Chirala Famous Pullaiah Gari Bajji |35Years Old Famous | World Famous Bajji | Chirala | Food Book
ฝัง
- เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
- అడ్రస్:- ముంతా వారి సెంటర్,చీరాల
చీరాల స్వీట్ సమోసా:- • Chirala Famous Sweet S...
11రూపాయలకే కడుపునిండా అల్పాహారం:-
video link:- • lakshmi Gari Dosa | B...
వస్త్ర రంగానికేకాదు ...అమోఘమైన రుచితో ప్రసిద్ధి చెందిన అనేక తినుబండారాలకు చీరాల నిలయం.. వాటిలో ప్రధమ వరుసలో ఉంటాయి...పుల్లయ్య గారి బజ్జిలు ...ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన చీరాల పుల్లయ్య గారి బజ్జిలను పరిచయం చేద్దామని నేను ఈ వేళా ఇక్కడకు రావడం జరిగింది..తాపేశ్వరం కాజా, ఆత్రేయపురం పూతరేకులు, అంబాజీపేట పోట్టిక్కలు,అల్లురయ్య మైసూర్ పాక్ ఎంత ప్రసిద్ధో.. చీరాల పుల్లయ్య గారి బజ్జిలు అంత ఫెమస్. నాణ్యత తో మేలిమి బంగారపు వర్ణంలో దివ్యమైన ఆకృతి లో కన్నులకు యింపుగా కనిపించే పుల్లయ్య గారి బజ్జిలు చూడగానే నోరురిస్తాయి.. గబుక్కున తినేలా ప్రేరేపిస్ధాయి ...పసందైన
మంచి రుచిని మన జిహ్వ నాడులకు అందిస్తాయి..పుల్లయ్య గారి తండ్రి లక్ష్మినారాయణ గారు 37ఏళ్ల క్రితం జీవనోపాధి కై చీరాల ముంతా వారి సెంటర్ లో చిన్నపాటి తినుబండారాల కొట్టు ఏర్పాటు చేసుకుని జీవనం సాగించేవారు.. తదుపరి కాలంలో ఆ బాధ్యతలను పుల్లయ్య గారు చేపట్టారు...
వారి నాన్న గారి వద్ద నుండి తినుబండారాల తయారీలో శ్రేష్ఠత సాధించిన పుల్లయ్య గారు .... చీరాల వాసులకు నాణ్యతతో కూడిన మంచి రుచికరమైన మిరపకాయబజ్జిలు, పుణుగులు అందించాలన్న తలంపుతో తయారీకి ఉపయోగించే పదార్థాల నుండి తయారు చేసే విధానం వరకు అత్యంత జాగ్రత్తగా ప్రతి అంశాన్ని సూక్ష్మ పరిశీలనతో గమనిస్తూ నిత్యం బజ్జిలు,పుణుగులను తయారు చేస్తుంటారు... ఇంట్లోనే మరను ఏర్పాటు చేసుకున్న పుల్లయ్య గారు తనకు కావల్సిన రీతిలో పిండి పదార్థాలను.. ఆ తరువాత ఓ ప్రణాళిక ప్రకారం పిండి మిశ్రమాన్ని కలుపుకుని, బజ్జిలకై మంచి మిరపకాయలను వొమ్మని జోడించి సిద్దం చేసుకుంటారు..
వేయించడానికి నాణ్యత గల నూనె ఉపయోగిస్తారు...వాడిన నూనెను మరోమారు వాడరు...పుల్లయ్య గారు తయారు చేసి ప్రక్రియ కూడా చూడ ముచ్చటగా ఉంటుంది...బాండీలో బజ్జిలు, పుణుగులు వేగే సందర్భంలో గోధుమ వర్ణరూపాతరం చెందే దృశ్యం చూపరులకు కనువిందుగా ఉంటుంది...అంతిమంగా పుల్లయ్య గారు అందించే బజ్జిలు, పుణుగులు రుచికి అత్యద్భుతంగా ఉంటాయి