Kukka kosam swarganni vadulukunma DharmaRaju! Chivariki swarganiki vellindi evaru??

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2024
  • అర్జునుడి మనుమడైన పరీక్షిత్తును సింహాసనంమీద ఆసీనుని చేసి అంతిమ యాత్రలో భాగంగా హిమాలయాలలోని మేరు పర్వతము అధిరోహించ బైలుదేరారు పాండవులు.
    భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు మరియు ద్రౌపది అనుసరించిన మార్గాన్ని యుధిష్ఠిరుడు నడిపించాడు. దారిలో ఒక కుక్క వారి వెంటే రాసాగింది
    దారిలో మొదట పడిపోయింది ద్రౌపది.
    "యుధిష్ఠిరా, ఆమె మొదట ఎందుకు మరణించింది?" అడిగాడు భీముడు. "ఆమె సద్గుణవంతురాలు కాదా, మంచి హృదయం కలది కాదా?"
    యుధిష్ఠిరుడు వెనుదిరిగి చూడకుండా సమాధానమిచ్చాడు. “అది నిజమే, కానీ ఆమె అర్జునుడితో ఎక్కువ అనుబంధం కలిగింది. అది ఆమె వైఫల్యం. ”
    తడబడి కుప్పకూలిన తర్వాతిది సహదేవుడు.
    "ఓ యుధిష్ఠిరా, అతని వైఫల్యం ఏమిటి?" అడిగాడు భీముడు
    యుధిష్ఠిరుడు ఇలా జవాబిచ్చాడు: "తనంత తెలివితేటలు ఎవరికి లేవని అహంకారం అతని వైఫల్యం."
    తదుపరి నకులుడు పడిపోయాడు.
    "ఓ యుధిష్ఠిరా, అతను ఏమి తప్పు చేసాడు?" విలపించాడు భీముడు
    “అతను తన అందాన్ని చూసి గర్వపడ్డాడు. అదే అతని వైఫల్యం." అన్నాడు యుధిష్ఠిరుడు
    అర్జునుడు వెంటనే కుప్పకూలిపోయాడు.
    "ఓ యుధిష్ఠిరా, అర్జునుడు చేసిన తప్పేంటి?" భీముడు దుఃఖంతో అరిచాడు.
    యుధిష్ఠిరుడు కదలకుండా నడుస్తూనే ఉన్నాడు: “అతను తెలివైనవాడు కానీ అతి విశ్వాసం కలవాడు. అదే అతని వైఫల్యం."
    తన సోదరులు చనిపోవడాన్ని చూసి తట్టుకోలేక భీముడు పడిపోయాడు.
    నడుస్తూ యుధిష్ఠిరుడు ఇలా మాట్లాడాడు: “భీముడు తన బలాన్ని గురించి గొప్పగా చెప్పుకుని అతిగా తిన్నాడు. అదే అతని వైఫల్యం"
    ఆ చలిలో, మంచులో ఒకరి తరువాత ఒకరుగా నలుగురు సోదరులు మరణించి నేలకూలారు. కాని రాజు చలించక ఏకాకిగా ముందుకు పోతూనే ఉన్నాడు. వెనక్కు తిరిగి చూస్తే విశ్వాసం ఉన్న ఆ కుక్క వెంట వస్తూనే ఉంది. మంచులో చలిలో కొండలమీదుగా లోయలమీదుగా పయనిస్తూ రాజు, కుక్కా చివరికి మేరుపర్వతాన్ని చేరుకొన్నారు.
    అక్కడ వారికి సురసంగీతం వినవచ్చింది. ఆ ధార్మికుడైన రాజుమీద దేవతలు దివ్యపుష్పవర్షాన్ని కురిపించారు. అప్పుడొక దివ్య రథం అక్కడ దిగింది. “ఈ రథాన్ని అధిరోహించు. మానవుల్లో ఉత్తమోత్తముడవు నువ్వే. సశరీర స్వర్గప్రాప్తి నీ వొక్కడికే” అని దేవేంద్రుడు ప్రార్ధించాడు. తన అనుంగ సోదరులు, భార్య లేకుండా యుధిష్ఠిరుడు స్వర్గానికి పోవటానికి ఇష్టపడక పోయేసరికి "నీకంటే ముందే వారు అక్కడికి చేరుకొన్నారు" అని దేవేంద్రుడు తెలిపాడు.
    యుధిష్ఠిరుడు నాలుగు వైపులా చూసి "బిడ్డా, ఈ రథాన్ని ఎక్కు" అన్నాడు కుక్కతో. దేవేంద్రుడు నివ్వెరపోతూ "ఏమిటి! ఈ కుక్క కూడానా" అని కేక పెట్టాడు
    “ఈ కుక్కను వదిలెయ్యి. కుక్కకు స్వర్గప్రాప్తి లేదు. ఓ మహారాజా, నీ ఉద్దేశం ఏమిటి? నీకేమన్నా పిచ్చి పట్టిందా? మానవుల్లోనే అద్వితీయ ధర్మాత్ముడివి నువ్వు. సశరీర స్వర్గప్రాప్తి నీకు మాత్రమే" అన్నాడు ఇంద్రుడు.
    “మరి ఈ కుక్క చలిలో మంచులో ఎంతో విశ్వాసంతో నన్ను వెంబడిస్తూ వచ్చింది. సోదరులంతా మరణించి నన్ను విడిచిపెట్టారు. నా భార్య మరణించింది. నన్ను విడువకుండా ఉన్నది ఇదొక్కటే. అలాంటి దీన్ని నేనిప్పుడు ఎలా విడిచిపెడతాను?" అన్నాడు నిశ్చయంగా యుధిష్ఠిరుడు
    అప్పుడు ఇంద్రుడు ఇలా అన్నాడు: “ఒక్క షరతు ప్రకారం కుక్క స్వర్గానికి పోతుంది. మానవుల్లో నువ్వు ఉత్తమోత్తమ ధార్మికుడివి. ఇది ప్రాణులను చంపి తినే కుక్కగా ఉంది. వేటాడి చంపి, ఈ కుక్క పాపభూయిష్ట అయిఉంది. దీన్ని స్వర్గానికి పంపాలంటే నువ్వు స్వర్గాన్ని వదలుకోవాలి.” వెంటనే యుధిష్ఠిరుడు "వదలుకోవటానికి అంగీకరిస్తున్నాను. కుక్క స్వర్గానికి పోతుందిగాక" అన్నాడు.
    వెంటనే దృశ్యం మారిపోయింది. యుధిష్ఠిరుని ఈ ఉదాత్త పలుకులు విని కుక్క రూపంలో ఉన్న ధర్మదేవత, యమధర్మరాజు, అంతకుడు, సమవర్తి నిజరూపంలో ప్రత్యక్షమై, "ప్రభూ, చూడు క్షుద్రమైన ఒక కుక్కకోసం స్వంత సుకృతాలను, స్వర్గాన్ని వదలుకొని నరకానికి వెళ్ళేందుకు సిద్ధపడ్డ నీలాంటి నిస్వార్థ మానవుడు ఏ కాలంలోనూ లేడు. ఓ రాజరాజా, ఉత్తమమైన జన్మ నీదే. ఓ భారతా, సర్వజీవులపట్లా నీకున్న కనికరానికి మహోజ్వలు నిదర్శనం ఇదే. ఇప్పటినుండి నిత్య సుఖలోకాలు నీవి. వాటిని నువ్వు జయించావు. ఓ రాజా, నీ లక్ష్యం ఉన్నతం, దివ్యం" అని ప్రశంసించాడు.
    తరువాత యుధిష్ఠిరుడు ఇంద్రుడితో, యమధర్మరాజుతో, ఇతర దేవతలతో కూడా దివ్యరథంలో స్వర్గానికి బయలుదేరాడు. కొన్ని శోధనలకు లోనయ్యాడు. మంతాకినీ నదిలో స్నానం చేశాడు. దివ్యదేహాన్ని ధరించి, సోదరులను కలుసుకొన్నాడు. వారిప్పుడు అమరులై ఉన్నారు. చివరకు అందరూ ఆనందంతో ఉన్నారు.
    #garikapati #chaganti #chagantipravachanalu #chagantikoteswararao #garikapatinarasimharao #devotional #krishna #shiva #radheradhe #mahabharatham #mahabharat #mahabharata #dog

ความคิดเห็น •