సాధారణంగా ఈ వైరస్ వలన జలుబు, ముక్కు దిబ్బడ, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కలుగుతాయి, ఇది దాదాపు 2-5 రోజుల తరువాత వెళ్లిపోతుంది. కానీ ఈ లక్షణాలు తగ్గకపోయినా ఉధృతమైనా వైద్యుని సంప్రదించవలసి వస్తుంది.[1] ఈ HMPV సంక్రమణాలు 3 నుండి 6 రోజుల వ్యవధిలో ఏర్పడతాయని, లక్షణాలు తేలికపాటి జలుబు నుండి తీవ్రమైన శ్వాసకోశ బాధల వరకు పెరగవచ్చని యునైటెడ్ స్టేట్స్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) పేర్కొంది.[4] hMPV వైరస్ అన్ని వయసుల వారిలో కూడా ఎగువ, దిగువ శ్వాసకోశ వ్యాధులకి కారణం అవవచ్చు. అయితే ముఖ్యంగా చిన్నపిల్లల్లో, వృద్ధులలో, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారిలో, కీమోథెరపీ, అవయవ మార్పిడి చేయించుకున్న వారిలో వైరస్ ప్రభావం ఎక్కువ ఉంటుంది. hMPV బారిన పడిన చాలా మంది పిల్లలు 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు. వీరిలో బ్రోన్కి యోలైటిస్, బ్రోన్కైటిస్, న్యుమోనియా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. 5-16% మందిలో న్యుమోనియా వంటి శ్వాసకోశ సంక్రమణ కూడా అభివృద్ధి అవుతోందని తెలుస్తోంది.[1] హెచ్.ఎం.పి.వైరస్ సోకిన వ్యక్తితో సన్నిహిత సంబంధం ద్వారా లేదా వైరస్ తో కలుషితమైన ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తుల ద్వారా వ్యాపిస్తుంది. వారు దగ్గడం, తుమ్మడం వలన వెదజల్లే తుంపర్ల వలన, వారు తాకిన వస్తువులు తాకడం వలన వైరస్ వ్యాప్తి చెందుతుంది. [1]
వైరస్ రకాన్ని నిర్ధారించడానికి ప్రయోగశాల పరీక్షలను నిర్వహిస్తారు. అరుదుగా వైద్యశాలలో చేరితే బ్రోంకోస్కోపీని చేయవచ్చు, అక్కడ ద్రవం నమూనా తీసి వైరస్లు పరీక్షిస్తారు.[1] ఈ వైరస్ ప్రాబల్యం ఉన్న చోట్ల నాట్ (న్యూక్లియిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్ - NAAT) ద్వారా వైరస్ జన్యువు ఉనికి కనుగొనడం, ఇమ్యునోఫ్లోరోసెన్స్ లేదా ఎంజైమ్ ఇమ్యునోఅస్సే ఉపయోగించి శ్వాసకోశ స్రావాలలో వైరస్ యాంటిజెన్‌లను నిర్ధారించడం వంటి ప్రక్రియల ఉపయోగిస్తారు.[4] నివారణ, చికిత్స మార్చు hMPV సంక్రమణం సోకిన వ్యక్తులను తాకకుండా దూరంగా ఉండడము, వారు ఉపయోగించిన వస్తువులు వాడకపోవడము, వారు తాకిన స్థలాలు శుభ్రపరచడం, తరచుగా చేతులు శుభ్రంగా కడుక్కోవడం ద్వారా, ఇంకా దగ్గు జలుబు ఉన్నప్పుడు ముక్కు నోటిని కప్పి ఉంచడం ద్వారా ఈ సంక్రమణాన్ని నివారించవచ్చు. ఈ లక్షణాలు ఉన్నప్పుడు బయట ప్రదేశాలలో తిరగకూడదు. COPD, ఆస్తమా, పల్మనరీ ఫైబ్రోసిస్ వంటి దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్న వ్యక్తులు ఎల్లప్పుడూ hMPV, ఇంఫ్లూఇన్ జా, వంటి అంటు వ్యాధుల నుండి రక్షణ కొరకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని టీకాలు సమయానికి తీసుకున్నామని వారు నిర్ధారించుకోవాలి.[4][1] ప్రస్తుతానికి దీనికి చికిత్స, టీకాలు లేవు.[4] సాధారణంగా చికిత్స ఎక్కువగా లక్షణాలను తగ్గించే విధంగా ఉంటుంది. నొప్పి, జ్వరం, ముక్కు దిబ్బడ ను నియంత్రించడానికి ఎసిటమైనోఫెన్, ఇబుప్రోఫెన్ వంటి ఔషధాలను ఉపయోగించడం, అలాగే శ్వాసలో తీవ్రమైన గురక, దగ్గు ఉన్న రోగులకు తాత్కాలికంగా ఇన్ హేలర్ ఉపయోగించవలసిన అవసరం కావచ్చు, [1] వైరస్ ఆవిష్కరణ మార్చు జెనస్ మెటాన్యూమోవైరస్ జాతులు, వాటి వైరస్లు [2][5]జెనస్జాతులువైరస్ (సంక్షిప్త రూపం)ఎన్.సి.బి.ఐ . వర్గీకరణ ఐడి మెటాన్యూమోవైరస్ఏవియన్ మెటాన్యూమోవైరస్ఏవియన్ మెటాన్యూమోవైరస్ (AMPV)38525హ్యూమన్ మెటాన్యూమోవైరస్మానవ మెటాన్యూమోవైరస్ (హెచ్.ఎం.పి.వి.)162145 హ్యూమన్ మెటాన్యూమోవైరస్ ను మొట్టమొదట 2001 లో నెదర్లాండ్స్ కి చెందిన బెర్నాడెట్ జి. వాన్ డెన్ హూగెన్ ఆమె సహచరులు కనుగొన్నారు.[6][7][8][9] ఈ HMP వైరస్ ను మొదట నెదర్లాండ్స్లోని 28 మంది చిన్న పిల్లల శ్వాసకోశ స్రావాలలో కనుగొన్నారు. పరిశోధకులు వైరస్ జన్యు శ్రేణుల జన్యు లక్షణాలు ఇంకా భాగాలను గుర్తించగల అణు జీవశాస్త్ర పద్ధతులను ఉపయోగించడం ప్రారంభించే వరకు ఈ పద్ధతుల్లో యాదృచ్ఛికంగా ప్రాధమిక పి.సి.ఆర్. ఆధారిత సాంకేతికత ఉంది. దీనివలన ఈ కొత్త వైరస్, ఏవియన్ న్యుమోవైరస్ మధ్య స్పష్టమైన సంబంధాన్ని కనుగొనడానికి అవసరమైన పరిమిత శ్రేణి డేటా లభించింది.[6] AMPVతో కనుగొనిన ఈ సన్నిహిత సంబంధం వలన ఈ కొత్త వైరస్కు హ్యూమన్ మెటా న్యూమోవైరస్ అని పేరు పెట్టారు.[6]
Catvrius
😮😮😮😮
Maa AP ki yemi kadhu.maku maa babu unnadu....
阿三很可爱
Idhi kotha virus kadhu idhi 2001 nunde vundhi. Dhinni corona tho yendhuku compare chesi panic chesthunaru.mi views and likes kosam.
సాధారణంగా ఈ వైరస్ వలన జలుబు, ముక్కు దిబ్బడ, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కలుగుతాయి, ఇది దాదాపు 2-5 రోజుల తరువాత వెళ్లిపోతుంది. కానీ ఈ లక్షణాలు తగ్గకపోయినా ఉధృతమైనా వైద్యుని సంప్రదించవలసి వస్తుంది.[1] ఈ HMPV సంక్రమణాలు 3 నుండి 6 రోజుల వ్యవధిలో ఏర్పడతాయని, లక్షణాలు తేలికపాటి జలుబు నుండి తీవ్రమైన శ్వాసకోశ బాధల వరకు పెరగవచ్చని యునైటెడ్ స్టేట్స్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) పేర్కొంది.[4]
hMPV వైరస్ అన్ని వయసుల వారిలో కూడా ఎగువ, దిగువ శ్వాసకోశ వ్యాధులకి కారణం అవవచ్చు. అయితే ముఖ్యంగా చిన్నపిల్లల్లో, వృద్ధులలో, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారిలో, కీమోథెరపీ, అవయవ మార్పిడి చేయించుకున్న వారిలో వైరస్ ప్రభావం ఎక్కువ ఉంటుంది. hMPV బారిన పడిన చాలా మంది పిల్లలు 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు. వీరిలో బ్రోన్కి యోలైటిస్, బ్రోన్కైటిస్, న్యుమోనియా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. 5-16% మందిలో న్యుమోనియా వంటి శ్వాసకోశ సంక్రమణ కూడా అభివృద్ధి అవుతోందని తెలుస్తోంది.[1]
హెచ్.ఎం.పి.వైరస్ సోకిన వ్యక్తితో సన్నిహిత సంబంధం ద్వారా లేదా వైరస్ తో కలుషితమైన ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తుల ద్వారా వ్యాపిస్తుంది. వారు దగ్గడం, తుమ్మడం వలన వెదజల్లే తుంపర్ల వలన, వారు తాకిన వస్తువులు తాకడం వలన వైరస్ వ్యాప్తి చెందుతుంది. [1]
వైరస్ రకాన్ని నిర్ధారించడానికి ప్రయోగశాల పరీక్షలను నిర్వహిస్తారు. అరుదుగా వైద్యశాలలో చేరితే బ్రోంకోస్కోపీని చేయవచ్చు, అక్కడ ద్రవం నమూనా తీసి వైరస్లు పరీక్షిస్తారు.[1] ఈ వైరస్ ప్రాబల్యం ఉన్న చోట్ల నాట్ (న్యూక్లియిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్ - NAAT) ద్వారా వైరస్ జన్యువు ఉనికి కనుగొనడం, ఇమ్యునోఫ్లోరోసెన్స్ లేదా ఎంజైమ్ ఇమ్యునోఅస్సే ఉపయోగించి శ్వాసకోశ స్రావాలలో వైరస్ యాంటిజెన్‌లను నిర్ధారించడం వంటి ప్రక్రియల ఉపయోగిస్తారు.[4]
నివారణ, చికిత్స
మార్చు
hMPV సంక్రమణం సోకిన వ్యక్తులను తాకకుండా దూరంగా ఉండడము, వారు ఉపయోగించిన వస్తువులు వాడకపోవడము, వారు తాకిన స్థలాలు శుభ్రపరచడం, తరచుగా చేతులు శుభ్రంగా కడుక్కోవడం ద్వారా, ఇంకా దగ్గు జలుబు ఉన్నప్పుడు ముక్కు నోటిని కప్పి ఉంచడం ద్వారా ఈ సంక్రమణాన్ని నివారించవచ్చు. ఈ లక్షణాలు ఉన్నప్పుడు బయట ప్రదేశాలలో తిరగకూడదు. COPD, ఆస్తమా, పల్మనరీ ఫైబ్రోసిస్ వంటి దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్న వ్యక్తులు ఎల్లప్పుడూ hMPV, ఇంఫ్లూఇన్ జా, వంటి అంటు వ్యాధుల నుండి రక్షణ కొరకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని టీకాలు సమయానికి తీసుకున్నామని వారు నిర్ధారించుకోవాలి.[4][1]
ప్రస్తుతానికి దీనికి చికిత్స, టీకాలు లేవు.[4] సాధారణంగా చికిత్స ఎక్కువగా లక్షణాలను తగ్గించే విధంగా ఉంటుంది. నొప్పి, జ్వరం, ముక్కు దిబ్బడ ను నియంత్రించడానికి ఎసిటమైనోఫెన్, ఇబుప్రోఫెన్ వంటి ఔషధాలను ఉపయోగించడం, అలాగే శ్వాసలో తీవ్రమైన గురక, దగ్గు ఉన్న రోగులకు తాత్కాలికంగా ఇన్ హేలర్ ఉపయోగించవలసిన అవసరం కావచ్చు, [1]
వైరస్ ఆవిష్కరణ
మార్చు
జెనస్ మెటాన్యూమోవైరస్ జాతులు, వాటి వైరస్లు [2][5]జెనస్జాతులువైరస్ (సంక్షిప్త రూపం)ఎన్.సి.బి.ఐ .
వర్గీకరణ ఐడి
మెటాన్యూమోవైరస్ఏవియన్ మెటాన్యూమోవైరస్ఏవియన్ మెటాన్యూమోవైరస్ (AMPV)38525హ్యూమన్ మెటాన్యూమోవైరస్మానవ మెటాన్యూమోవైరస్ (హెచ్.ఎం.పి.వి.)162145
హ్యూమన్ మెటాన్యూమోవైరస్ ను మొట్టమొదట 2001 లో నెదర్లాండ్స్ కి చెందిన బెర్నాడెట్ జి. వాన్ డెన్ హూగెన్ ఆమె సహచరులు కనుగొన్నారు.[6][7][8][9] ఈ HMP వైరస్ ను మొదట నెదర్లాండ్స్లోని 28 మంది చిన్న పిల్లల శ్వాసకోశ స్రావాలలో కనుగొన్నారు. పరిశోధకులు వైరస్ జన్యు శ్రేణుల జన్యు లక్షణాలు ఇంకా భాగాలను గుర్తించగల అణు జీవశాస్త్ర పద్ధతులను ఉపయోగించడం ప్రారంభించే వరకు ఈ పద్ధతుల్లో యాదృచ్ఛికంగా ప్రాధమిక పి.సి.ఆర్. ఆధారిత సాంకేతికత ఉంది. దీనివలన ఈ కొత్త వైరస్, ఏవియన్ న్యుమోవైరస్ మధ్య స్పష్టమైన సంబంధాన్ని కనుగొనడానికి అవసరమైన పరిమిత శ్రేణి డేటా లభించింది.[6] AMPVతో కనుగొనిన ఈ సన్నిహిత సంబంధం వలన ఈ కొత్త వైరస్కు హ్యూమన్ మెటా న్యూమోవైరస్ అని పేరు పెట్టారు.[6]