మహాకనక దుర్గ || MAHA KANAKA DURGA VIJAYA KANAKA DURGA... SONG WITH TELUGU LYRICS ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • శ్రీ భవానీ అష్టకం || Sri Bhavani Ashtakam with Lyrics & Meaning !! Goddess Durga Maa Stotram
    #durgadevi #durgamaa #durgapuja #durga #maa #mahadev #matarani #maadurga #mata #sherawali #adishakti #jagdamba #kalimaa #durgamata #bhakti #devotional #jaimaa #devi #bhavani #jaimaakali #lakshmimaa #saraswatimaa #durgapujo #jaimatadi #navratri #vaisnodevi #mothergoddess #vindhyawasini #jaidurgamaa #lakshmi #sanatandharm #jaishivshanker #mahakali #aarti #shantoshimaa #jaimaatadi #jagatmata #darshan #saraswati #goddess #kolkata #shiva #india #devimaa #hinduism #art #kolkatadurgapuja #parvati #mumbai #durgapooja #artwork #maakali #pujo #bholenath #mahalaxmi #shakti #ig #god #ganpati #instagram
    న పుత్రో న పుత్రీ న భృత్యో న భర్తా |
    న జాయా న విద్యా న వృత్తిర్‌ మమైవ
    గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని || ౧ ||
    భావం::అమ్మా ! ఓ భవానీ ! నాకు తల్లిగానీ, తండ్రిగాని,కొడుకు గాని, కూతురు గాని, యజమాని గాని, సేవకుడు గాని, బంధువు గాని, భార్య గాని, విద్య గాని, వృత్తిగాని ఏదియు లేదు కేవలం నీవే నాకు దిక్కు. నాకు దిక్కు.
    భవాబ్ధావపారే మహాదుఃఖ భీరు
    పపాత ప్రకామీ ప్రలోభీ ప్రమత్తః |
    కుసంసారపాశ ప్రబద్ధః సదాహమ్‌
    గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని || ౨ ||
    భావం::అమ్మా! భవానీ! కామందుడనై, లోభినై, మత్తుడనై, జన్మపాశ బద్ధుడనై భరించలేని దుఖ్ఖముతో మిక్కిలి భయాన్వితుడనై .సంసార సాగరమున మునిగి పోయాను. తల్లీ నీవు తప్ప నాకు ఎవరు దిక్కులేరు నీవే దిక్కు.
    న జానామి దానం న చ ధ్యానయోగం
    న జానామి తంత్రం న చ స్తోత్రమంత్రమ్‌ |
    న జానామి పూజాం న చ న్యాసయోగమ్‌
    గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని || ౩ ||
    భావం::అమ్మా ! భవానీ ! ధనము, ధాన్యము మంత్రము, యంత్రము, పూజ, పునస్కారము, న్యాసము, యోగము ఇవి ఏవి నాకు తెలీదు. తల్లీ నీవు తప్ప నాకు ఎవరు దిక్కు లేదు. నీవే దిక్కు .
    న జానామి పుణ్యం న జానామి తీర్థం
    న జానామి ముక్తిం లయం వా కదాచిత్‌ |
    న జానామి భక్తిం వ్రతం వాపి మాతా
    గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని || ౪ ||
    భావం:: ! ఓ భవానీ ! పుణ్యకార్యము లేదు, తీర్ధసేవనం లేదు, మొక్షోపాయము తెలీదు, జన్మ రాహిత్యం తెలీదు. భక్తి మార్గము తెలీదు, ఏ వ్రతము తెలీదు . తల్లి నీవు తప్ప నాకు ఎవరు దిక్కు లేదు. నీవే దిక్కు.
    కుకర్మీ కుసంగీ కుబుద్ధీ కుదాసః
    కులాచారహీనః కదాచారలీనః |
    కుదృష్టీ కువాక్య ప్రబంధః సదాహమ్‌
    గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని || ౫ ||
    భావం:: తల్లీ దుష్కర్మఆచరణము, దుర్జన సాంగత్యము, దుర్బుద్దులు, దుష్టసేవక జనము, కులాచార హీనత్వము, దురాచార తత్పరత, చెడు ఆలోచనలు, చెడ్డ మాటలు ఆడటం, ఇవి నా లక్షణాలు. అందుచేత నీవు తప్ప నన్ను ఉద్ధరించటానికి వేరు దిక్కు లేదు.
    ప్రజేశం రమేశం మహేశం సురేశం
    దినేశం నిశీథేశ్వరం వా కదాచిత్‌ |
    న జానామి చాన్యత్‌ సదాహం శరణ్యే
    గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని || ౬ |
    భావం:: అమ్మా ! బ్రహ్మ,విష్ణు, మహేశ్వరుడు, సూర్యుడు, ఇంద్రుడు, చంద్రుడు ఇంకెందరో దేవతలున్నారు. ఒకరిని గూర్చి కూడా నేనెఱుఁగను. నాకు వేరెవరు తెలియదు. నీవే దిక్కు తల్లీ నీవే దిక్కు.
    వివాదే విషాదే ప్రమాదే ప్రవాసే
    జలే చ ఆనలే పర్వతే శత్రుమధ్యే |
    అరణ్యే శరణ్యే సదా మాం ప్రపాహి
    గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని || ౭ ||
    భావం:: అమ్మా! వివాడమున గాని, విషాదమున గాని, ప్రమాదమున గాని, ప్రవసమున గాని, నీటిలో గాని, నిప్పులో గాని,కొండలలో గాని అడవులలో గాని, శత్రువుల మధ్య గాని, ఎక్కడైనా నన్ను నీవే రక్చించాలి తల్లీ.
    అనాథో దరిద్రో జరారోగ యుక్తో
    మహాక్షీణ దీనః సదా జాడ్యవక్త్రః |
    విపత్తౌ ప్రవిష్టః ప్రనష్టః సదాహం
    గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని || ౮ |
    భావం:: ఓ జగజ్జనని నేను అనాథను, ఏమీ లేనివాడిని, ముసలితనము, రోగములు, జాడ్యములు నన్ను పీడించుచున్నవి. మహావిపత్సముద్రమున మునిగియున్నాను. సర్వ విధముల కష్ట నష్టములకు లోనైఉన్నాను. నీవే నన్ను ఉద్ధరించాలి తల్లీ.
    నీవే దిక్కు. నీవే దిక్కు.
    ఇతి శెంకరాచర్య విరచిత భవానీ అష్టకం సంపూర్ణం

ความคิดเห็น •