పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘాలతో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమావేశం || Pawan Kalyan || AP Govt

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 มิ.ย. 2024
  • దేశం మెచ్చేలా ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థకు సొబగులు
    • ఉద్యోగుల సమస్యలు ఆసాంతం వింటూ... వాటిని నోట్ చేసుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు
    ‘భారత దేశం మెచ్చేలా, జాతి మొత్తం ఆంధ్ర ప్రదేశ్ వైపు తిరిగి చూసేంత అద్భుతంగా రాష్ట్ర పంచాయతీరాజ్ వ్యవస్థను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పని చేద్దాం... దీనికి నేను కంకణబద్ధుడినై పని చేస్తాను. నా ఒక్కడి వల్లనే ఈ మహా క్రతువు పూర్తి కాదు. ఉద్యోగుల సహకారం, సూచనలు నాకు చాలా అవసరం. దీనికి ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషిస్తారని బలంగా విశ్వసిస్తున్నాను’ అని ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు ఆకాంక్షించారు.
    • వ్యవస్థలను ఎంత తీవ్రంగా దెబ్బ తీశారో శ్వేత పత్రాల ద్వారా వెల్లడిస్తాము
    వినతి పత్రాలను స్వీకరించిన అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రాన్ని ఎంత తీవ్రంగా దెబ్బ తీశారనేది... వ్యవస్థలను ఎంత నాశనం చేశారనే విషయాలను, కీలక శాఖల్లోని వాస్తవాలను ప్రజల ముందుపెట్టేందుకు శాఖల వారీగా శ్వేత పత్రాలు విడుదల చేస్తాము. పంచాయతీరాజ్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తాను. ఎంతో ఇష్టంతోనే ఈ కీలకమైన శాఖలను తీసుకున్నాను. వ్యవస్థ మొత్తం అద్భుతంగా పని చేసేలా ముందుకు తీసుకెళ్తాను. సరైన నాయకత్వం లేకపోతే వ్యవస్థలు ఎలా నాశనం అవుతాయో గత ప్రభుత్వ పాలకులు ప్రజలకు స్పష్టంగా తెలియజేశారు. మళ్లీ వ్యవస్థలను గాడిలోపెట్టేందుకు, అవి పూర్తిగా ప్రజల కోసం పని చేసేలా తయారు చేసేందుకు శక్తివంచన లేకుండా పనిచేద్దాం. ఉద్యోగులకు అన్ని విధాలా అండగా నిలుస్తూ, సాధక బాధకాలను అర్థం చేసుకుంటూ పునరుత్తేజం కలిగించేలా పాలన ఉంటుంది.
    • వింటాను... ఆలోచిస్తాను... పరిష్కారం చూపుతాను
    ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం. వారికి నేను ప్రత్యేకంగా గౌరవం ఇస్తాను. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకునే. మీ సమస్యలన్నీ నాకు తెలుసు. ఒకటో తేదీన జీతం రాకపోతే ఎంత కష్టమో కూడా అర్థం చేసుకోగలను. నేను ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత రాత్రికి రాత్రి అద్భుతాలు చేసేస్తాను అని చెప్పను. ఉద్యోగుల వేదన వింటాను. వారి సూచనలను స్వీకరిస్తాను. మొదట మీ బాధలు ఆసాంతం వినేందుకు ప్రయత్నిస్తాను. అప్పటికప్పుడు పూర్తి చేసే సమస్యలు ఉంటే యుద్ధ ప్రాతిపదికన స్పందిస్తాను. ఓ సగటు సాధారణ మధ్య తరగతి ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం నుంచి వచ్చిన స్థాయిని నేను ఎప్పుడు మరిచిపోను. మీ కష్టాలు అన్ని నాకు తెలుసు. ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొనే కష్టాలను నా కుటుంబంలోని కష్టాలుగానే చూస్తాను.
    • గత ప్రభుత్వం మిమ్మల్ని భయపెట్టింది.. మేము మిమ్మల్ని అర్థం చేసుకుంటాం
    పెను తుపాను తర్వాత మళ్లీ ఇంటిని చక్కదిద్దుకోవాలి. రాష్ట్రానికి అలాంటి సమయం ఇది. రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసికట్టుగా పాలకులు, ఉద్యోగులు పని చేసి వ్యవస్థలను నిలబెట్టాలి. ప్రజలకు పూర్తిస్థాయిలో వాటి సేవలు అందాలి. దీనికి ఏం చేద్దాం అనేది మీరు చెప్పండి. ఈ క్రతువులో మీ సమస్యలు ఉంటే వాటిని మాకు తెలియజేయండి. వ్యవస్థలతో పాటు ఉద్యోగుల సమస్యలు తీర్చే బాధ్యత తీసుకుంటాను. ఉద్యోగ సంఘాల నాయకులు సమస్యను వివరించడమే కాదు. దానికి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కూడా సూచించండి. దానిపై తగిన సహేతుకమైన నిర్ణయం మేము తీసుకుంటాం. ప్రభుత్వ వెన్నెముక ఉద్యోగులే. వారిని నిర్లక్ష్యం చేసే వ్యక్తిని కాదు. చిన్న చూపు చూసే వ్యక్తిని అంతకంటే కాదు. మీ సమస్య నా సమస్యగా భావిస్తాను. మీ సమస్యలన్నీ వినగలిగే శక్తి పూర్తిస్థాయిలో ఉన్న వాడిని.
    ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఉద్యోగ సంఘాల నుంచి అందిన వినతులు
    • ఉద్యోగ సంఘాలను సైతం గత ప్రభుత్వం భయపెట్టింది. జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి తెచ్చారు. జీపీఎఫ్ నిధులు మళ్లించేశారు. ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలి. విశ్రాంత ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే అందాలి. జీపీఎఫ్ లోన్లు, సరండర్ లీవ్ ల వేతనాలు, మెడికల్ రీయింబర్స్ మెంట్ అందాలి. 12వ పీఆర్సీ కమిషనర్ తోపాటు తగినంత సిబ్బందిని వెంటనే నియమించాలి. పెండింగ్ లో ఉన్న డీఏ ఎరియర్స్ చెల్లించాలి.
    ఏపీ జేఏసీ అమరావతి
    • కొత్త జిల్లాలకు సంబంధించి డీఎల్పీఓ పోస్టులను ప్రతి జిల్లాకు పూర్తి స్థాయిలో ఇవ్వాలని, పంచాయతీ డివిజినల్ అధికారి లేదా దానికి తగిన హోదా కలిగిన అధికారులతో వాటిని భర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ అండ్ డివిజినల్ పంచాయత్ ఆఫీసర్స్ అసోసియేషన్ అమరావతి సభ్యులు కోరారు.
    • ఎంపీడీవో పదోన్నతుల్లో సూపరిండెంట్ లకు తగిన విధంగా న్యాయం చేయాలని 34 శాతం కోటాను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టిరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కోరారు.
    • గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న ఈ పంచాయతీ డేటా ఎంట్రీ ఆపరేటర్లకు కనీస వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ ఈ పంచాయతీ డేటా ఎంట్రీ ఆపరేటర్ అసోసియేషన్ కోరింది.
    • మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేసిన విధంగా 23 శాతం పీఆర్సీ జీతాల పెంపుదల చేయాలని, కొన్ని క్యాడర్ల సిబ్బందికి గ్రేడ్స్ ఫిక్సేషన్ పై ప్రభుత్వం పంపిన కమిటీ రిపోర్టు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు కోరారు.
    #PawanKalyanAneNenu #JanaSena #panchayat #employees #govt #prc #village #mahatmagandhi #deputycmpawankalyan #deputycm #association #mpdo #ap #jac #andhrapradesh #amaravathi
    #JanaSenaParty #PawanKalyan #funds #government #govtjobs #gpf #cps #retired

ความคิดเห็น • 340

  • @Sriram73447
    @Sriram73447 3 วันที่ผ่านมา +383

    అన్నయ్యను ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా వుంది

    • @dharaniprasad1111
      @dharaniprasad1111 3 วันที่ผ่านมา +16

      Okkadu Unadu jagan bro opposition kosam letter rasadu Speaker ki send chesadu 2019 loo pk garu opposition ey ledu 5yrs hardwork money edi bhayya Fight ante ❤ true leader

    • @tatikrishna9724
      @tatikrishna9724 2 วันที่ผ่านมา +2

      Yes 💯

  • @sairavilakkam4064
    @sairavilakkam4064 3 วันที่ผ่านมา +307

    భారత దేశం లో No 1 పంచాయతీ రాజ్ ఆంధ్రప్రదేశ్ కావాలి. అది పవన్ కళ్యాణ్ టార్గెట్.

    • @ashokag5155
      @ashokag5155 3 วันที่ผ่านมา +10

      anthe kadu bro janasena party karantaka lo ravalii....ekkada bike Care Paina antha janasena janasena

    • @lagududora5830
      @lagududora5830 2 วันที่ผ่านมา +1

      Jai JANASENA

  • @pawanism9501
    @pawanism9501 3 วันที่ผ่านมา +103

    మా గవర్నమెంట్ ఉద్యోగుల పట్ల మీరు చూపే ఆదరణ సూపర్ కల్యాణ్ అన్నా ❤❤❤🙏🙏🙏

  • @bukkevijaykumarnaik454
    @bukkevijaykumarnaik454 3 วันที่ผ่านมา +82

    అత్సవ్యస్తంగా ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థ ను బాగుపరచడానికి వచ్చిన అన్నా మహానుభావుడు

  • @malachinnamallaiahmala7381
    @malachinnamallaiahmala7381 3 วันที่ผ่านมา +107

    Deputy cm pawankalyan garu Jai janasena

  • @jayam1019
    @jayam1019 3 วันที่ผ่านมา +54

    శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీరు లక్షలాది మందికి స్ఫూర్తినిస్తున్నారు. మీ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు అండి

  • @venkateshbodduru8312
    @venkateshbodduru8312 3 วันที่ผ่านมา +114

    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే గొప్ప నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ అన్నయ్య మరియు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 🙏🙏🙏

  • @jsnrt9485
    @jsnrt9485 3 วันที่ผ่านมา +39

    ఎంత అందంగా మాట్లాడుతున్నాడు, జనం పట్ల ఇదే మమకారం ఉంటే దేముడు నిన్ను ఇంకా ఎక్కువ గా దీవిస్తాడు

  • @Prabhakar.G
    @Prabhakar.G 3 วันที่ผ่านมา +32

    వాస్తవిక దష్టితో.. పరిణతి తొ మాట్లాడం....సూపర్ అండి...pk గారూధన్యవాదాలు

  • @venkataramana-ov8yv
    @venkataramana-ov8yv 3 วันที่ผ่านมา +20

    ప్రజలకి ఇలాంటి నాయకుడు చాలా అవసరం... 🌹🙏🙏🙏

  • @Rameshbabu91
    @Rameshbabu91 3 วันที่ผ่านมา +62

    మార్పు మొదలయింది..... ఈ ఇద్దు సంవత్సరాలు పాలన ట్రెండ్ సెటర్ గ నిలవాలని ఆకాంసిస్తున్న.. 🫶

  • @manuyarramsetty
    @manuyarramsetty 3 วันที่ผ่านมา +19

    ప్రజాసేవే పరమావధి గా భావించే వ్యక్తిని రాజకీయాల్లో చానాళ్ళకు ఒకరిని చూస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది.❤.

  • @kommalapatisriram2793
    @kommalapatisriram2793 3 วันที่ผ่านมา +78

    ఆంద్ర ప్రదేశ్ కీ మంచి రోజులు వస్తాయి ఇంకా నుంచి ❤

  • @prasadmuttabattula2052
    @prasadmuttabattula2052 3 วันที่ผ่านมา +8

    డిప్యూటీ సి ఎం కళ్యాణ్ అన్న గారు పంచయతీ చేస్తున్న e- పంచాయతీ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోరిక మీ ద్వారా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అన్నయ్య ❤

  • @ganeshtattikota
    @ganeshtattikota 3 วันที่ผ่านมา +66

    Super super super... He is real hero... Jai pawan kalyan...

  • @janakijanu6402
    @janakijanu6402 3 วันที่ผ่านมา +38

    జై జై జనసేన అన్నా కలియుగంలో ప్రజా సైనికుడవు దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి అన్న అన్న స్టీల్ ప్లాంట్ జీతాలు కూడా ఇప్పటివరకు వేయలేదు అన్న ఆఫ్ శాలరీ వేశారన్న ఎవరికి చెప్పుకోవాలి ఎవరు స్టీల్ ప్లాంట్ సమస్య ఎవరు క్లియర్ చేయరు దుర్గా మాతల్లి ఎంత వేడుకుంటాం

  • @sivasoldier946
    @sivasoldier946 3 วันที่ผ่านมา +8

    Intha clear ga ardavantham ga matladina rajakeeya nayaukunni ippati vatraku chudaledu. There may be thousands of politicians but only few will become leaders. He is a leader ✊

  • @megacultjanasena
    @megacultjanasena 3 วันที่ผ่านมา +13

    రేపటి తరానికి నిజమైన నాయకుడు మార్గదర్శి అవుతారు సేనాని.
    ఇదే మేం కోరుకున్నది... నా భాద్యతగా చేస్తాను.. నేను అన్నీ సమయాల్లో అందుబాటులో లేకుంటే నా తరపున పొలిటికల్ సెక్రటరీ హరిప్రసాద్ గారు ఉన్నారు వారికి చెప్పండి.. అని భరోసా ఇచ్చారు.
    అన్నీ చర్చించి పరిష్కారం చూపిస్తారు. ఇది నమ్మకం జై జనసేన✊👍 #Megacult4Janasena

  • @183srikanth
    @183srikanth 3 วันที่ผ่านมา +16

    First time watching a minister standing and kept the staff seated

  • @Krishna-ul2cs
    @Krishna-ul2cs 3 วันที่ผ่านมา +7

    పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై జనసేన

  • @venkatasudheer713
    @venkatasudheer713 3 วันที่ผ่านมา +7

    చాలా లోతుగా ఆలోచిస్తున్నారు అన్నా సమస్య పరిష్కారాలు కూడా అంతే లోతుగా చేస్తారని ఆశిస్తున్నాం. జై JSP జై PSPK

  • @kavithamanohar5670
    @kavithamanohar5670 3 วันที่ผ่านมา +220

    మా దేవుడు దీక్ష లో ఉన్నారు...

    • @raajvulli3071
      @raajvulli3071 3 วันที่ผ่านมา +3

      cheppulatho dhiksha enti

    • @kpnaidu9999
      @kpnaidu9999 3 วันที่ผ่านมา +3

      చెప్పు లు ఉంటే ఏమి

    • @Ghani9
      @Ghani9 3 วันที่ผ่านมา +5

      ​@@raajvulli3071అది మాల కాదు అండి దీక్షా , నిష్ట గా పూజలు చేస్తూ మంత్రాన్ని జపిస్తూ ఆహార నియమాలు పాటిస్తూ చేసేది 11 రోజులు

    • @arunSiddharth1431
      @arunSiddharth1431 2 วันที่ผ่านมา +1

      miku teledemo ayyappa swami dikshalo cheppulu vesukoru. Kinda padukuntaru... varahi ammavaru dikshalo alanti niyamalu levu....

  • @neenaren
    @neenaren 3 วันที่ผ่านมา +13

    ఇంత మంచి మనసున్న నాయకుడు...ప్రజలకి ఏదో చేద్దాం అనే బలమైన ఆకాంక్ష ఉన్న నాయకుడు అధికారం లోకి రావడానికి పదేళ్ల కష్టం అవసరం అయ్యింది. ప్రజలు గమనించండి.. ఎంతటి దారిద్ర్యం లో కొట్టుకుపోతున్నారో..
    గుర్తు పెట్టుకోండి...పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు రాష్ట్రానికి ఉండటం...ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టం

    • @ramakrishnaramki5321
      @ramakrishnaramki5321 3 วันที่ผ่านมา +1

      చాలా బాగా చెప్పారు andi

  • @satishnakkaraju9014
    @satishnakkaraju9014 3 วันที่ผ่านมา +61

    Jai janasena ❤❤❤❤❤

  • @gorantlaramaraju4597
    @gorantlaramaraju4597 3 วันที่ผ่านมา +14

    Sir Homeguards కి సమాన పనికి సమాన వేతనం homeguards సమస్యలు మీ ప్రభుత్వంలో తీరేలా మీరు ప్రయత్నం చేస్తారని మిమ్ములను కోరి ప్రార్థిస్తున్నాను sir🙏

  • @dayanandng2546
    @dayanandng2546 3 วันที่ผ่านมา +18

    ది లీడర్ పవన్ కళ్యాణ్ గారు ప్రజల నాయకుడు💓

  • @shivakumarv863
    @shivakumarv863 3 วันที่ผ่านมา +40

    ⚖️🇮🇳🥛💪🙏 Jai JANASENA JAI VEERA MAHILA JAI Bharat ⚖️🇮🇳🥛💪🥛

  • @Veerabhadra0812
    @Veerabhadra0812 3 วันที่ผ่านมา +31

    I am very happy thank u god you made our janasena win and in power

  • @selvasuresh2049
    @selvasuresh2049 3 วันที่ผ่านมา +34

    Jai janasena taminadu super star fans

  • @tandursatyanarayana9024
    @tandursatyanarayana9024 3 วันที่ผ่านมา +26

    Janasena Janasenani Kalyan Garu Excellent leader

  • @janakijanu6402
    @janakijanu6402 3 วันที่ผ่านมา +19

    జై జై జనసేన జై తెలుగుదేశం జై కూటమి జై జై జనసేన పవన్ సుత హనుమాన్ కి జై

  • @boyaramudu9522
    @boyaramudu9522 3 วันที่ผ่านมา +30

    జై జై జై జై జై జనసేన

  • @chaitravemagiri8561
    @chaitravemagiri8561 3 วันที่ผ่านมา +19

    Waited yrs to see u in this position 😢...sooooo happy to witness this era❤❤❤❤

  • @huliputta8043
    @huliputta8043 3 วันที่ผ่านมา +18

    What a man .love you annaya ❤❤❤❤❤

  • @saimanikantalingam1109
    @saimanikantalingam1109 3 วันที่ผ่านมา +8

    Ni valle varahi amma vari meedha bhakthi vachindi naku 🙏❤😊 thank you pawankalyan bhavani 🙏

  • @alishaik4896
    @alishaik4896 3 วันที่ผ่านมา +7

    Devuda ,em opika Swami meeku ..super annaya ..me dedication and hardwork ki ..

  • @Swathivizagvlogs
    @Swathivizagvlogs 3 วันที่ผ่านมา +6

    మీరు ప్రజలకి చెప్పినది అన్ని పనులు చేస్తారు మాకు తెలుసు సార్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు

  • @srinivascreations8111
    @srinivascreations8111 2 วันที่ผ่านมา +1

    ❤ పంచాయతీరాజ్ వ్యవస్థ ట్రెండ్ సెట్ చేయండి పవర్ స్టార్ గారు🎉

  • @vijaykumar-pq2we
    @vijaykumar-pq2we 3 วันที่ผ่านมา +35

    Jai Janasena

  • @user-lq3nx5zb7c
    @user-lq3nx5zb7c 3 วันที่ผ่านมา +4

    Nenu pk garu use chestunna pen Hauser XO pen konnanu..na tarwatha shop lo ki clz students vachi vallu kuda purchase chesaru..Felt very happyy❤❤❤jai pk..💓🔥💯

  • @harisanthi243
    @harisanthi243 3 วันที่ผ่านมา +3

    మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా ఆనందం గా ఉంది అన్న ❤😊

  • @kishorechintada7778
    @kishorechintada7778 3 วันที่ผ่านมา +14

    Great Leader 👏 Pawan Kalyan sir

  • @ramkp01
    @ramkp01 3 วันที่ผ่านมา +3

    Hon'ble Chief Deputy Minister Pawan Kalyan Is Pure Inspiration & Courage To All🔥🤗

  • @KishoreKumar-1111
    @KishoreKumar-1111 3 วันที่ผ่านมา +7

    మీ ఆరోగ్యం జాగ్రత్త సార్

  • @Srinukittu-vb3ex
    @Srinukittu-vb3ex 3 วันที่ผ่านมา +20

    Jai pawan kalyan

  • @rrllnayak6282
    @rrllnayak6282 3 วันที่ผ่านมา +3

    అన్నయ్య మీరు అందరిని వాళ్ల ఇబ్బంది అర్థం చేసుకుంట్టరిని అనుకుంటున్న ❤️👌🙏జనసేన ✊

  • @bapuji1400
    @bapuji1400 3 วันที่ผ่านมา +17

    This is the way of ruling ❤❤❤

  • @kpnaidu9999
    @kpnaidu9999 3 วันที่ผ่านมา +4

    చాలా బాగుంది సంతోషంగా ఉంది సర్

  • @srisrinookambikaatozworks3547
    @srisrinookambikaatozworks3547 3 วันที่ผ่านมา +13

    Chala chala happy ga undi ❤️❤️👌jai janasena

  • @Ramana.Nalam-sl3lx
    @Ramana.Nalam-sl3lx 3 วันที่ผ่านมา +27

    Jai janasena ❤

  • @Youtube-Iphone
    @Youtube-Iphone 3 วันที่ผ่านมา +11

    Accountable politics…if PSPK and Janasena party continue to do this, YCP will vanish from AP… only 2 good parties JSP, TDP only.❤❤❤

  • @madhusudhanabm8887
    @madhusudhanabm8887 3 วันที่ผ่านมา +11

    Power star will be political star.. He will be role model for all politicians.

  • @kalyanid8942
    @kalyanid8942 3 วันที่ผ่านมา +3

    True leader🙏 He is a man with a vision. Samasyanalani poorthiga avagahana cheskonnaka tiskukune nirnayalu, aadhesalu, parishkaralu prajalaku thappakunda melu chestai.

  • @harishkuna6058
    @harishkuna6058 3 วันที่ผ่านมา +5

    Uff .. A True Leader .. Vinadaniki chala vinasompuga vundi sir about your detailed explaintaion .. aa ycheep govt lo okkadu kuda elanti meeting pettina roju ledhu .. yentha sepu boothulu tittadam bajana tappa ..

  • @sainathp991
    @sainathp991 3 วันที่ผ่านมา +4

    Chala happy ga undi ..Pawan Kalyan Garu speech vintunte

  • @RajaThogata
    @RajaThogata 3 วันที่ผ่านมา +10

    True leader

  • @jayaprakashdgm4181
    @jayaprakashdgm4181 3 วันที่ผ่านมา +2

    In india democracy is the first time listed actually words, i feel no world like this in this speech Mr. Pavan Kumar sir

  • @siriyalababu6552
    @siriyalababu6552 3 วันที่ผ่านมา +58

    ఎంత ఎత్తు కి ఎదిగిన .నిలో ఇంచు కూడా గర్వం కనిపించదు.
    ఎలా పుట్టవ్ అన్న ఇలా.
    పది మంది వెనక తిరిగితే హీరో అనుకునే రోజులు ఇన్ని
    కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్న
    ఇలా ఎలా అర్థం కాదు

  • @yenetalaramu
    @yenetalaramu 3 วันที่ผ่านมา +10

    Jai pawan kalyan jai janasena ❤❤❤❤❤ uuuuuuuu annaya

  • @BSK-PSPK
    @BSK-PSPK 3 วันที่ผ่านมา +11

    Corruption needs to reduce..jai jenasena

  • @malagarivarunreddy9573
    @malagarivarunreddy9573 วันที่ผ่านมา +1

    Wow Good To See PAWAN KALYAN Garu

  • @malagarivarunreddy9573
    @malagarivarunreddy9573 วันที่ผ่านมา +1

    Good To See PAWAN KALYAN Garu

  • @_SANTHOSH_REDDY_
    @_SANTHOSH_REDDY_ 3 วันที่ผ่านมา +9

    Jai #JANASENA Jai #PAWANKALYAN 🔥🔥

  • @YuvarajgoldYuvaraj
    @YuvarajgoldYuvaraj 3 วันที่ผ่านมา +5

    #Deputy cm Pawan Kalyan sir ✊✊🙏🙏

  • @srifd1
    @srifd1 3 วันที่ผ่านมา +6

    🎉🎉 🎉Jai Janasena team and Pawan Kalyan Anna 🎉

  • @Raja_Banavath
    @Raja_Banavath 3 วันที่ผ่านมา +13

    Jai janasena ✊✊
    Jai Pawan Kalyan ✊✊

  • @jayalalithavaddi2110
    @jayalalithavaddi2110 3 วันที่ผ่านมา +6

    Greattt to see pawan sir...🎉🎉❤

  • @user-lq3nx5zb7c
    @user-lq3nx5zb7c 3 วันที่ผ่านมา +2

    Pk garu trend follow avvaru,trend set chestharu.teesukunna sakhalu annitlo kuda development chestaru❤❤❤

  • @user-uq5rr8ox5t
    @user-uq5rr8ox5t 3 วันที่ผ่านมา +3

    ఆంధ్రప్రదేశ్ కి మంచి రోజులు వచ్చాయి జై జనసేన

  • @sivakumarreddy2871
    @sivakumarreddy2871 3 วันที่ผ่านมา +12

    Jai janasena 🙏🏼🙏🏼✊🏼✊🏼✊🏼

  • @ramanapegallapati9336
    @ramanapegallapati9336 3 วันที่ผ่านมา +4

    Super sir,AP deserves leader like u.

  • @sripathinaidupurmuneni3586
    @sripathinaidupurmuneni3586 3 วันที่ผ่านมา +16

    Jai janasena

  • @lavakumar1474
    @lavakumar1474 3 วันที่ผ่านมา +4

    Super sir మీరు

  • @NANI-ot4ox
    @NANI-ot4ox 3 วันที่ผ่านมา +2

    అన్నయ్య ఇక మాటలు లేవు అన్నయ్య మిమ్మలని...ఇలా చూస్తే ...🙏🙏🙏🌹🌹🌹

  • @tandursatyanarayana9024
    @tandursatyanarayana9024 2 วันที่ผ่านมา +1

    Great Leader Kalyan Garu

  • @trajasekhar3835
    @trajasekhar3835 3 วันที่ผ่านมา +3

    Great leader in Pawan Kalyan wonderful speech annayya maku me madam maku namakam gramallu abirudhi avuthai

  • @sjonegramgold8824
    @sjonegramgold8824 3 วันที่ผ่านมา +9

    జై జనసేన

  • @adithsrinivas4684
    @adithsrinivas4684 3 วันที่ผ่านมา +3

    Good ... please work together and aim for growth and development of AP.

  • @ramanjaneyulupaidikondala7400
    @ramanjaneyulupaidikondala7400 3 วันที่ผ่านมา +9

    Jai janasena 🎉❤

  • @user-sv8rv9zj1q
    @user-sv8rv9zj1q 3 วันที่ผ่านมา +6

    Village bagunte city baguntundi state baguntundi

  • @sridharkuriti6853
    @sridharkuriti6853 3 วันที่ผ่านมา +8

    Great leader... ఇంత చక్కగా ఎవరు ఉంటారు

  • @janasenadgpyouth
    @janasenadgpyouth 3 วันที่ผ่านมา +7

    Jai janasena party Anna ❤❤

  • @saivenkatesh182
    @saivenkatesh182 3 วันที่ผ่านมา +3

    Andhra becoming the one❤

  • @chukkavenkatsai9918
    @chukkavenkatsai9918 3 วันที่ผ่านมา +2

    చాలా గొప్ప వ్యక్తులు అన్నా నువ్వు

  • @baluyadavbaluyadav9000
    @baluyadavbaluyadav9000 3 วันที่ผ่านมา +4

    Pspk ❤

  • @medaramahesh1612
    @medaramahesh1612 3 วันที่ผ่านมา +4

    Sir outsourcing employees గురించి కూడా దృష్టి పెట్టండి మాకు చాలి చాలని జీతాలు but government schemes కూడా implement చేయండి మీరు outsourcing employees కూడా నాయం చేస్తారు అనే నమ్మకం ఉంది

  • @sriharshanaidu2562
    @sriharshanaidu2562 3 วันที่ผ่านมา +8

    👌

  • @goulikarpremlal5543
    @goulikarpremlal5543 3 วันที่ผ่านมา +5

    Deputy cm pk ain gair Jai janasena

  • @MANHOHARR
    @MANHOHARR 2 วันที่ผ่านมา

    Jai Pawan Kalyan sir your MANHOHARR

  • @darapullarao4557
    @darapullarao4557 3 วันที่ผ่านมา +1

    Excellent Leader 🎉

  • @Meedurgachannel
    @Meedurgachannel 2 วันที่ผ่านมา

    మాటలూలేవు అన్నయ్య మీరు చేసేమంచిపనులు చూడటమే❤
    చాల బాగా చెప్పారు

  • @sandeepvinn6265
    @sandeepvinn6265 3 วันที่ผ่านมา +2

    True Leader India Lo 100/100 Kotte Vade Janasanikudu

  • @veerukarri5967
    @veerukarri5967 3 วันที่ผ่านมา +4

    Jai pspk jai janasena

  • @venkateshchennakesavula1908
    @venkateshchennakesavula1908 3 วันที่ผ่านมา +4

    Anna Initiate Markapuram district process it will increase government revenue.

  • @ravikishoreME
    @ravikishoreME 3 วันที่ผ่านมา +2

    Very good speech

  • @alubilliganesh1234
    @alubilliganesh1234 3 วันที่ผ่านมา +2

    అన్నయ్య డిజిటల్ లైబ్రరీ పోస్టులు భర్తీ చేయండి plz అన్నయ్య

  • @santhosammerugu
    @santhosammerugu 2 วันที่ผ่านมา

    Thankyou so much sir Pawan Kalayan sir❤

  • @ajaysudhakar2468
    @ajaysudhakar2468 3 วันที่ผ่านมา +3

    గ్రామపంచాయతీ వ్యవస్థ బలోపేతం అయితే రాష్ట్రం కూడా బలోపేతం అవుతుంది. పంచాయతీరాజ్ వ్యవస్థను ఏకతాటిపై పెడతారని నమ్మకం కలిగించారు.🎉

  • @Jagadapi.Explorer
    @Jagadapi.Explorer 3 วันที่ผ่านมา

    Leader quality ❤❤

  • @chtatababu5927
    @chtatababu5927 3 วันที่ผ่านมา +1

    Super annaya Jai janasena ❤❤❤