బాలగేయం : కనిపించే దైవము అమ్మ ఒక్కటే
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- బాలగేయం
"కనిపించే దైవము అమ్మ ఒక్కటే"
కనిపించే దైవము అమ్మ ఒక్కటే
జన్మనిచ్చి పెంచేదీ అమ్మ ఒక్కటే
బతుకు నడిపించేదమ్మ ఒక్కటే
అమృతంలా పలుకేదమ్మ ఒక్కటే
దైవంలా వరమిచ్చేదమ్మ ఒక్కటే చెన్నా
సేలయేటి గాలిలోన సేద తీరినా
పట్టు పాన్పులపైన పవళించినా
దేవతలు అమృతమే సేవించినా
అమ్మ ప్రేమ ఎప్పుడైనా దొరుకునా
అమ్మ వెచ్చదనం వారికందునా చెన్నా
అమ్మ అన్నింటినీ వదులునన్న
పిల్లలను ఏమాత్రం వదలదన్న
రాగద్వేషాలన్ని వదులునన్న
ప్రేమానురాగాలు పంచునన్న
మనసులో బాధను దాచునురా చెన్నా
అద్దాల మేడలో జీవిస్తున్నా
షడృరుచుల భోజనం చేస్తున్నా
బంధువులు స్నేహితులెందరున్నా
ధనసంపద సౌభాగ్యాలెన్నున్నా
అమ్ముంటేనే ఆనందం కల్గును చెన్నా
బి.చెన్నారావు, పాల్వంచ
🎉🎉🎉
Nowords your lyrics and excellent singing both are legend s
అద్భుతంగా ఉంది అమృత ధారాలా వినసొంపుగా అర్థవంతంగా ఉంది 🎉
🙏
Very nice.❤
🙏