత్తం Team సభ్యుల- భాస్వామ్యం పెద్ద మొత్తంలోనే ఉందన్న విషయం తెలుస్తూనే ఉంది! అందరికీ ప్రత్యేక అభినందనలు!

    • @thisissaisrikanth6671
      @thisissaisrikanth6671 2 ปีที่แล้ว +18

      @@lbsriram6916 నన్ను నమ్మి నాకు, నా టీంకి ఒక అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్, ఎప్పటి మర్చిపోలేను మీతో కలిసి పనిచేసిన అనుభూతిని, సంపాదించుకున్న అనుభవాన్ని...

    • @Kamaniyamramaniyam
      @Kamaniyamramaniyam 2 ปีที่แล้ว +2

      అభినందనలు సాయి శ్రీకాంత్

    • @hareshmrl8855
      @hareshmrl8855 2 ปีที่แล้ว +2

      @@lbsriram6916 నిజమే సార్...

    • @jakkulamaheshyadav3101
      @jakkulamaheshyadav3101 2 ปีที่แล้ว +3

      Goppa vallu sir🙏

  • @sivaanchula8364
    @sivaanchula8364 2 ปีที่แล้ว +105

    పాతికేళ్లకే పాతరై పోతున్న జీవితాలెన్నో, జీవితమనే పుస్తకంలో కాలిపోయిన కాగితాలెన్నో, మనవాళ్ళ ఆనందం కోసం మనసును సమాధి చేసుకుని సమాధానం దొరకని ప్రశ్నగా సాగుతున్న సందర్భాలెన్నో.

  • @Koushikeducationhub
    @Koushikeducationhub 2 ปีที่แล้ว +107

    ప్రతి అర్థం, ప్రతి మాట, ప్రతి భావం ఎప్పుడు అయితే ఎదుట వాడికి అర్థం అవుతుందో అదే మన విజయం.. 💥💥❤❤

  • @sahasratv4268
    @sahasratv4268 2 ปีที่แล้ว +29

    అయ్యా.....
    రచయిత అవటానికి సర్వం కోల్పొయి ..నాలో..నేను కూడా లేకుండా ..చాలా సార్లు నేను బికారిగా మారాను.నా నీడ కూడ నా మీద అసహ్యంతో నన్ను వదిలి వెళ్ళిపోయింది .
    నేను కొన్ని వేల సార్లు మరణించాను .కొన్ని వేల సార్లు బ్రతికాను.. . మీకుతెలీదు .
    నేను నడుస్తున్న అగ్నిగుండాన్ని.
    నడూస్తున్న వామన పాదాన్ని.
    నడుస్తున్న ఆరని స్మశానజ్వాలని
    రచయిత ..అంటే మండుతున్న రావణకాష్టం
    రచయిత అంటే తనను తాను కాల్చుకోని ..ఆ మంటల్లో వేలిగే నెలవంక
    రచయిత అంటే తనను తాను బూడిదను చేసుకోని ..
    ఆ బూడిదలోంచి..మొలిచే కొత్త పొద్దు..
    ప్రపంచం లో ఉన్న అన్ని వ్రుత్తుల్లోకెల్లా అతికష్టమైన పని రచయిత అవటం ........ప్రకాష్

    • @raviprasadmasarla2160
      @raviprasadmasarla2160 หลายเดือนก่อน

      Nijame chala baaga chepperu okkaru katha rasthe lakshala mandhi chadhuvuthaaru, Mari ee poti prapanchamlo 100 job la ki 100000 mandhi poti Mari oka rachayithaku poti entha untundhi adhi gelechedendharo

  • @baswarajmangali2594
    @baswarajmangali2594 2 ปีที่แล้ว +65

    మనలో కళ ఉన్నా దారిచుపించే వేళ్ల కన్నా
    వెక్కిరించే నోళ్లే ఎక్కువ!....
    ఆశలు ఆకాశాన్ని అంటుతాయి,
    ఊహలు ఉవ్వెత్తున లేస్తాయి.
    కానీ,
    నిజం నిన్ను భూమ్మిదే ఉంచుతుంది.
    ధోని బ్యాట్ పట్టినపుడు,
    చిరంజీవి డ్యాన్స్ కట్టినపుడు,
    బాలు గాత్రం విన్నపుడు,
    బాపు చిత్రం కన్నపుడు,
    కళ కోసం కదిలిన కాళ్ళు ఎన్నో
    కల చేదిరి తడిసిన కళ్ళు ఎన్నో!

  • @madhukar_writings
    @madhukar_writings 2 ปีที่แล้ว +33

    కన్నీళ్లు నీ భాధకి చిరునామ అయితే
    సంతోషం నీ విజయానికి చిరునామ.
    బంధాలకి, బంధుత్వాలకి.. జీతానికి, జీవితానికి, జీవానికి మధ్యలో పడే జీవన అంతర్మదనం...
    బ్రతికున్నప్పుడే కాదు చచ్చాక కూడా స్వేచ్ఛ దొరకదు
    Super short film from you L.B SRI RAM GARU
    ఒక్క కవిత్వం ఈ చిత్రాన్ని బ్రతికిస్తుంది...

  • @visistadhayini4070
    @visistadhayini4070 2 ปีที่แล้ว +17

    చాలా బాగుంది... చాలా బాగా తీసారు, దర్శకత్వ విలువలు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ కి నా అభినందనలు.

  • @venkatreddy7135
    @venkatreddy7135 8 หลายเดือนก่อน +4

    కళ కి త్యాగాన్ని జోడించి ముగించారు
    Lb sriram gaari సీన్ సూపర్ గా ఉంది
    కళాకారులు తన కళ కోసం జీవితాన్ని త్యాగం చేశారు తనలో ఉన్న ఏ కళ అయినా తనని అవకాశం కోసం వెతకమని నిరంతరం చెప్తూనే ఉంటుంది తన వాళ్ళ కోసం కళను త్యాగం చెయ్యటం బాలేదు

  • @yaswanthsuvvari5948
    @yaswanthsuvvari5948 2 ปีที่แล้ว +32

    ప్రతి మనిషికి ఆశలు ఉంటాయ్ ఆశయాలు ఉంటాయ్.. కానీ అందరికీ ఆస్తులు ఉండవ్.. అవసరాలు ఆగవ్.. బాధ్యతలు వదలవ్.. బంధాలు విడవవ్.. వీటికి కొంతమంది తలవంచక తప్పదు.అలా అని తలవంచని వారులేకపోలేదు వారెవరో మనకు తెలుసు.. ఇక తలదించలా...తలవంచలా నిర్ణయం మనదే.

    • @rambabumuddada8467
      @rambabumuddada8467 ปีที่แล้ว +1

      Nuvvu cheppedi nijam bro...kakapote talavanchakunda success ayinavaaru padullo unte,failure ayinavaallu velallo unnaru...aa bhayame talavachela chestundi.

  • @memecediy-8442
    @memecediy-8442 2 ปีที่แล้ว +36

    ప్రతి పదం.. ప్రతి మాట.. ఎంతో అర్థం ఉంది... 99% ప్రతి మనిషి జీవితం లో జరిగే ఒక అంతర్మధనం 🙏🙏

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 2 ปีที่แล้ว +8

    ఎన్ని మనసులో అన్ని ప్రపంచాలు..ఎవరెవరి ప్రపంచం వారిదైనా అందరూ బ్రతికేది నూరేళ్ళే కదా.! కాబట్టి...
    ఆశ్రమ ధర్మాలననుసరించి బాల్యంలో బ్రహ్మచర్య ధర్మాన్ని, యవ్వనంలో గృహస్థు ధర్మాన్ని, నడి వయసు నుండి వాన ప్రస్థ ధర్మాన్ని,వృద్ధాప్యంలో సన్యాస ధర్మాన్ని స్వీకరించడం సర్వదా శ్రేయస్కరం.!
    🙏🙏🙏

  • @nayakalluprashanth308
    @nayakalluprashanth308 2 ปีที่แล้ว +15

    నేను మధ్యలో వదిలేసిన పుస్తకం మళ్ళీ నాకు గుర్తు చేశారు...ఇప్పుడు అది పూర్తిగా చదువుతా,, అదే చివరకు మిగిలేది...మీకు కృతజ్ఞతలు. కథలో చాలా balanced గా
    మన కల త్యాగం ...మన వాళ్ల క్షేమం
    చూపించారు... మీ అనుభవాలు నాకు చాలా కావాలి...

  • @rajasekharmodugumudi8710
    @rajasekharmodugumudi8710 2 ปีที่แล้ว +13

    Excellent sir . కుర్రాడు కూడా ఇరగ దీసాడు...
    మీకు ప్రశంస కూడా తక్కువే...మాటలకందని భావం..మీ నటన..

  • @varunkumarayyapu7649
    @varunkumarayyapu7649 2 ปีที่แล้ว +12

    అద్భుతమైన లఘు చిత్రం గురువు గారు
    ఈ జీవిత బంధాల మధ్యలో పరిస్థితుల ప్రభావం వలన కల ఎపుడు ఓడిపోతునే ఉంటుంది గురువు గారు.

  • @muneendrayerrabathina4793
    @muneendrayerrabathina4793 2 ปีที่แล้ว +10

    గుడ్ ఈవినింగ్ గురువుగారూ....🙏🙏🙏🙏
    బంధాల పంజరంలో చిక్కిన బాధ్యతల రెక్కలు కట్టిన పక్షి కి ఆ పంజరమే కదా ప్రపంచం...
    వాస్తవాన్ని చూపించారు...చాలా బాగుంది...💐💐💐💐💐💐💐💐💐👏👏👏👏👏

  • @umaranipinnamaneni3202
    @umaranipinnamaneni3202 2 ปีที่แล้ว +6

    Very nice. మనిషికి తనకేం కావాలో ఆని తెలుసుకోవాలి ఈ జీవితం ముగిసేలోగా అనేది చాలా సింపుల్ గా మనసు హత్తుకునేలాగా చూపించారు. చాలా బాగుంది.

  • @tsrvenkat
    @tsrvenkat 2 ปีที่แล้ว +5

    మనలోని కళ వృత్తి గా ఎదగక పోయినా మన ప్రవృత్తి గా మనలో మనతో ఉంటుందనుకుంటా. బాగుంది అండీ ఫిల్మ్.

  • @krishnamoorthykadayinti6637
    @krishnamoorthykadayinti6637 2 ปีที่แล้ว +5

    అద్భుతం ఆర్యా.
    అద్దంలో చూసుకోవడానికి ధైర్యం ఉండాలి.నజం.
    కృష్ణ మూర్తి.

  • @MandapatiSatyam
    @MandapatiSatyam 2 ปีที่แล้ว +5

    ఇది ఒక లఘు చిత్రం కాదు, ఆకాశమంత పెద్ద చిత్రం. మీ అందరికి అభినందనలు.

  • @srisimhacreations
    @srisimhacreations 2 ปีที่แล้ว +8

    It's not short film, from now it's my Heart film.
    LB geri *ప్రతి మాట నా హృదయం నాతో మాట్లాడుతున్నట్టు ఉంది*

  • @harishallarapu3553
    @harishallarapu3553 2 ปีที่แล้ว +5

    నా కథ నేను చూస్తున్నట్టు అనిపించింది...
    నేను రచయితని అవ్వాలి అనుకున్నాను...
    నేను పెళ్లి అయ్యి సంసారాన్ని ఈదు తున్నాను... ఏదో ఒక విషయానికి కట్టుబడి ఉండకపోతే... ఈ బ్రతుకు అనే ప్రయాణాన్ని చేయలేం... అందుకే బంధానికి కట్టుబడి ఉన్నాను... అలా అని కలాన్ని వదిలేయలేదు, వదిలేయలేను... చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తూ అలా ముందుకి పోతూ నన్ను నేను కోల్పోకుండా బ్రతుకుతున్నాను...
    మీ లఘు చిత్రానికి నా పాదాభివందనం 🙏...
    ముఖ్యంగా గురువుగారి నటనకు🙇...
    #harish.wrigings on Instagram
    మిగిలిన అందరూ చాలా బాగా చేసారు... అన్ని డిపార్ట్మంట్స్ కూడా చాలా బాగా పని చేశారు....👏👏👏👏🙏

  • @sureshvarma6990
    @sureshvarma6990 2 ปีที่แล้ว +15

    ఎల్. బి.గారు మరోసారి మా ‌హృదయాన్నీ హత్తుకునే హర్ట్ ఫిలిం అందించినందుకు ధన్యవాదాలు.
    మీ హర్ట్ ఫిలింస్ చూడడం , కొత్త హర్ట్ ఫిలిం ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూడడం ఒక మంచి వ్యసనం లా తయారయింది నాకు.

  • @lakshmiraokokkeragadda4152
    @lakshmiraokokkeragadda4152 2 ปีที่แล้ว +3

    చాలా బాగా రాశారు.. తీశారు
    .చేశారు.. కలం కన్నా కుటుంబమే గొప్పదని నిరూపించారు. కళ.. కల కాకుండా ఉండాలంటే..కాలం కలిసి రావాలి కానీ..బంధాలను విడిచి పెట్టకూడదన్న సత్యాన్ని ఆవిష్కరించారు.."నా ప్రపంచాన్ని.."మన" ప్రపంచం చేశారు...అభినందనలు..lb. శ్రీరామ్ గారూ..... కె.వి.లక్ష్మణరావు

  • @satyapriya9493
    @satyapriya9493 2 ปีที่แล้ว +10

    మంచి రచన ఇప్పుడసలు ఈతెలుగే అర్థంకాదెవరికీ...అభినందనలు,ధన్యవాదాలు...సత్యప్రియాదేవ్🙏🙏👌👌👌👌

  • @rajudevalla9931
    @rajudevalla9931 2 ปีที่แล้ว +13

    నా ప్రపంచం ఒక అద్భుతం
    ఎల్బీ శ్రీరామ్ గారు చాలా బాగా చేశారు
    డైరెక్షన్ చాలా బాగుంది congrats 🌹🌹👍 శుభాకాంక్షలు

  • @miss.unique1008
    @miss.unique1008 2 ปีที่แล้ว +12

    కథ.. కథనం... ఒక పాతిక ముప్పైయేళ్ళ కుర్రాడి ఆలోచనలు.. మానసిక సంఘర్షణలు చాలా బాగా చూపించారు...hearty congratulations to the entire team💐💐💐💐🎊🎈🎉🎈🎊

  • @budagamsatyanarayana1
    @budagamsatyanarayana1 2 ปีที่แล้ว +3

    కృతజ్ఞతలు గురువు గారు మీ కు నా పాదాభివందనం.
    కళ మరియు జీవితం
    విలువలు అర్థం అయ్యేలా
    చెప్పారు.

  • @vanjaneyulu8767
    @vanjaneyulu8767 2 ปีที่แล้ว +10

    ఈ చిత్రంలో ప్రధానంగా పోషించిన రెండు పాత్రలు తమ యొక్క వాదన కరెక్ట్ గానే వినిపించాయి అని అనిపిస్తూ ఉంది చాలా మంచి చిత్రాన్ని మాకు అందించినందుకు దర్శక నిర్మాతలకు నటీనటులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు

  • @AnilAnil-fb9dh
    @AnilAnil-fb9dh 2 ปีที่แล้ว +10

    జీవిత చక్రం ఆవిష్కరించారు.....అద్భుతం సార్

  • @naveenank2213
    @naveenank2213 2 ปีที่แล้ว +3

    మంచి సందేశం అని చెప్పాలా... ఇదే ఎందరో జీవితల్లో (కల )ఉండి బయట కి వాలా ఆర్థిక పరిస్థుల వలన చెప్పలేక జీవిస్తున్న వ్యక్తులు ఎందరో ఉన్నారు సార్....మాటల రూపంలో జీవితాన్ని చూయించారు 😇🙏🏻💫

  • @sreetejasravibillupati4708
    @sreetejasravibillupati4708 2 ปีที่แล้ว +2

    సినీ ఆకాశంలో (గగనంలో ) కష్టాల కళోలంలో ఊహల్లో ఎగిరే నా తోటి సినిమా మిత్రులకు చక్కని వివరణ...Sir.

  • @lokeswarareddy6101
    @lokeswarareddy6101 2 ปีที่แล้ว +2

    రామ్ మనోహర్ కడిమిచర్ల .... మనోహరన్న...... Your Dialogues Are Very Poetic

  • @d.someswararao4824
    @d.someswararao4824 2 ปีที่แล้ว +3

    చాలా చాలా బాగుంది సార్ ఈ సినిమా చూస్తూంటే మీ పాత్రలో నన్ను చూసుకున్నట్లు అనిపించింది

  • @satya3636
    @satya3636 7 หลายเดือนก่อน +10

    కడుపులో కళని దాచుకొని, చదివిన చదువుని పట్టాల్లో కట్టిపెట్టి, కుటుంబం కోసం కూలీలా మారిన ప్రతి అబ్బాయి కథే......ఈ కథ✍️🚶💔

  • @praveensanku4996
    @praveensanku4996 2 ปีที่แล้ว +3

    అక్షరం అనీ రాయాకా
    బ్రతుకు అనే బంధం లో నలుగు తున్నా ఓ మాటా ని అందంగా ఇప్పటి తరం నీకి అద్దములా చూపించారు ఈ అక్షరం చేరగాదు
    మీ
    ప్రవీణ్ ✍️

  • @indragantisrinivas1879
    @indragantisrinivas1879 2 ปีที่แล้ว +2

    జీవిత చక్రం ఆవిష్కరించారు. మనిషి జీవితంలో సంఘర్షణ చాలా బాగుంది. మీ మనోవేదన ఎంత వాస్తవమో, అతని నిర్ణయం కూడా అంతే అవసరం. మమ్మల్ని మేము అద్దంలో చూసుకున్న ట్లు ఉంది. మీ ఇద్దరికీ అభినందనలు. 👌👌👏👏👏

  • @bapanapallivenkatanagasaik9430
    @bapanapallivenkatanagasaik9430 2 ปีที่แล้ว +1

    Rachayatha thana gurinchi prapanchaniki telavali anta thanu rasa aksharalo unda ardham, bhavam samthulyam ga untana, aa kadha ki pranam maryu villuva.
    Meru chepina e kadha lo oka jeevitham undi.. jeevetham anta andaru putuka maryu chavu antaru. Kani na udhasamlo jeevitham anta oka badhyatha dhnaitho patu mana kalalu neraverchukovadam. Ala Ani badhyatha valla kalalu mathram chapukokandi......
    Thanks LB Sriram garu comming up with such a beautiful story and line up......

  • @a_s_bharadwaj
    @a_s_bharadwaj ปีที่แล้ว

    అంతా బాగానే ఉందిగాని మనశ్శాంతి కి తాగుడు అవసరం అని చెప్పడం ఒక నెగటివ్ మెసేజ్ ఇస్తోంది సమాజానికి. ఎన్నో హృదయానికి హత్తుకునే షార్ట్ ఫిలిమ్స్ తీసిన LB Sriram గారి నుండి ఇది ఊహించలేదు.

  • @madhurikella5415
    @madhurikella5415 2 ปีที่แล้ว +3

    Really superb short film sir
    అక్షరానికి జీవితానికి మధ్య జరిగిన అంత మధ్యమాన్ని అద్భుతంగా చూపించారు👍👏👏

  • @akrcreations8376
    @akrcreations8376 2 ปีที่แล้ว +4

    అద్భుతం గురూజీ... మంచి స్ఫూర్తినిచ్చే షార్ట్ ఫిల్మ్... మంచి మెసేజ్... 👌👌👌🙏🙏🙏👍👍👍

  • @vimalavimmu4424
    @vimalavimmu4424 ปีที่แล้ว +1

    eerogullo elanti message oriented films.. Raavadam impossible... Thanks for showing simplicity of middle class dreams.... 😊💛🙏🙏😍

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 2 ปีที่แล้ว +2

    SRI RAM GARI HEART FILM. ... మానవజీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి SRIRAM గారి ఈ కధ. ఎన్నో జీవితాలు ఇలాగే ముగిసిపోతాఇ . చాలా HEART TOUCHING STORY. CONGRATULATIONS.

  • @rajeshyadhav1192
    @rajeshyadhav1192 2 ปีที่แล้ว +2

    చాలా మంచి స్టోరీ sir. నేనూ కూడా ఆ delivery boy లాగానే ఆలోచిస్తున్నను. నా వాళ్ళ కళ్ళలో ఆనందం చాలు, నా కష్టం, బాధ మర్చిపోవాడానికి .....🥺🥺🥺

  • @rameshpilli9408
    @rameshpilli9408 2 ปีที่แล้ว +6

    కలం తో కదిలిన అక్షరాలు, కళ్ళతో చూసి, హృదయాన్ని తట్టిలేపేది కళ........ అది lb he'arts film.....

  • @teluguchannel2004
    @teluguchannel2004 2 ปีที่แล้ว +15

    ❤️❤️❤️❤️❤️... నిజం గా చాలా బాగుంది.... లాస్ట్ హీరో డెసిషన్ చాలా బాగుంది.... నా నిజ జీవితం లో నేను మారిపోయినట్లు గా బలే పెట్టారు 👌👌👌👌

  • @jassikalyanentertainmentvl8903
    @jassikalyanentertainmentvl8903 2 ปีที่แล้ว +8

    జనాన్ని నమ్మి మీరు ఈ కధ చెప్పలేదు sir నిజాన్ని నమ్మి తీశారు. 🙏🙏

  • @gandhibabu7351
    @gandhibabu7351 2 ปีที่แล้ว +3

    అప్పటి కాలంలో అదీ నిజం ఇప్పటి కాలంలో. ఇది నిజం కాలానుగుణంగా మానవులు ప్రవర్తించాలి

  • @gowrabathininareshkumar5878
    @gowrabathininareshkumar5878 2 ปีที่แล้ว +2

    Nee adham ninu prasninchalamunde
    . Ninu nuvu yethuko... Great dialogue.. inspired me..

  • @nagabhushanamshankam6155
    @nagabhushanamshankam6155 2 ปีที่แล้ว +5

    మమ్మల్ని మేము చూసుకున్నట్టుంది సార్ కన్నీళ్లు వస్తున్నాయి ఏమో కలలు కంటూ కుటుంబం కోసం ఉద్యగం చేసుకుంటూ ఆ కలలో అన్నిటిని క ల్లలుచేసుకున్నా ఇంకా ఏదో ఆశ వెన్నడుతోంది

  • @manjulathag4298
    @manjulathag4298 2 ปีที่แล้ว +2

    నిజానికి మనిషి కి చివరి దశ లో తన కళ కూడా తనతో ఉండదు...... ఒక వేళ ఆ కళ వల్ల పేరు ప్రతిష్ట లు ఆస్థి పాస్థులు వచ్చి ఉంటే అవి మాత్రమే మిగులుతాయి..... అవి కూడ తోడు లాగ అనిపించదు
    సాటి మనుషుల తో కలిసి మెలిసి ఉండటం (తన కుటుంబం అయినా కాక పోయినా కూడ ) మాత్రమే ఆనందాన్ని ఇస్తుంది

  • @triveni8172
    @triveni8172 2 ปีที่แล้ว +3

    Director garu really heart touching story rasaru prithi meaning chala Baga varuniecharu super sir

  • @iamnode2088
    @iamnode2088 2 ปีที่แล้ว +2

    master piece
    epudu antharmadhanam lo vuna
    athma vedhanaku oopiri iche mee matalu maa jeevithanaiki
    jaagrutha geethalu

  • @apoorvagupta214
    @apoorvagupta214 ปีที่แล้ว +6

    As an Artist I always struggle between choosing my passion and a job to survive. The movie showed this dilemma beautifully. A must watch 👍👍 looking forward to more such movies from you guys. All the best!

  • @m.s.goutham8940
    @m.s.goutham8940 2 ปีที่แล้ว +26

    Dear Srikanth, just finished viewing your short film. Felt very happy looking at two of my past students, you behind the camera and Suchala in front of the camera. SUUUUUUUUUPER effort. Hearty congratulations to the whole team & regards to Sri. Sriram garu. KEEP GOING. ALL THE BEST.

  • @srinivasulu9054
    @srinivasulu9054 2 ปีที่แล้ว +3

    మనం ఒక్కొక్క స్టేజిలో ఒక్కొక్కరి కోసం బతుకుతాం,,జీవిత సత్యం

  • @sreedharrepakula8628
    @sreedharrepakula8628 2 ปีที่แล้ว +3

    My dear Super Star of short films, one more nice story from you. A really appreciable solution. Live for our family 👍👍👍👍

  • @hemanthaugust7217
    @hemanthaugust7217 2 ปีที่แล้ว

    na vaalla gelupu mundu na ootami chaala chinnadi...ide pratee magadu & nanna chesedi...kaane enduko nanna venakapadipoyadu (Tanikella Bharani gari speech lo chepinattu) ..great video sir LB Sriram garu!!

  • @hemakotvali2217
    @hemakotvali2217 2 ปีที่แล้ว +1

    very beautiful. These days man only think of themself, selfishly but what the hero took decision was the right one. Its not just his wife and many around them that will be happy one single person's selfless decision.

  • @swethaguduri6579
    @swethaguduri6579 2 ปีที่แล้ว +3

    Thank you so much SIR for your meaningful message...🤝

  • @dadivenkat4213
    @dadivenkat4213 2 ปีที่แล้ว +3

    Those who are in dilemma about life has to see this episode. Excellent.

  • @greshmacreations7957
    @greshmacreations7957 2 ปีที่แล้ว +1

    కొందరి జీవితాలలో నా అనుకునే వారికోసం కుటుంబ సంతోషం కోసం కష్టాలు అనుభవించక తప్పదు వారి జీవితాన్ని అంకితం చెయ్యకా తప్పదు, అలాగే కొందరి జీవితాలలో వెలుగు రావాలంటే మరికొందరు చీకటిలో కలిసిపోక తప్పదు ...

  • @swarna3611
    @swarna3611 2 ปีที่แล้ว +5

    This is the real story of many talented young men minded fellows
    How actually can't live there own life under the influence of family.
    Exactly what he says is right at age of 70s parents is no more
    Our own children will be far away then for whom we actually sacrifice that day
    Sad really of many young people's 😭😭 thanks for this realisation.

  • @varun3748
    @varun3748 2 ปีที่แล้ว +22

    This movie is made so intellectually... It could hold back the audience with such an amazing dialogues and interesting flow.
    Congratulations. We need more from you ❤️

    • @bontalachiranjeevi7056
      @bontalachiranjeevi7056 2 ปีที่แล้ว +1

      Hi bro small doubt
      Final ga compromise avvalsindega family and job...

    • @sitaiahmaguluri7187
      @sitaiahmaguluri7187 ปีที่แล้ว

      This movie is made so intellectually . It could hold back the audience with such an amazing dailogs.

  • @pavant5172
    @pavant5172 2 ปีที่แล้ว +2

    Bharath anna neku pedda fan Anna nenu
    Chala bagundi series ❤️

  • @tippiriakilesh
    @tippiriakilesh 2 ปีที่แล้ว +4

    సార్ అద్భుతం 💞💞ఇంతకన్నా ఎక్కువ నేను ఏమీ చెప్పలేను 💞🎊

  • @vennelavennela6981
    @vennelavennela6981 2 ปีที่แล้ว

    chala chala adbutham ga undhi prathi Mata prathi bhavam manasuni kadhilinchi kallalonchi kanniti chukkalu vachayi,,,idhe mee gelupu iam so happy last lo brother cheppina words na jeevitham nenu chesthunadhi okate ,,tq you soooo much .and super ga chupibcharu ,L B Sriram gaaru kuda chala baaga chesaru.

  • @soarnswifteduacademypvtltd9156
    @soarnswifteduacademypvtltd9156 10 หลายเดือนก่อน

    LB SRI RAM garu is a versatile actor. He lives in his Acting. Everyone did well. It is always a question when it comes to life : Responsibility Or Passion?

  • @ishaqahmedshaik9281
    @ishaqahmedshaik9281 2 ปีที่แล้ว +8

    Superb shortfilm!Most relevant to the present times- conflict between Responsibilities and passion!Very nicely shown!Thanks very much LB Shriram Sir and team!

  • @revuriprasanthi4333
    @revuriprasanthi4333 2 ปีที่แล้ว +9

    Hat's off to the writer and entire team of this short best film. Because I am suffering with the same dilemma of protagonist. L.B .bhayya.you gave nice answer to many like me. We need more like this special short film.

  • @madhubollimuntha3035
    @madhubollimuntha3035 8 หลายเดือนก่อน

    మనిషిని దహించేది మనసు. మనం చేసే తప్పును మన మనసే ప్రశ్నిస్తుంది. మన కన్యాయం జరిగితే వాడిపై తిరగబడు అని చెప్తుంది.. అలాంటి తిరుగుబాటును మాత్రం ఏ మనిషి కోల్పోకూడదు🎉❤😊

  • @thedancebeatstudio5943
    @thedancebeatstudio5943 2 ปีที่แล้ว +5

    ఈ చిత్రం ఒక అద్భుతం💫❤️

  • @satyabangaru2236
    @satyabangaru2236 2 ปีที่แล้ว +2

    బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది తాత గారు

  • @kranthi143B
    @kranthi143B 2 ปีที่แล้ว +4

    కల కాలానికి సంబంధించినది.
    కళ మనసుకు సంబంధించినది.

  • @prasad8738
    @prasad8738 2 ปีที่แล้ว +5

    Each sentence, each word makes feel high.without any bgm we are in trance with their voice and dialogues...

  • @nageshwarmula380
    @nageshwarmula380 2 ปีที่แล้ว +2

    Chala బాగుంది మీయొక్క staff అందరకు ధన్య వాదములు సర్

  • @prashantharimella9234
    @prashantharimella9234 2 ปีที่แล้ว +5

    డాడీ....నా...ప్రపంచాన్ని...
    చాలా...సింపుల్ గా...చూపించారు...
    ఐనా...చాలా గొప్పగా చూపించారు... 💐💐💐💐💐
    అందుకే... మిమ్మల్ని LB daddy అంటాను💐💐💐💐
    Congratulations 💐💐💐daddy💐💐💐💐💐

    • @sumanthchava974
      @sumanthchava974 2 ปีที่แล้ว +1

      Dialogues super and excellent direction. All the best for future ones.

  • @arjun__Yadav4046
    @arjun__Yadav4046 2 ปีที่แล้ว +1

    this 21 minutes shor film used for taking my own decision tq to all team

  • @Venkata_krishna258
    @Venkata_krishna258 2 ปีที่แล้ว +4

    So emotionally & super shortfilm & In this
    shortfilm there r so many amazing dialogues & the audience will be choose this type of shortfilms & we want this type of shortfilms from this channel as a fan of this shortfilm... 🥰🥰🥰❤💛💙

  • @sekharr4163
    @sekharr4163 2 ปีที่แล้ว +2

    Excellent. Great film. Appreciated complete team. You done an excellent job. Sriram garu take a Bow.

  • @rajeshvarig3780
    @rajeshvarig3780 ปีที่แล้ว

    ప్రతి అక్షరం కన్నబిడ్డ లా అనిపించేది.ఎంత భావుకత దాగి ఉందో

  • @alamandasrinu2690
    @alamandasrinu2690 2 ปีที่แล้ว +1

    Blockbuster Comeback Sir Super super చాలా బాగుంది సార్ అద్భుతం

  • @sumasri266
    @sumasri266 2 ปีที่แล้ว +9

    Excellent Team effort 👌👌
    Brilliant screen play👏👏
    Real story of every struggling movie technician

  • @kashni
    @kashni ปีที่แล้ว

    Super story.. writer ki hatsoff .. many thanks to heart films team for getting this on screen..

  • @subniveesupadmavati8211
    @subniveesupadmavati8211 หลายเดือนก่อน

    Adbhuthamaina kadanika sriram garu bhavukata kaligini prathi okkariki edi anubhavamemo..any how i congratulations once again gor sharing awesome one

  • @sivanathkhandavalli
    @sivanathkhandavalli 2 ปีที่แล้ว +3

    As our ancestors told several times, life has several stages which are inter-linked. At one stage one has to give utmost priority to his/her family but can try to balance this with pursuing their own desire, be it an art or anything. This balancing is very crucial. Of course, it is not easy to strike balance.

  • @venkataramanacreations414
    @venkataramanacreations414 2 ปีที่แล้ว +1

    అక్షరాన్ని.. మాటలు చేసి. మాటలని. ఒక సందర్బంగా రాశాను. కెమెర..కంటికి రావాలి అంటే కరెన్సి కట్ట కావాలి..అవి లెవు అందుకే. ఈ రచయత గా గుర్తింవు రాదు.. రచయిత మనసు మరొక రచయిత తెలుస్తుంది 🙏నాకు అవకాశం వుంటుందా..? సార్

  • @akashreddy6649
    @akashreddy6649 2 ปีที่แล้ว +3

    Awesome film, especially last few minutes superb, kiraak undi bro, all the best for future films

  • @darshinisiripuram5167
    @darshinisiripuram5167 2 ปีที่แล้ว +3

    Really heart touchingg...🥰🥰🥰😍😍😍😘

  • @gattubharadwaj1212
    @gattubharadwaj1212 2 ปีที่แล้ว +4

    A very good message. Evey man or every person who has taken responsibilities will connect well to this story. All the best srikant. Long way to go. And keep doing such good films.

  • @obulesjobulesh5189
    @obulesjobulesh5189 4 หลายเดือนก่อน +1

    Good Movie Sir

  • @subhashchandrabose488
    @subhashchandrabose488 ปีที่แล้ว

    Lb sriram garu ❤❤❤ matalu chala chala balamga unnai bro

  • @lakshmisindhu5723
    @lakshmisindhu5723 2 ปีที่แล้ว

    I am impressed this concept. Each and every one felt and observed this in their lives. Hatsoff l.b.sriramgaru

  • @komatirajkumar1430
    @komatirajkumar1430 2 ปีที่แล้ว +3

    చాలా బాగుంది.

  • @Chanduedits2.o
    @Chanduedits2.o 7 หลายเดือนก่อน

    జీవిత సత్యాన్ని ఆవిష్కరించారు

  • @ashwinsuthraye3661
    @ashwinsuthraye3661 ปีที่แล้ว +2

    Excellent short film.....Hats off to the entire team👏

  • @seethajyothi7610
    @seethajyothi7610 2 ปีที่แล้ว +1

    Maa vari life future ni motham chupinchaaru sir ! Thank you sir !!!

  • @nlakshmi4225
    @nlakshmi4225 10 หลายเดือนก่อน

    నన్ను నేనుకోల్పోయిన వైనం. నావృత్తి కీ ప్రవృత్తి కీ నామానసిక ప్రవర్తనకీ బాహ్య ప్రవర్తనకీ పొంతన లేనీ జీవనయానం. ఏమాత్రం సంబంధం లేని పోరాట మనుగడ. ఇదేననుకుంటా విధిలిఖితం.

  • @shidduroacher8576
    @shidduroacher8576 2 ปีที่แล้ว +4

    What a beautiful film it it 😍❤️
    Each one Dialogues and characters are superb.👌

  • @seedralapoornachandrarao
    @seedralapoornachandrarao 7 หลายเดือนก่อน

    🇮🇳చాలా బాగున్నది అద్భుతం ❤️

  • @alberttrinadh890
    @alberttrinadh890 ปีที่แล้ว +1

    నాలోని రచయితకు ప్రతి ఉదయం మరణం
    EVRU SIR AA LINE RASINDHI,,,,,,
    Aaaa pain oka writer ki mathramey ardhamvthundhi