పలమనేరు మండలం మహిళా గ్రూపులకు 7.50 కోట్లు చెక్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి
ฝัง
- เผยแพร่เมื่อ 11 ก.พ. 2025
- ఇది మహిళా సంక్షేమ ప్రభుత్వం
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
ఇంటికో పారిశ్రామిక వేత్తను చేయడమే బాబు ధ్యేయం
మహిళా గ్రూపులకు రూ.7.5 కోట్ల చెక్కును పంపిణి చేసిన ఎమ్మెల్యే అమర్
ఇది మహిళా సంక్షేమ ప్రభుత్వమని, తెలుగు దేశ ప్రభుత్వ హయాంలోనే మహిళలు అన్ని విధాల అభివృద్ధి చెందుతున్నారని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం వద్దనున్న మహిళా సమాఖ్య భవనంలో మండలంలోని గ్రూపు సభ్యులకు మెగా రుణమేళా కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా మహిళా సమైక్య సభ్యులకు రూ. 7.5 కోట్ల చెక్కును ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నాడు ఎన్టీఆర్ మహిళలకు అండగా నిలుస్తూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చారని, అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం మహిళల అభివృద్ధి కోసం డ్వాక్రా మరియు దీపంలాంటి గొప్ప పథకాలను తీసుకొచ్చారన్నారు. నాడు చంద్రబాబు ఆలోచనతో పుట్టిన డ్వాక్రా గ్రూపులకు రుణాలనిచ్చేందుకు బ్యాంకులు నేడు క్యూ కడుతున్నాయని అందుకు మహిళలు బ్యాంకులకు కల్పించిన నమ్మకమే కారణమన్నారు. పురుషులకు దీటుగా మహిళలు అన్ని రంగాలలో రాణించాలని కోరారు. ప్రభుత్వం మరియు బ్యాంకులు అందిస్తున్న సహకారాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆయన సూచించారు. ప్రతి ఇంటిలో ఒక మహిళా పారిశ్రామికవేత్తను చూడాలనేదే బాబు ధ్యేయంగా పెట్టుకున్నారని ఆ దిశగా మహిళలు రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఖాదర్ భాషా, ఏపీఎం మొగిలీశ్వరయ్య, సీసీ లు హరి, విజయ కుమారి, గురుమూర్తి మరియు మండల పార్టీ అధ్యక్షులు నాగరాజు రెడ్డి, ప్రధాన కార్యదర్శి గణేష్, నాయకులు జగదీష్ నాయుడు, వెంకట రత్నం,రామూర్తి నాయుడు, సెల్వ రాజ్, వెంకట ముని రెడ్డి, స్వతంత్ర బాబు, హరి, గిరి, శీనులతో పాటు జనసేన నాయకులు దిలీప్ కుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
పలమనేరు మండల మహిళా సమఖ్య సభ్యులకు
Jai TDP Jai CBN Vote for Cycle 🎉🎉🎉🎉🎉
😂😂😂