పల్లవి: బాధ్యత మరచిన బాటసారీ నీ పయనం ఎక్కడికీ ? బ్రతుకు భారమును మోసుకుంటూ పరుగులు ఎక్కడికీ ? "2" అ.ప. దేహమే శాశ్వతమా నీకూ ? దేవుడే చులకనాయే నీకూ...! నీ సొంతం అనుకున్నదేది రాలేదు ఎక్కడికీ...! ఏనాడు ఎక్కడికీ...! || బాధ్యత మరచిన|| 1. పాప శాపములచే సచ్చే నిన్నూ బ్రతికించా.. పరలోక వాసుడమ్మా నీకై మనిషిగా పుట్టిండూ..౹౹2౹౹ ఈ లోకమందు నీవెట్లుండాలో బ్రతికీ నేర్పిండు నీకూ మాదిరి చూపిండూ... తన జీవమూది నీకు ప్రాణ యేసుకే నీవు దూరమా తన ప్రాణమిచ్చి నిను రక్షించిన యేసయ్య సన్నిధికి చేరుమా... ౹౹బాధ్యత౹౹ 2. నీ చేతుల పాపములూ తన చేతిలో మేకులుగా.... నీ రోగములన్నిటినీ వీపున కొరడా దెబ్బలుగా భరియించీ తన రక్తము కార్చీ నిను విడిపించాడు కన్నా ప్రేమను చూపాడు... తన అరచేతిలో నిను చెక్కిన ఆ యేసునే నీవు విడుతువా? తల్లి గర్భములో నిను రూపించిన సృష్టికర్తను మరతువా...? 3. నీ పాప భారమంతా తను సిలువగా మోసిండూ... సైతాను శక్తులన్నీ సిలువలోచితుకనే త్రొక్కిండూ ఓ తల్లి ఈ యేసు రక్తములో విడుదల నీకుందీ చెల్లీ రక్షణ నీకుందీ మరణాన్ని గెలిచినా పునరుద్ధానుని చేరవా ఓ సోదరా.... వధియించబడిన ఈ గొర్రేపిల్ల గాయాలను తేరి చూడవా...? 4. యేసు నామమునే నీకు రక్షణ ఉందన్నా ప్రభు యేసుని రక్తముచే నీవూ కడుగ బడాలన్నా ఓ తల్లీ ఈ లోక పాపమును విడిచి పెట్టు తల్లీ పర లోకముంది తల్లీ..... పరమువీడి నర లోకమొచ్చే నీ కోసమే ఆ యేసయ్యా.... ఏ ఒక్కరు కూడా నరకం వెళ్లుట దేవుని ఇష్టం కాదయ్యా...... 5. ఇది కల్లగాదురన్నా పిట్టా కథలు కావురన్నా బైబిల్ చదువన్నా సత్యం బయలుపడుతదన్నా సత్యమెరిగి ఈ నిత్య దేవుని భక్తితో కొలువన్నా నీకూ ముక్తి కలుగునన్నా.... పరమువీడి నర లోకమొచ్చే నీ కోసమే ఆ యేసయ్యా.... ఏ ఒక్కరు కూడా నరకం వెళ్లుట దేవుని ఇష్టం కాదయ్యా...... ౹౹బాధ్యత౹౹
పల్లవి: బాధ్యత మరచిన బాటసారీ నీ పయనం ఎక్కడికీ ?
బ్రతుకు భారమును మోసుకుంటూ పరుగులు ఎక్కడికీ ? "2"
అ.ప. దేహమే శాశ్వతమా నీకూ ? దేవుడే చులకనాయే నీకూ...!
నీ సొంతం అనుకున్నదేది రాలేదు ఎక్కడికీ...!
ఏనాడు ఎక్కడికీ...!
|| బాధ్యత మరచిన||
1. పాప శాపములచే సచ్చే నిన్నూ బ్రతికించా.. పరలోక వాసుడమ్మా
నీకై మనిషిగా పుట్టిండూ..౹౹2౹౹
ఈ లోకమందు నీవెట్లుండాలో బ్రతికీ నేర్పిండు
నీకూ మాదిరి చూపిండూ...
తన జీవమూది నీకు ప్రాణ యేసుకే నీవు దూరమా
తన ప్రాణమిచ్చి నిను రక్షించిన యేసయ్య సన్నిధికి చేరుమా... ౹౹బాధ్యత౹౹
2. నీ చేతుల పాపములూ తన చేతిలో మేకులుగా....
నీ రోగములన్నిటినీ వీపున కొరడా దెబ్బలుగా
భరియించీ తన రక్తము కార్చీ నిను విడిపించాడు
కన్నా ప్రేమను చూపాడు...
తన అరచేతిలో నిను చెక్కిన ఆ యేసునే నీవు విడుతువా?
తల్లి గర్భములో నిను రూపించిన సృష్టికర్తను మరతువా...?
3. నీ పాప భారమంతా తను సిలువగా మోసిండూ...
సైతాను శక్తులన్నీ సిలువలోచితుకనే త్రొక్కిండూ
ఓ తల్లి ఈ యేసు రక్తములో విడుదల నీకుందీ
చెల్లీ రక్షణ నీకుందీ
మరణాన్ని గెలిచినా పునరుద్ధానుని చేరవా
ఓ సోదరా....
వధియించబడిన ఈ గొర్రేపిల్ల
గాయాలను తేరి చూడవా...?
4. యేసు నామమునే నీకు రక్షణ ఉందన్నా
ప్రభు యేసుని రక్తముచే నీవూ కడుగ బడాలన్నా
ఓ తల్లీ ఈ లోక పాపమును విడిచి పెట్టు తల్లీ
పర లోకముంది తల్లీ.....
పరమువీడి నర లోకమొచ్చే నీ కోసమే ఆ యేసయ్యా....
ఏ ఒక్కరు కూడా నరకం వెళ్లుట దేవుని ఇష్టం కాదయ్యా......
5. ఇది కల్లగాదురన్నా పిట్టా కథలు కావురన్నా
బైబిల్ చదువన్నా సత్యం బయలుపడుతదన్నా
సత్యమెరిగి ఈ నిత్య దేవుని భక్తితో కొలువన్నా
నీకూ ముక్తి కలుగునన్నా....
పరమువీడి నర లోకమొచ్చే నీ కోసమే ఆ యేసయ్యా....
ఏ ఒక్కరు కూడా నరకం వెళ్లుట దేవుని ఇష్టం కాదయ్యా...... ౹౹బాధ్యత౹౹
Praise the lord brother great and wonderful song reminder God's love our responsibility
షాలోమ్ Annaya songs super excellent god bless you🙏🌹🎄🛐✝️⛪🇮🇳🙏
🙏 dhevunike mahima
Lyrics also keep brother for every song
Okay brother....👍
Music sariga kottaledu bro