జీవిత సత్యాన్ని ప్రబోధించే గుర్రం జాషువా గారి అద్భుతమైన పద్యాలు.gurram jashuva.munthajmahal.ముంతాజ్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024
  • పద్య సుధా మంజరి చానెల్ ప్రేక్షకులకు వినయపూర్వక విజ్ఞప్తి:
    ఆవిరి యోడలో అను పద్యం లోని చివరి పాదంలో "సతమున్" అనే పదము miss అయింది...
    ఏ పుష్పంబునుజేసి అనే పద్యం లో మూడవ పాదం లో సమస్త అనే పదానికి బదులు సకల అని పొరపాటున చదవడం జరిగింది.
    ఈ రెండుపూర్తి పద్యాలు దిగువన ఇస్తున్నాను సవరించుకుని చదువుకోగలరని ప్రార్దన.
    ఉ. ఆవిరియోడలో, జలధియాన మొనర్చెడు బాటసారులో
    భూవర! రేవులందు దిగిపోయెద రించుక వెన్క ముందుగా
    నీ వసుధాపణంబు పనియెల్ల ముగించి, స్వదేశగాములై
    పోవుచు వచ్చుచుండ్రు సతమున్ బ్రజలీ నరజన్మ వర్తకుల్.
    ఉ.ఏ పుష్పంబును జేసి వాడుకొనునో యీదేహమున్ దైవమో
    భూపశ్రేష్ఠ! విచారమందకుము, మామూలేకదా? యీమృతి
    వ్యాపారంబు సమస్త జీవులకు, విశ్వవ్యాఘ్రి గర్భంబునన్
    మాపుల్ రేపులునెందరో; యిముడుచున్నారందు నేనొక్కతెన్.
    ముంతాజ్ మహల్. జాషువా. వైరాగ్యంతో కూడిన పద్యాలు.గుర్రం జాషువా , పద్య పరిమళం , పద్య సౌరభం, పద్య నైవేద్యం. శ్రీ శ్రీ , నన్నయ , తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు , నాచన సోమన, పాల్కురికి సోమనాథుడు, ధూర్జటి, తెనాలి రామకృష్ణ , అల్లసాని పెద్దన, నంది తిమ్మన , భట్టు మూర్తి, తెలుగు పద్యాలు, వేమన శతకం, సుమతి శతకం,దాశరథి శతకం, దాశరథి కృష్ణమాచార్య,చాటువులు, తిరుపతి వేంకట కవులు,

ความคิดเห็น • 237

  • @anilacharya5595
    @anilacharya5595 3 หลายเดือนก่อน +1

    ఆహా ఎంత బాగా ఉంది మీ గాత్రం...మీరు మరిన్ని జీవిత సత్యాలు బోధించే పద్యాలు మాకు పరిచయం చేయాలని మా విజ్ఞప్తి

  • @dsprao5388
    @dsprao5388 5 หลายเดือนก่อน +1

    గొప్పపద్యాలు వాస్తవదృక్పథంతో రాసారు జాషువా గారు.ఇలాంటి రచనలు ఇంత హృద్యంగా ఎవరూ
    రాసి ఉండరు.మీరు అంత గొప్పగా
    పాడివినిపించారు.అభినందనలు.👌👌👌

  • @chikkalasubrahmanyam456
    @chikkalasubrahmanyam456 ปีที่แล้ว +5

    రచించిన జాషువాగార్కి
    ఎంతో మధురంగా వినిపించిన మీకు ధన్యవాదాలు 🙏

  • @indianfarmer635
    @indianfarmer635 3 ปีที่แล้ว +29

    మీ గాణం జాషువా గారి పద్యాల వలే చాలా అద్భుతంగా ఉంది ఇంకా వినటానికి చాలా వినసొంపుగా ఉంది. మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను

    • @padyasudhamanjari2015
      @padyasudhamanjari2015  3 ปีที่แล้ว

      ధన్యవాదాలు సార్..... మరిన్ని మంచి మంచి పద్యాల కోసం మన ఛానల్ ను subscribe చేసుకోగలరు....

  • @nadakuditinageswararao3574
    @nadakuditinageswararao3574 6 หลายเดือนก่อน +2

    మిత్రమా, అద్భుతంగా చెప్పినారు, పాడినారు. ముంతాజ్ గారి ఆవేదన జాషువా గారి కలం ద్వారా వచ్చిన, కవిత్యాన్ని, మీ నోటి ద్వారా ఆలపించిన విధానము , చెప్పిన పద్దతి చాలా బాగున్నది. ఒకవేళ మీరు smoking చేస్తుంటే, మాన వలసినదిగా కోరుచున్నాను. ఇట్లు మీ సోదరుడు.

    • @padyasudhamanjari2015
      @padyasudhamanjari2015  6 หลายเดือนก่อน

      ధన్యవాదాలు సార్ 🙏 నాపై అభిమానంతో మీరు చేసిన సూచనకు సంతోషిస్తాను. నాకు టీ కొంచెం ఎక్కువ సార్లు త్రాగడం తప్ప ఎటువంటి దురభ్యాసాలు లేవు.

  • @arupulakrishnaiah967
    @arupulakrishnaiah967 2 ปีที่แล้ว +8

    జాషువా గారి పద్యాలలోని జీవిత సత్యాలను అద్భుతంగా వివరించారు సోదరా🙏🙏🙏🙏

  • @sivarammalleboina331
    @sivarammalleboina331 3 ปีที่แล้ว +11

    విశ్వనరుడు జాషువా పద్యాలు , మీరు పాడిన విధానం అద్భుతం

    • @srinujanampally8086
      @srinujanampally8086 3 ปีที่แล้ว

      సార్ అద్భుతమైన గానము
      వివరణ .

  • @srameshvarma4266
    @srameshvarma4266 2 ปีที่แล้ว +6

    సోదరులకు🙏
    మీ పధ్యలాపన రసస్పూర్తితో ఆలపించారు. మీ ఆలాపన మాడుగుల నాగఫణిశర్మ ను తలపిస్తుంది. 👌👌👌

  • @upenderregula2527
    @upenderregula2527 3 ปีที่แล้ว +12

    నరజన్మ వర్తకులు....ఎంత చక్కని పదం. అద్భుతం..🙏🙏🙏

  • @subhakarkoneru8632
    @subhakarkoneru8632 3 ปีที่แล้ว +11

    మీ పద్య పఠనము ,సాహితీ పరిచయం అద్వితీయము
    మహాకవి జాషువా కావ్యసౌరభం అజరామరము

  • @murthygvls1162
    @murthygvls1162 28 วันที่ผ่านมา +1

    చాలా మంచి పద్యాలు , భావుకతతోఅర్ధవంతంగా చదివి వివరించారు సార్ , ధన్యవాదములు సార్

  • @mohanaraotantepudi9199
    @mohanaraotantepudi9199 3 ปีที่แล้ว +11

    ఇలాంటి సత్యాలు పాఠ్యాంశాలలో పెడితే బాగుండు జీవితం గురించి తెలుసుకుంటారు
    బాగా పాడారు పద్యాలను

  • @sahithisugandham526
    @sahithisugandham526 ปีที่แล้ว +2

    చాలా అద్భుతంగా గానం చేసారు. మీ సాహితీ సేవకు నా నమస్కారం 🙏🙏🙏🙏🙏

  • @RameshBabu-tj4re
    @RameshBabu-tj4re ปีที่แล้ว +1

    నమస్కారమండీ. మీరు చేసిన ఈ ప్రయత్నం చాలా చాలా ప్రశంశనీయం. తెలుగుభాష ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉంది అని నా స్నేహితుడొకడు అంటూ ఉండేవాడు. కానీ మీరు చేసిన ఈ ప్రయత్నం ఒక అమృత బిందువు వలే నాకు తోచింది. శంకరాభరణంలో అన్నట్లు, ఈ ప్రవాహ ఝరి మీ వంటివారి వలన కలకాలం సాగుతూనే ఉంటుంది అన్న నమ్మకం గల్గింది. మీరు పాడిన విధానం నాకు ఓ ఏబది సంవత్సరాల వెనుకకు తీసుకు పోయింది. బాల్యాన్ని, అప్పటి తెలుగు ఉపాధ్యాయులను గుర్తు తెచ్చింది. మనస్సు ఉప్పొంగి పోయింది. చాలా అదృష్టం చేసుకుంటే గానీ ఇటువంటి భాగ్యం కలుగదు. ఆ పరంధాముడు మీకు ఆయురారోగ్యాలనూ, సంపదనూ కలుగజేసి, మీ ప్రయత్నాన్ని మరింత పటిష్టం జేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీశ్రీ గారు రచించిన 'ఎవి తల్లీ నిరుడు కురిసిన' అనే పద్య కదంబాన్ని కూడా ఓ మారు మీరు స్పృశించ ప్రార్థన. శుభం.

    • @padyasudhamanjari2015
      @padyasudhamanjari2015  ปีที่แล้ว

      మీ సహృదయపూర్వక స్పందనకు,,మీరందించిన శుభాకాంక్షలకు ధన్యవాదాలండీ🙏

  • @శ్రీరామకనవేమి
    @శ్రీరామకనవేమి 3 ปีที่แล้ว +25

    మీరు కుల పిచ్చి లేకుండా జాషువాగారిని స్వంతం చేసుకున్నారు మి మనసు చాలా గొప్పది ఆయన రచన అనే సుధాదారోనుకారకోక్తులన్ మాకు పంచి నందుకు ధన్యవాదాలు సర్🙏

    • @padyasudhamanjari2015
      @padyasudhamanjari2015  3 ปีที่แล้ว +2

      ధన్యవాదాలు.... జాషువా గారి పద్య రచనా శైలి అనన్య సాధ్యం ....త్వరలోనే వారి మరిన్ని రచనలను మీతో పంచుకుంటాననీ తెలియజేయుటకు సంతోషిస్తున్నాను.🙏

    • @bobbasomireddy9758
      @bobbasomireddy9758 ปีที่แล้ว +2

      ప్రతిదానికి కులపిచ్చేనా

    • @perepaprabhakarasarma3150
      @perepaprabhakarasarma3150 ปีที่แล้ว +1

      Talented people are always having the place in history and are being appreciated but never oppressed as per casteism but vote bank politics created caste division

  • @rpo2007
    @rpo2007 ปีที่แล้ว +1

    కవి భావనను,కవి హృదయాన్ని వీక్షకులు అనుభవించేటట్లు చేసిన మీ మధుర ఆలాపనకు addict అయిపోయా❤❤❤👌🙏👏👏👏
    జాషువా కవీంద్రుని అక్షరసంపదతో తెలుగు పద్యము అజరామరము 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @శ్రీపురోహితం
    @శ్రీపురోహితం 3 ปีที่แล้ว +6

    గురువుగారికి నమస్కారం
    మీ పద్యములు విని ఏంతో ఆనందపనిపించింది.నాకు పద్యాలు అంటే ఇష్టం ఆ ఇష్టంతోనే మీరు పాడినట్లుగా పాడుటకు ఏంతో కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నాను, నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించ ప్రార్థన.....

    • @padyasudhamanjari2015
      @padyasudhamanjari2015  3 ปีที่แล้ว

      శుభమ్....మీ ప్రయత్నాన్ని కోనసాగించండి.

  • @shaikmunzeerahamad7771
    @shaikmunzeerahamad7771 25 วันที่ผ่านมา

    చాలా బాగా ఆలాపించి చాలా చక్కగా వివరించారు.ధన్యవాదములు

  • @venkataraoannabathula8678
    @venkataraoannabathula8678 3 ปีที่แล้ว +6

    పద్యం sravyanga పాడారు
    మంచి గొంతు ధన్యవాదములు

  • @tulasidevi9874
    @tulasidevi9874 ปีที่แล้ว +1

    మీ గాత్రముతో పద్య భావాలను మరింత మధురంగా వినిపించారు. ధన్యవాదాలు

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 3 ปีที่แล้ว +9

    భయ్యా , బావుంది మీ పఠనం. మరిన్ని పద్యాలు తీసుకుని జాషువా పుస్తకాలను పరిచయం చేయండి.

  • @rajalingamkalva3335
    @rajalingamkalva3335 3 ปีที่แล้ว +3

    సార్ జాషువా గారి పద్యాలు బాగా చదివారు మీ స్వరం అమృత తుల్యం గా ఉన్నది.
    కాల్వరాజలింగం
    తెలుగు భాషోపాధ్యాయుడు
    జి.ప.హై.స్కూల్. మంగపేట
    పెద్దపల్లి జిల్లా నుండి.

  • @syrtelugutech5111
    @syrtelugutech5111 2 ปีที่แล้ว +2

    అద్భుతమైన గాత్రం మిత్రమా👌👌👌

  • @satyamsrirangam1740
    @satyamsrirangam1740 3 ปีที่แล้ว +5

    మీరు పద్యము చదువు విధానం బాగుంది. గాత్రం అద్భుతం.

  • @bulajoseph9162
    @bulajoseph9162 ปีที่แล้ว

    అయ్యా !!!
    గొప్ప కవుల సాహిత్యమును....ముఖ్యముగా పద్యములను ఇలా భావసహితంగా వివరించినపుడు...ఎల్లరకూ సాహిత్యాభిలాష హృదయములో కలుగుతుంది. తిరిగి పూర్వ కవుల సాహిత్యము ప్రభవిస్తుంది !!!
    మీకు చాలా వందనసుమాంజలులు !!!

  • @prasadaraodesamsetty8178
    @prasadaraodesamsetty8178 หลายเดือนก่อน

    నీ పద్యపతనం చాలా బాగుంది.

  • @chandrashekerraoduddukuri9342
    @chandrashekerraoduddukuri9342 ปีที่แล้ว +2

    So melodious and devotional… adbhutham…Great Gurram jashuva and great voice ❤

  • @patthipakashanthan4788
    @patthipakashanthan4788 3 ปีที่แล้ว +4

    వివరణ కూడా చాలా అద్భుతం ఆచార్య 🙏🙏🙏🙏🙏

  • @sharatpc2371
    @sharatpc2371 2 ปีที่แล้ว +1

    మీ వాచకం/ కంఠం ఈ పద్యాలకే ఒక కొత్త అందాన్ని ఇస్తుంది

  • @haveelapalaparthi8624
    @haveelapalaparthi8624 3 ปีที่แล้ว +8

    జాషువాగారి పద్యాలు అనగానే గబ్బిలం, గిజిగాడు,శిశువు,శిల్పి,భరతమాత ఇంతకుమించి ఎవ్వరికీ తెలీడం లేదు. మీరు మంచిప్రయత్నం చేస్తున్నారు. కొనసాగనివ్వండి.
    మీ ఛానల్ ను subscribe చేసుకున్నాము.
    ధన్యవాదాలు.

    • @padyasudhamanjari2015
      @padyasudhamanjari2015  3 ปีที่แล้ว +1

      మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు🙏

  • @kasulacssharma9674
    @kasulacssharma9674 9 หลายเดือนก่อน

    చాలా బాగుంది మీ గొంతులో చాలా రమణీయంగా అనిపించినవి
    ధన్యవాదాలు

  • @pbchari7218
    @pbchari7218 3 ปีที่แล้ว +2

    జాషువా గారి పద్యాలను అద్భుతంగా ఆలపించి అర్థాలను వివరించినందుకు ధన్యవాదములు

  • @DhanvanthariA
    @DhanvanthariA ปีที่แล้ว

    అద్భుతంగా పాడి చెప్పారండీ🎉🎉🎉🎉🙏

  • @jeevanrao7352
    @jeevanrao7352 ปีที่แล้ว

    చాల అద్భుమైన గాత్రం మీరు గానము చేసి మీ జన్మ ధన్యం చేసుకొన్నారు

  • @chemalamudigurappachowdary3159
    @chemalamudigurappachowdary3159 ปีที่แล้ว

    Your tone,accent, jashua' s Rhyme, Rythem...wonderful..
    మీ గొంతు...మమ్ముల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది...జాషువా గారు మరల మరలా పుట్టారా అని పిస్తుంది...
    చిడిపి రాళ్ళపుట్టవా చెలుపైన వజ్రములు...
    పుడమి ఈగల వల్ల పుట్టదా తేనె
    వెడగు బిల్లిమేనను వెళ్ళదా జవ్వాజి
    పంకమలో పుట్టదా పరిమళపు తామెర...అన్నట్టు .....సనాతన ధర్మ పు సాహిత్యపు భూమిలో,ఈ భారత భూమిలో...ఇప్పటికీ పరిమళిస్తున్న,గుబాళిస్తున్న మరకత మాణిక్యం జాషువా....
    చక్కని సాహిత్యాన్ని అందిస్తున్నందుకు ధన్యవాదములు...
    తలమేల కులమేల తపమె కారణము
    ఎలమి హరిదాసులు ఏజాతైన నేమి....అని అన్నమయ్య.

    • @padyasudhamanjari2015
      @padyasudhamanjari2015  ปีที่แล้ว

      చాలా బాగా సెలవిచ్చారు సార్.....ధన్యవాదాలు🙏

  • @ggovindaiah9655
    @ggovindaiah9655 5 หลายเดือนก่อน

    Poet Jashuva himself was a Universal Human being God had given him such a power of poetic ability He was honoured on par with the legendary poets of his time irrespective of caste creed and religion

  • @vadlasrisailam1143
    @vadlasrisailam1143 3 ปีที่แล้ว +3

    చాలా చక్కటి స్వరం తో పద్యగానం చేసారు ...

  • @rohitrudrapu6729
    @rohitrudrapu6729 3 ปีที่แล้ว +3

    చాలా బాగా పాడుతున్నారు.
    ‌_ఎ.వి.ఆర్.మూర్తి

  • @parabrahmamp8486
    @parabrahmamp8486 ปีที่แล้ว

    Super sir
    ధన్య వాదాలు

  • @salakansarma
    @salakansarma ปีที่แล้ว

    శ్రావ్యమైన పఠనం, అద్భుత మైన వివరణ అభినందనీయం.
    "ఆశా తరళాక్షి తాండవము సల్పుచునున్నది" చాలా సాభిప్రాయం. శివ శివానీ ల నాట్యం తాండవం, లాస్యం. తాండవం ఉగ్రం, లాస్యం లలితం. "తరళాక్షి " ని తాండవం చేయించటం నిజంగా సబబు. ధన్యులు. పిల్లలకు స్పూర్తి డాయకం

    • @padyasudhamanjari2015
      @padyasudhamanjari2015  ปีที่แล้ว

      ధన్యవాదాలు సార్ 🙏. మంచి విషయాలను తెలియజేశారు.

  • @subbaiahvanapatla9458
    @subbaiahvanapatla9458 3 ปีที่แล้ว +3

    అభినందనలు మిత్రమా మీ మదురమన గాత్రం లో ముంతాజ్ మహల్ బాగుంది.
    గబ్బిలంపై త్వరలోనే నాగర్ కర్నూలు లో సభను ఏర్పాటు చేద్దాం...

    • @padyasudhamanjari2015
      @padyasudhamanjari2015  3 ปีที่แล้ว

      తప్పకుండా.... ధన్యవాదాలు సార్ 🙏

  • @appalakondagemmeliappalako816
    @appalakondagemmeliappalako816 ปีที่แล้ว

    ❤chala chala anubhuthinichhai me padyalu

  • @ERN1995
    @ERN1995 ปีที่แล้ว

    అద్భుతమైన కృషి మీది 👌🏼👌🏼
    తెలుగుభాషామధురిమలు చవిచూసి, చూపిస్తున్నారు. 👍🏼👍🏼

  • @chintalapatiravikumar5763
    @chintalapatiravikumar5763 ปีที่แล้ว

    Chala madhuramuga alapincharu

  • @sudhakarmeesala6403
    @sudhakarmeesala6403 4 ปีที่แล้ว +4

    అద్భుతమైన గాత్రము

  • @laxminarayanganduri5159
    @laxminarayanganduri5159 3 ปีที่แล้ว +3

    పద్యం చదువు విధానం👌👌

  • @naganarasimhamurthy5622
    @naganarasimhamurthy5622 2 ปีที่แล้ว

    Padua sudha manjari vintunte amrutha panam chesinatlunnadi.acharyula variki dhanyavadamulu.jashuva gari Padya rathnamulanu meru paduthunte munthaj shajahan la prema manasulo kadalduthunnadi.padya laloni Vedanta viyogamu la varnana anirvachaniyam.jashuva vari rachanulu animuthyamulu.

  • @kanamarlapudisambasivarao2247
    @kanamarlapudisambasivarao2247 ปีที่แล้ว

    Jashuva garu vrasina padyalu meeru chadivina vidhanam bhavanni cheppey vidhanam vinalanipinchetluga vunnayi god bless you

  • @harikrishnaandavolu2993
    @harikrishnaandavolu2993 3 ปีที่แล้ว +1

    Nee padyamu chakkaga padutunnaru santhosham mee prayatnam safalam kavalani korukntunnam mitrama

  • @venkateshboya3865
    @venkateshboya3865 ปีที่แล้ว

    Sir very nice your voice . So poems are very nice and that mean nice . I under stand ur poems . Sir about the school and college good poems keep in youtube sir .

  • @sudhakargajjala8053
    @sudhakargajjala8053 ปีที่แล้ว

    చాలా మధురంగా వున్నాయి ఈ పద్యాలు.
    వీరి అడ్రస్ తెలుపగలరు 🙂👌🙏

  • @rameshb6805
    @rameshb6805 3 ปีที่แล้ว +2

    గొప్పగా వర్ణించారు సర్

  • @SaladiPrabhakarmurthynaidu
    @SaladiPrabhakarmurthynaidu 4 หลายเดือนก่อน

    Excellent sir.

  • @srinivassri2481
    @srinivassri2481 3 ปีที่แล้ว +2

    చాలా అద్భుతంగా చెప్పారు అన్నయ్య,👌💐💐

  • @premchandanumala1956
    @premchandanumala1956 3 ปีที่แล้ว +1

    Great mee Padua pathanam vivarana chala ..Chaos bagundi

  • @madhupadakandla3896
    @madhupadakandla3896 ปีที่แล้ว

    చాల బాగుంది మీ వివరణ

  • @SAITEJABALIVADA
    @SAITEJABALIVADA 3 ปีที่แล้ว +2

    Excellent please keep on

  • @rameshmucharla1629
    @rameshmucharla1629 3 ปีที่แล้ว +1

    పద్య పఠనం బాగుంది

  • @annavaramprasad99
    @annavaramprasad99 2 ปีที่แล้ว +1

    పద్యాలను ఎంతో హృద్యంగా
    అద్భుతముగా ఆలపించారు.
    మీ సాహితీసేవకు నమస్సులు 🙏

  • @sastrysista2171
    @sastrysista2171 ปีที่แล้ว

    Very very nice exlaination and Gaanam 🙏

  • @talariraju3603
    @talariraju3603 3 ปีที่แล้ว +2

    Sir చాలా బాగా పాడారు పద్యాలు.

  • @ramakrishnabandaru1897
    @ramakrishnabandaru1897 ปีที่แล้ว

    First time I heard your poems.
    Felt very happy to hear.
    Very nice sir. I can't express my feelings now.
    I became a fan of you sir

  • @rajashekarreddy4660
    @rajashekarreddy4660 3 ปีที่แล้ว +2

    Sweet voice sir, chala goppaga paadaru! 👌

  • @bottaramu8513
    @bottaramu8513 3 ปีที่แล้ว +2

    Super,super,&also very very sweet voice

  • @prathapreddysareddy6317
    @prathapreddysareddy6317 3 ปีที่แล้ว +2

    Ur voice very sweet sir 👌👋🙏

  • @KKRGAMING-ki4xq
    @KKRGAMING-ki4xq 7 หลายเดือนก่อน

    Supper voice

  • @kotikelapudinarasimharao7543
    @kotikelapudinarasimharao7543 ปีที่แล้ว

    Good Good brother

  • @sanathansatya1667
    @sanathansatya1667 2 ปีที่แล้ว

    Thank you Sir

  • @darasarveswaraguptanam823
    @darasarveswaraguptanam823 ปีที่แล้ว

    Dhanyawad

  • @VijayaLaxmi-ec2gm
    @VijayaLaxmi-ec2gm 3 ปีที่แล้ว +2

    Very good please keep it up Telugu bhasha goppatanam jaswagari padyalalo chala chakkaga kanapadutundi.

  • @DukuntaSaidulu
    @DukuntaSaidulu 4 ปีที่แล้ว +4

    Great poems sweet voice sir

  • @rahimuudinmohammad
    @rahimuudinmohammad 2 ปีที่แล้ว

    అద్భుతం. ధన్యవాదములు

  • @shirmangarisrinivas6168
    @shirmangarisrinivas6168 ปีที่แล้ว

    అద్భుతం అమోఘం సార్

    • @moshechatla8121
      @moshechatla8121 ปีที่แล้ว

      Ch moshe good presentation sir keepitup si

  • @nagulaiahpediveeti8306
    @nagulaiahpediveeti8306 3 ปีที่แล้ว +1

    జాషువా గారి కలము నుండి జాలువారిన పద్య మంజరి మీ స్వరధారలు వీనుల విందుగా వున్నాయి.

  • @Raja-zq1bw
    @Raja-zq1bw 3 ปีที่แล้ว

    మీ గాత్రం అమోఘం.

  • @MatamDhinesh
    @MatamDhinesh 7 หลายเดือนก่อน

    Mitrama very good iam feel yragyam

  • @venugopalkasukurthi3030
    @venugopalkasukurthi3030 3 ปีที่แล้ว +1

    బాగుంది
    మీ నోట నుండి పద్యం..ఆ నోట నుండి దాని వివరణ 🙏.
    ఈ తరానికి మరో తరానికి...నువ్వు తరగని
    తరంణీవే...💐💐💐💐

  • @ncsctsr
    @ncsctsr ปีที่แล้ว

    Super.no words to explain

  • @englishbyjnr1968
    @englishbyjnr1968 2 ปีที่แล้ว

    చక్కగా వచించారు. అభినందనలు

  • @sudershanreddy1949
    @sudershanreddy1949 2 ปีที่แล้ว

    Thanks,chary garu

  • @suryanarayana6034
    @suryanarayana6034 3 ปีที่แล้ว +2

    Sir excellent singing and good explation sir.

  • @nkraju2126
    @nkraju2126 3 ปีที่แล้ว +1

    Excellent voice and explanations.

  • @chilumulasuresh2756
    @chilumulasuresh2756 2 ปีที่แล้ว

    అద్భుతంగా వివరించారు

  • @satishchandravadlana7209
    @satishchandravadlana7209 2 ปีที่แล้ว

    Your voice is sweet and beautiful poetry about the human existence in the universe in the view of Jashuva.

  • @kameswararaolaveti4057
    @kameswararaolaveti4057 ปีที่แล้ว

    బాగా చెప్పారండి నాలాంటి పామరుడికి కూడా అర్థమయ్యేటట్టు...

  • @venkatramana3581
    @venkatramana3581 2 ปีที่แล้ว +1

    అన్న గారికి అభి వందనం.💐💐💐🙏

  • @sankaranarayanabora1969
    @sankaranarayanabora1969 ปีที่แล้ว

    Supr sir

  • @SriDanthuluri
    @SriDanthuluri 2 ปีที่แล้ว

    మంచి కార్యక్రమం
    అభినందనలు.

    • @msushanth4002
      @msushanth4002 ปีที่แล้ว

      Dear Brother,excellent reading, explanation & voice.,To ENJOY MORE,Pl.give the LYRIC OF POEMS,to read & immerse inthe POETICAL RIVER OF GREAT JOSHUVA.,M.DEVADAS.,

  • @basavaraogudavalli1996
    @basavaraogudavalli1996 3 ปีที่แล้ว +1

    excellent expression with sweet voice

  • @sampathkumar9678
    @sampathkumar9678 3 ปีที่แล้ว

    మీ కంఠం బాగుంది. Cheephe విధానం బాగుంది.

  • @saisiddarthamudavath4016
    @saisiddarthamudavath4016 ปีที่แล้ว

    Mee swaramu ragam bagaundhi sir

  • @kkr7882
    @kkr7882 3 ปีที่แล้ว +2

    Very nice 👌👌

  • @venkateswarareddy7182
    @venkateswarareddy7182 3 ปีที่แล้ว +1

    Wonderfull journey continue

  • @kotib3571
    @kotib3571 3 ปีที่แล้ว +1

    Excellent u r voice sir

  • @padyasudhamanjari2015
    @padyasudhamanjari2015  3 ปีที่แล้ว +5

    పద్య సుధా మంజరి చానెల్ ప్రేక్షకులకు వినయపూర్వక విజ్ఞప్తి:
    ఆవిరి యోడలో అను పద్యం లోని చివరి పాదంలో "సతమున్" అనే పదము miss అయింది...
    ఏ పుష్పంబునుజేసి అనే పద్యం లో మూడవ పాదం లో సమస్త అనే పదానికి బదులు సకల అని పొరపాటున చదవడం జరిగింది.
    ఈ రెండుపూర్తి పద్యాలు దిగువన ఇస్తున్నాను సవరించుకుని చదువుకోగలరని ప్రార్దన.
    ఉ. ఆవిరియోడలో, జలధియాన మొనర్చెడు బాటసారులో
    భూవర! రేవులందు దిగిపోయెద రించుక వెన్క ముందుగా
    నీ వసుధాపణంబు పనియెల్ల ముగించి, స్వదేశగాములై
    పోవుచు వచ్చుచుండ్రు సతమున్ బ్రజలీ నరజన్మ వర్తకుల్.
    ఉ.ఏ పుష్పంబును జేసి వాడుకొనునో యీదేహమున్ దైవమో
    భూపశ్రేష్ఠ! విచారమందకుము, మామూలేకదా? యీమృతి
    వ్యాపారంబు సమస్త జీవులకు, విశ్వవ్యాఘ్రి గర్భంబునన్
    మాపుల్ రేపులునెందరో; యిముడుచున్నారందు నేనొక్కతెన్.

  • @madhu85230
    @madhu85230 2 ปีที่แล้ว

    Chla baga padyani vivaranatho vachincharu

  • @jagan6509
    @jagan6509 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పారు మిత్రమా

  • @srinivasoppula1935
    @srinivasoppula1935 3 ปีที่แล้ว +2

    Super sir👌👌👌

  • @torah245
    @torah245 3 ปีที่แล้ว +1

    baguga padinavu.chakkaga vivarinchinavu. nee voice chala bagundi.To appreciate and praise you in our mother tongue ,I do not know how to type in Telugu.

  • @hariakulaindia
    @hariakulaindia 4 ปีที่แล้ว +1

    Super guruvu garu