రోబో శస్త్ర చికిత్స అంటే రోబో....

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ส.ค. 2024
  • మోకాలు, మక్కి రివిజన్ సర్జరీ
    జేబి హాస్పిటల్ లో విజయవంతం
    డాక్టర్ జహంగీర్ బాష
    ప్రజాశక్తి కడప అర్బన్
    రాయలసీమలోనే మొట్టమొదటిసారిగా జె బి ఆసుపత్రిలో మోకాళ్లు, మక్కి శస్త్ర చికిత్సలు రోబోటిక్ టెక్నాలజీ తో విజయవంతంగా నిర్వహిస్తున్నామని ప్రముఖ మోకాళ్లు కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ జహంగీర్ భాష అన్నారు. శనివారం అంబేద్కర్ సర్కిల్ సమీపంలో ఉన్న జెపి ఆసుపత్రిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రివిజన్ సర్జరీ లపై ఇటీవలే ఎముకలు, కీళ్ల శాస్త్ర చికిత్స విభాగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఏవో ఫౌండేషన్ స్పెయిన్ దేశంలో నిర్వహించిన సదస్సుకు ఆంధ్రప్రదేశ్ నుంచి నేను హాజరయ్యానని తెలిపారు. ప్రపంచ దేశాలలోనే అతి కొద్ది మంది డాక్టర్లను గుర్తించి ఈ సదస్సుకు ఆహ్వానించారని పేర్కొన్నారు. ఈ సదస్సులో రోబోటిక్ పద్ధతిలో రివిజన్ సర్జరీ ఎలా చేయాలో పూర్తిగా శిక్షణ ఇచ్చారని చెప్పారు. రోబో శస్త్ర చికిత్స అంటే రోబో ఇలాంటి ఆపరేషన్లు చేయదని, డాక్టర్లే ఆపరేషన్ చేస్తారని తెలిపారు. రోబో వల్ల కచ్చితత్వం గుర్తిస్తామన్నారు. రక్తము, చిప్ప తక్కువ లాస్ అవుతుందని పేర్కొన్నారు. జాన్సన్ అండ్ జాన్సన్ వారి పరికరాలను ఉపయోగిస్తున్నామని చెప్పారు. శస్త్ర చికిత్స అనంతరం యాంటీబయాటిక్ కుట్లు వేస్తామని, దీనివల్ల ఇన్ఫెక్షన్ రాదని, ఆపరేషన్ చేసుకున్న వ్యక్తి మరుసటిరోజే స్నానం కూడా చేయవచ్చని తెలిపారు. బాంబే, ఢిల్లీ మెట్రోపాలిటన్ సిటీ లో నిర్వహించే అరుదైన శస్త్ర చికిత్సలు జేబీ ఆసుపత్రిలో మనం చేస్తున్నామని చెప్పారు. జేబీ ఆసుపత్రిలో ఐదవ జనరేషన్ రోబోను వినియోగిస్తున్నామని, ఇప్పటికే వందకు పైగా కీళ్ల మార్పిడి చేశామన్నారు. అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో డాక్టర్ ఉబేద్, డాక్టర్ వెంకటేశ్వర
    Plz #subscribe Kadapa Hot News 🙏🙏🤝🤝

ความคิดเห็น •