ఏ విధముగ నీకు ముఖము చూపగలను ఈ స్థితిలో ఎట్లు నీ ఎదుట నిలువగలను పాపం చేశాను నిను విసిగించాను అ.ప:- తప్పిపోయిన కొడుకును కరుణతో క్షమించు నను 1. పాప వాంఛతో నిన్ను విడిచి పరుగు తీసితిని పావనుడ నీ పరువు తీసే పనులు చేసితిని యోగ్యతను కోల్పోతిని మరణ పాత్రుడనైతిని 2. కలిమి కలిగిన ఇల్లు విడిచి స్వేచ్ఛ కోరితిని కడుపు నిండే దారిలేని స్థితికి చేరితిని బుద్ధి తెచ్చుకుంటిని దిక్కు నీవని అంటిని 3. మేలుకరమగు స్థలము విడిచి చెదరి తిరిగితిని ప్రేమ కలిగిన నీదు హృదయము గాయపరచితిని మనసు మార్చుకొంటిని తిరిగి వచ్చుచుంటిని
ఏ విధముగ నీకు ముఖము చూపగలను
ఈ స్థితిలో ఎట్లు నీ ఎదుట నిలువగలను
పాపం చేశాను నిను విసిగించాను
అ.ప:- తప్పిపోయిన కొడుకును
కరుణతో క్షమించు నను
1. పాప వాంఛతో నిన్ను విడిచి పరుగు తీసితిని
పావనుడ నీ పరువు తీసే పనులు చేసితిని
యోగ్యతను కోల్పోతిని మరణ పాత్రుడనైతిని
2. కలిమి కలిగిన ఇల్లు విడిచి స్వేచ్ఛ కోరితిని
కడుపు నిండే దారిలేని స్థితికి చేరితిని
బుద్ధి తెచ్చుకుంటిని దిక్కు నీవని అంటిని
3. మేలుకరమగు స్థలము విడిచి
చెదరి తిరిగితిని
ప్రేమ కలిగిన నీదు హృదయము
గాయపరచితిని
మనసు మార్చుకొంటిని తిరిగి వచ్చుచుంటిని
❤❤Song super My Sister
Thank u brother 🙏