అమ్మా మన్ను తినంగ || Amma mannu thinanga|| Bhagavatha Padyam
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- అమ్మా! మన్ను దినంగ నే శిశువనో? యాఁకొంటినో? వెఱ్ఱినో?
నమ్మం జూడకు వీరి మాటలు మదిన్, న న్నీవు గొట్టంగ వీ
రిమ్మార్గంబు ఘటించి చెప్పెదరు, కాదేనిన్ మదీయాస్య గం
ధమ్మాఘ్రాణము చేసి నా వచనముల్ దప్పైన దండింపవే!
భావం: అమ్మా! విను! మన్ను తినడానికి నేనేమైనా చిన్నవాడినా? ఆకలితో ఉన్నానా? లేకపోతే వెర్రివాణ్ణా! వీళ్ళ మాటలు నమ్మకు సుమీ! నీ చేత చీవాట్లు, దెబ్బలూ తినిపించడానికి నా గురించి ఏవేవో చెబుతున్నారు. కావాలంటే నా నోటి వాసన చూడు. మన్ను తిన్నదీ, లేనిదీ, నీకే తెలుస్తుంది. నేను తప్పు చేశానని నీకు అనిపిస్తే తప్పకుండా శిక్షించమ్మా! అని బాలకృష్ణుడు తన తప్పేమీ లేదని అమ్మ యశోదమ్మను సమాధానపరుస్తూ చెప్పిన పద్యం ఇది .