బాల్యం బలీయమైన శాపం కావాల్సిందేనా// Dr.Mahesh// Mathrusree Ayurveda & Siddha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 มิ.ย. 2020
  • బాల్యం బలీయమైన శాపం కావలసిందేనా....
    బాధగా లేదా.... ఆ బాధే మనకు రాదా....
    గోటితో పోయే దానికి, గొడ్డలి దాకా తీసుకురావడం అంటే ఉగ్గుపాలను మరవడమే.....
    పసిపిల్లల్లో వచ్చే దృష్టి లోపాలను ప్రపంచ ప్రఖ్యాత వైద్యం నిరోధించలేక పోతోంది. జీవితాంతం మంద దృష్టితో బాధపడ వలసిందేగా..... అయినా మనలో మార్పురాదా..?
    పసిపిల్లల్ని సైతం ఊబకాయం వేధిస్తున్నా.....
    ఐ.సి.యులు, ఆక్సిజన్ సిలండర్లు, వెంటిలేటర్లు, నెబ్యులైజర్లు ఎంతలా వెక్కిరిస్తున్నా....
    సెలైన్ సూదులు, ఇంజక్షన్ సూదుల రోదనలు.....
    పసిపిల్లల ఆక్రందనలు మిన్నుముట్టుతున్నా.....
    తగ్గే రోగాలకు, తగ్గని మందులు వాడుతున్నా....
    తరచూ జబ్బు పడుతూ....
    వైద్యశాలలే... మన నివాసాలౌతున్నా....
    విద్యాలయాల్లోనే కాక, వైద్యాలయాల్లో కూడా పరీక్షలు....
    అవసరమైనవే కాక, అవసరంలేని పరీక్షలకు సిద్ధమౌతున్నా....
    యాంటి బయోటిక్స్ , స్టెరాయిడ్స్ , పెయిన్ కిల్లర్స్ పసిమొగ్గల్ని చిదిమేస్తున్నా..... నలిపేస్తున్నా....
    మనలో మార్పురాదా.....?
    సోడా బుడ్డి అద్దాలు.....
    మూరెడు చోట, పెద్ద తాను గుడ్డ....
    మనకవేమీ కనిపించవా.... లేక బాధనిపించవా....
    వయసుకు మించి ఎద్దులా ఎదిగితేనే ఆరోగ్యంగా వున్నట్టా.....
    విద్యాలయాలకు దగ్గరలో వైద్యాలయాలు మంచిదే,
    కానీ.... వైద్యాలయమే జీవన విద్యాలయమౌతున్నా....
    విద్యాలయంతో పాటు, వైద్యాలయంలో కూడా నివాసముంటున్నా....
    బొమ్మలతో పాటు, మందులతో కూడా ఆడుకోవలసిందేనా.....
    పసి వయస్సు రోగాల పాలవవలసిందేనా.....?
    ఏమిటీ ఈ శిక్ష ..... పసి బిడ్డలకేదీ రక్ష....?
    బాల్యంలో పరిపూర్ణమైన ఆరోగ్యంతో వుంటేనే, జీవితాంతం సంపూర్ణ ఆరోగ్యంగా వుండడం సాధ్యమౌతుందని మనందరికీ తెలిసిన విషయమే. బాల్యావస్ధలో వచ్చే రోగాల ప్రభావం జీవితాంతం వేధిస్తుందనడంలో అతిశయోక్తి లేదు.
    బాల్యంలోనే వ్యాధి నిరోధక శక్తిని కోల్పోతే, జీవితాంతం బాధ పడవలసిందే. బాల్యావస్ధలో సహజ సిద్ధమైన వ్యాధి నిరోధక శక్తిని కలిగి వుండడం, పెంపొందిచుకోవడం తప్పనిసరి అవసరం.
    పసిపిల్లల్లో దృష్టి మాంద్యం, ఊబ కాయం, ఉబ్బసం, వాంతులు, విరేచనాలు, తరచూ జ్వరం, జలుబు, కడుపునొప్పి, విరేచనబద్ధం మొదలగునవి వ్యాధినిరోధక శక్తి లోపాలు కావా.....?
    మల్టీ మిటమిన్ సిరప్పులు, టాబ్లెట్లు, క్యాప్సిల్సు, ఇంజక్షన్లు ఏం చేస్తున్నాయి..... వీటికి తోడు సెలైన్ బాటిళ్ళు....
    ఫేరెక్సులు... సెరిలాక్కులు ఎక్కడికి పోతున్నాయి.....
    బూష్టులు.... హార్లిక్సులు ఏమౌతున్నాయి....
    ఆలోచించామా ఎప్పుడైనా.....
    ఇంతకీ వ్యాధినిరోధక శక్తి ఎలా లోపిస్తోంది .....?
    మనం రోజూ తీసుకునే సాధారణ ఆహారంలోనే మన శరీరానికి కావలసిన అన్ని రకాలయిన పోషక పదార్ధాలు ఉంటాయి. అయితే, వాటిని మన శరీరం అవసరానికి తగినంత పరిమాణంలో స్వీకరించి శరీరంలోని అన్ని భాగాలకు తగినంతగా సరఫరా చేయలేకపోవడం వలన వ్యాధి నిరోధక శక్తి లోపిస్తుంది.
    అలాగే... పోషక పదార్ధాలు ఎక్కువైనా కూడా అనేక రకాలైన అనారోగ్యాలకు గురవుతుంటాము.పోషక పదార్ధాలు ఎంత అవసరమో, అవి ఎక్కువైతే అంతే అనర్ధం. ఈ మధ్య కాలంలో ఈ సమస్యే అత్యధికంగా వుంది. దీనిని నివారించడం తప్పనిసరి అవసరం.
    వ్యాధి నిరోధక శక్తి లోపించడానికి పై రెండింటిని ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.
    ఆలోచించలేమా..? గుర్తించలేమా...? జాగ్రత్తపడలేమా...?
    పసిమొగ్గలకు పరిపూర్ణమైన ఆరోగ్యం అందించలేమా...?
    పాతొక రోత, కొత్తొక వింత...ఇంకెంత కాలం ఈ కొత్త వింత...
    నేడు అసాధ్యంగా భావిస్తున్న ఈ సమస్యకు అలనాడే అద్భుత పరిష్కారం చూపారు మన భారతీయ మహర్షులు.
    దేశమును ప్రేమించుమన్న....
    మంచి అన్నది పెంచుమన్న...
    వట్టి మాటలు కట్టి పెట్టఓయ్ ....
    గట్టిమేద్లపెట్టఓయ్ .....
    ఆయుర్వేదోద్యమమ్ లో భాగస్వామ్యులమౌదాం...
    ఆరోగ్య భారతావనిని సాధించుకుందాం....
    Dr.Mahesh
    Ayurveda & Siddha
    4/1, Ashok Nagar, Guntur.
    cell : 9701 965700

ความคิดเห็น •