రోమా 9;5 గూర్చి పరిశీలన || SHORT MESSAGE || NAVEEN KUMAR S

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • రోమీయులకు 9:5 లో సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నది ఎవరు?
    ☘️ రోమీయులకు 9:5 వచనము కొన్ని తర్జుమాలలో #తండ్రియగు దేవుడు సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నట్టుగా ఉంటుంది,
    🆚 Catholic Telugu Bible లో రోమీయులకు 9:5. వారు మన పితరుల వంశీయులే. క్రీస్తు మానవరీత్యా వారి జాతి వాడే. సమస్తమునకు ఏలికయగు దేవుడు సదా స్తుతింపబడును గాక! ఆమెన్.
    🆚 Romans‬ ‭9:5‬ ‭GNT‬‬ “they are descended from the famous Hebrew ancestors; and Christ, as a human being, belongs to their race. May God, who rules over all, be praised forever! Amen.”
    bible.com/bibl...
    🆚 Romans‬ ‭9:5‬ ‭AMP‬‬ “To them belong the patriarchs, and from them, according to His natural descent, came the Christ (the Messiah, the Anointed), He who is exalted and supreme over all, God blessed forever. Amen.”
    bible.com/bibl...
    --------------
    ☘️ రోమీయులకు 9:5 వచనము ఇతర కొన్ని తర్జుమాలలో #యేసుక్రీస్తు సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నట్టుగా ఉంటుంది.
    🆚 BSI రోమీయులకు 9:5 పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈ̶య̶న̶ సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌.
    --------------
    ⁉️ ఏ తర్జుమా సరియైనది? ఎలా సరిచేసుకోవాలని బైబిలు చెబుతుంది?
    🍀 విశ్వాసానికి మూలమైన వాటికి ఆత్మ సంబంధమైన విషయాలను ఆత్మ సంబంధమైన విషయాలతో సరిచూచుకోవటానికి 2 లేక 3 సాక్ష్యాలు కావాలి. ఇది ధరశాస్త్ర నియమము (2 కోరింథీయులకు 13:1; యోహాను 8:17).
    --------------
    ⁉️ యేసుక్రీస్తు సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడు అని మరో లేఖన ఆధారముందా?
    👉 రోమీయులకు 9:5 తప్ప మరో వచనము ఆధారము లేదు.
    👉 కాని, దేవుడు యేసును ప్రభువుగాను రక్షకుడిగాను నియమించి (అపో. కార్యములు 2:36; 10:36) భూమి మీద పరలోకమందును అన్ని నామములకన్నా పై నామముగా ఉంచి (ఫిలిప్పీయులకు 2:11) సర్వాధికారము ఇచ్చాడు (యోహాను 5:27; మత్తయి 28:18). కాని యేసును దేవుడుగా నియమించలేదు మరియు యేసుకు దేవునిపై ఆధికారము లేదు (1 కోరింథీయులకు 15:27).
    --------------
    ⁉️ వాస్తవానికి, సర్వాధి కారియైన దేవుడు ఎవరు?
    👉 1 సర్వాధి కారియైన దేవుడగు ప్రభువును (తండ్రి) 2 గొఱ్ఱపిల్లయు (యేసుక్రీస్తు) దానికి దేవాలయమై యున్నారు (ప్రకటన గ్రంథం 21:22; 1:8; 4:8; 11:17; 16:14; 19:6,15).
    ☘️ పై వచనాలన్నిటిని బట్టి, తండ్రియగు దేవుడు మాత్రమే సర్వాధి కారియైన దేవుడు.
    --------------
    ⁉️ వాస్తవానికి, నిరంతరము స్తోత్రార్హుడు ఎవరు?
    👉 మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు (1 దినవృత్తాంతములు 29:10; రోమీయులకు 1:25; 2 సమూయేలు 22:47; కీర్తనల గ్రంథము 18:46;).
    ☘️ పై వచనాలన్నిటిని బట్టి, తండ్రియగు దేవుడు మాత్రమే నిరంతరము స్తోత్రార్హుడు.
    --------------
    🍀 రోమీయులకు 9:5 వచనము కేవలము తర్జుమాలోపమే కాబట్టి, రోమీయులకు 9:5 వచనాన్ని ఇలా సరిచేసుకోవాలి.
    ✅ 🔥రోమీయులకు 9:5 పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. సర్వాధికారియైన దేవుడు నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌.
    🍀 ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులలో సరిచూచుకొమ్మని (1 కొరింథి 2:13) చెప్పిన ప్రకారము, 66 పుస్తకాల పరిపూర్ణ అవగాహనతో దైవజనుడు వాటిని (తప్పులను) సరిచేయుటకు సన్నద్ధుడు (2 తిమోతికి 3:16-17). ఇది లేఖనాలకు కలపడం లేక తేసివేయటం (ప్రకటన 22:18-19) క్రిందకు రాదని, కేవలం తర్జుమాలను సరిదిద్దటమేనని గ్రహించాలి.
    🍀 ఇదే దేవుని నీతిని, రాజ్యాన్ని వెదకుట.

ความคิดเห็น • 6

  • @nenavathshankar5392
    @nenavathshankar5392 3 หลายเดือนก่อน +6

    👌👌👌👍👍🙏🙏.

  • @prakashbabu254
    @prakashbabu254 3 หลายเดือนก่อน +4

    🙏

  • @DaivaAnveshSeenderi
    @DaivaAnveshSeenderi 3 หลายเดือนก่อน +3

    సూపర్❤❤❤❤

  • @palakommaashok5623
    @palakommaashok5623 3 หลายเดือนก่อน +7

    సూపర్ వివరణ అన్న 👌👌👌

  • @johnbonkuri9058
    @johnbonkuri9058 3 หลายเดือนก่อน +4

    🙏👌👍🏻👏🌺💐Super

  • @rajkumarkola8375
    @rajkumarkola8375 3 หลายเดือนก่อน

    రోమా 9:5 గ్రీక్ భాషలో చూస్తే క్రీస్తు సర్వాధికారిన దేవుడు రాయబడింది. యోహాను1:1 దేవుని వద్ద ఉన్న దేవుడు యేసు చెప్తుంది. ప్రకటన 1:8 ఏసుక్రీస్తు తనకు తాను సర్వాధికారి అయిన దేవుడు అని చెప్పుకున్నావిషయం తెలుస్తుంది. తండ్రి ఎలా తనంతటతాను జీవము కలవాడు కుమారుడు కూడా తనంతట తాను జీవము కలిగిన వాడు. తండ్రి దేవుడు కుమారుడు కూడా దేవుడని బైబిల్ చెప్తుంది.