🤱🤱🧚♂️ Rama Lali Rama Lali 🤱🤱🧚♂️
ฝัง
- เผยแพร่เมื่อ 23 ธ.ค. 2024
- రామ లాలి మేఘశ్యామ లాలి
తామరస నయన దశరథ తనయ లాలి
రామ లాలి రామ లాలి రామ లాలి రామ లాలి ||
అబ్జవదన ఆటలాడి అలసినావురా
బొజ్జలోపలరిగెదాకా నిదురపోవేరా || రామ లాలి ||
జోలపాడి జో కొడితే ఆలకించేవు
చాలించి మరీ ఊరుకుంటే సైగ చేసేవు || రామ లాలి ||
అద్దాల తొట్టేమోనని అనుమానించేవు
ముద్దు పాపలున్నారని మురిసి చూసేవు || రామ లాలి ||
చందమామ చూపిస్తే మురిసినావురా
పెరుగు బువ్వ కాదనక గతికినావురా || రామ లాలి ||
ఎంతో ఎత్తు మరగినావు ఏమి సేతురా
ఇంతుల చేతుల కాకలకు ఎంతో కందేవు || రామ లాలి ||
అయోధ్య నగరమంతా అలంకరించేము
నీవు నడచు బాటలోన మల్లెలు చల్లేము || రామ లాలి ||