ప్రవచనము - 3 - శ్రీమాన్ ఎక్కిరాల అనంతకృష్ణ - Discourse by Sri E. Ananta Krishna

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.พ. 2025
  • మానవునికి పరిణామమున తక్కువ కాలముననే ఉత్తమస్థితిని పొందుటకు యోగసాధన, యోగజీవనము ఎంతైనా ఆవశ్యకము. ఇందుకు సామూహిక కృషి చాలా దోహదపడును. సహజీవనము యోగసాధనకు చక్కని సాధనము. సహజీవనము కాక ఏకాకిగా సాధన చేయుట వలన కాలక్రమమున పట్టు సడలిపోవును. అందుకే సనాతనులైన వేదర్షులు సత్త్రయాగములను నిర్వహించెడివారు. అట్టి సత్త్రయాగములకు నమూనాగా మాస్టర్ ఇ.కె.గారు గురుపూజా మహోత్సవములనే ప్రక్రియను అందజేసియున్నారు.1965 నుండి మాస్టర్ ఇ.కె. గారిచే మొదలుపెట్టబడిన ఈ గురుపూజా మహోత్సవములలో యెoదరో ఆధ్యాత్మిక సోదరులు తారతమ్యములు మరచి సకుటుంబముగా పాల్గొని పరమగురువుల సాన్నిధ్యమున ఆనందానుభూతిని పంచుకొనుచున్నారు. 2024 నవంబర్ 23, 24 మరియు 25 తేదీలలో ఖమ్మంలో జరిగిన గురుపూజా మహోత్సవములలోని కార్యక్రమములను వీడియోల రూపంలో అందించడం జరుగుతున్నది: మాస్టర్ ఇ.కె.ఆధ్యాత్మిక సేవా సంస్థ.

ความคิดเห็น • 2