SRI CV ANAND IPS CP HYDERABAD HINDI SPEECH AT DRUG DISPOSAL COMMITTEE PROGRAM AT GOSHAMAHAL GROUND

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2025
  • ప్రెస్ నోట్
    డ్రగ్ డిస్పోజల్ కమిటీ, హైదరాబాద్ సిటీ ద్వారా నార్కోటిక్ డ్రగ్స్ నిర్మూలన
    ఈరోజు (05-12-2024) నాడు డ్రగ్ డిస్పోజల్ కమిటీ, హైదరాబాద్ సిటీ పోలీస్ దాని చైర్మన్, ఎన్ శ్వేత, ఐపిఎస్ డిసిపి డిడి, హైదరాబాద్ ఆధ్వర్యంలో శ్రీ. సివి ఆనంద్, ఐపిఎస్., కమీషనర్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్ సిటీ గారు హాజరైనారు. ఈ సందర్బంగా పోలీసు కమిషనర్ గారు మాట్లాడుతూ గోషామహల్ స్టేడియం లో నార్కోటిక్స్ వింగ్ ద్వారా పట్టుబడ్డ డ్రగ్స్ డిస్రక్షన్ కార్యక్రమం చేస్తున్నాము.. NDPS ఆక్ట్ ప్రకారం నిబంధనలు మేరకు వీటిని సీజ్ చేసాము. పట్టుకున్న మాదకద్రవ్యాలు మొత్తం మళ్ళీ ఎక్కడ వినియోగించకుండా ధ్వంసం చేయడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాము. గౌరవనీయులైన సిఎం గారు కూడా డ్రగ్స్ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు అని తెలిపారు. యువత చెడు పోకడలకు అడ్డుకట్ట వేయడం తో పాటు వాటిపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నాం. ఈ డ్రైవ్ రానున్న రోజుల్లో కొనసాగిస్తాం తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే డ్రగ్స్ నీ కట్టడి చేస్తున్నాం. హైదరాబాదు సిటీ లో సప్లై రూట్‌లను కూడా డిటెక్ట్ చేస్తున్నాం. హైదరాబాదు సిటీ పోలీసు కమిషనరేట్ పరిధిలో రెండు నెలలుగా ఈ డ్రగ్స్ ఇష్యూ తగ్గుముఖం పట్టాయి.. హైదరాబాదు సిటీ లో ని హెచ్ న్యూ వింగ్ ను కూడా బలోపేతము చేస్తాము అని అన్నారు.
    ఈ రోజు 2140.395 కిలోల గంజాయి, 3800 గ్రాముల మహాకాల్ (సీసాలు), 12669 ML హాష్ ఆయిల్, 540 అల్ప్రాజోలం టాబ్లెట్లు, 19.34 Grms కొకైన్, 4 LSD7 Blot. 177.75 గ్రాముల యండియంఎ, 70 గ్రాముల ఓపి.యం(నల్లమందు) వీటిని ఈ ఏడాది లోపట్టుకున్న మొత్తం పట్టుకున్న డ్రగ్స్ నీ M/s జి.జె మల్టీక్లేవ్(ఇండియా) ప్రై. Ltd., (బయో మెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ & హ్యాండ్లింగ్ సర్వీసెస్). ఏదులపల్లె గ్రామము, నందిగామ (మ). రంగారెడ్డి జిల్లా నందు ధ్వంసం చేయబోతున్నాం..
    గతంలో కూడా రూ. 19-06-2024న (118) కేసులకు సంబంధించి 3,08,14,750/- ద్వంసం చేయబడింది. 05-12-2024న నాశనం చేయబడిన నార్కోటిక్ డ్రగ్స్ 2019 నుండి 2024 సంవత్సరాలకు సంబంధించినది (208) NDPS కేసులు, హైదరాబాద్ నగరంలోని 36 పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి అని తెలిపారు నిషేధిత డ్రగ్స్ మొత్తం విలువ రూ. 7,48,49,375/-.
    ఈ కార్యక్రమములో డిడి అధికారులు మరియు పోలీసు స్టేషన్ ఎస్.హెచ్ఓ లు పాల్గోన్నారు.
    చైర్మన్
    డ్రగ్ డిస్పోజల్ కమిటీ, Hyd.
    I/c. Addl. పోలీస్ కమీషనర్,
    నేరాలు & SIT, హైదరాబాద్ సిటీ.

ความคิดเห็น • 1