Revival Message by Bro. V. Philip in Andhra Pradesh state IPC Pastor's Zoom meeting...

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ม.ค. 2025
  • Revival Message by Bro. Philip in Andhra Pradesh state IPC Pastor's Zoom meeting!
    క్రీస్తు రక్తము ద్వారా కొనబడిన మనం, లోకమునకు జీవమును అందించని యెడల, మరణమును అందించినవారమౌతాము - మైక్ ప్రాంక్జీన్
    1తిమోతికి 2:1, 2
    మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి, నెమ్మదిగాను సుఖముగాను బ్రదుకు నిమిత్తము, అన్నిటికంటె ముఖ్యముగా మనుష్యులందరికొరకును రాజులకొరకును అధికారులందరికొరకును విజ్ఞాపనములును ప్రార్థనలును యాచనలును కృతజ్ఞతాస్తుతులును చేయవలెనని హెచ్చరించుచున్నాను.
    ... Topic: "6 మెట్ల ప్రార్థన"...
    Mark 16:15 - మార్కు 16:15
    మరియుమీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి.
    "1- సువార్త నిమిత్తము ప్రార్థన"
    Acts 17:30 - అపో.కార్యములు 17:30
    ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.
    "2 - మారుమనస్సు నిమిత్తము ప్రార్థన"
    1 Timoty 2:4 - 1తిమోతికి 2:4
    ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు.
    "3 - రక్షణ నిమిత్తము ప్రార్థన"
    Acts 2:17 - అపో.కార్యములు 2:17
    అంత్యదినములయందు నేను మనుష్యులందరిమీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచించెదరు మీ యౌవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు.
    "4 - ఆత్మ నింపుదల నిమిత్తము ప్రార్థన"
    Matthew 28:19 - మత్తయి 28:19
    కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు
    "5 - శిష్యులుగా మారుట నిమిత్తము ప్రార్థన"
    Colossians 1:28 - కొలస్సీయులకు 1:28
    ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయనయెదుట నిలువబెట్టవలెనని, సమస్తవిధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధిచెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము.
    "6 - ప్రతి మనుషుడు క్రీస్తునందు సంపూర్ణునిగా మారుట నిమిత్తము ప్రార్థన"
    Luke 10:2 - ఆయన వారితో ఇట్లనెను, కోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్దిమందియే; కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి.
    Psalms 127:1 - యెహోవా పట్టణమును కాపాడనియెడల దాని కావలికాయువారు మేలుకొని యుండుటవ్యర్థమే.
    Hosea 6:3 - వర్షమువలె ఆయన మనయొద్దకు వచ్చును; భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షమువలె ఆయన మనయొద్దకు వచ్చును.
    Zachariah 10:1 - కడవరి వానకాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి. ప్రతివాని చేనిలోను పైరు మొలుచునట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును.
    John 16:8 - ఆయన వచ్చి, పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును.
    Isaiah 2:2, Micah 4:1 - అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు.

ความคิดเห็น •