Karungali Mala | కరుంగాలి మాల ధరిస్తే మహర్దశ | |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024
  • Karungali Mala: ఇటీవల కాలంలో కరుంగలి మాల చాలా ఫేమస్‌ అయింది. రుద్రాక్ష మాలతో పాటు కరుంగలి మాల కూడా చాలా ప్రాచుర్యం పొందింది. చాలా మంది సినీ సెలబ్రిటీలు ఈ మాలను ధరించడం వల్ల సాధారణ ప్రజలలో కూడా ఈ మాలపై ఆసక్తి పెరుగుతోంది. అందుకే ఈ మాలను ధరించేందుకు అందరూ ఇష్టపడుతున్నారు. దీంతో కరుంగలి (కరుంగళి కట్టై) మాల విక్రయాలు కూడా అమాంతం పెరిగినట్లు సర్వేలు చెప్తున్నాయి. ఆధ్యాత్మిక, జ్యోతిష్య, వైద్యపరమైన ప్రాముఖ్యత కారణంగా చాలా మంది దీనిని ఉపయోగిస్తున్నారని జ్యోతిష్యులు చెప్తున్నారు.
    ఈ కరుంగలి మాలను కారుకలి అనే చెట్టు నుంచి తయారు చేస్తారని పండితులు చెప్తున్నారు. ఈ కారుకలి చెట్టుకు విద్యుదయస్కాంత వికిరణాలు, కంపనాలను ఆకర్షించే శక్తి ఉంటుందని.. దీని కారణంగానే ఈ నల్లమచ్చ చెట్లను ఆలయ గోపురాలు, ఆలయ విగ్రహాలు, స్టాల్స్ , పురాతన గృహాలలో తలుపులు వంటి అనేక ప్రదేశాలలో ఉపయోగించేవారని పండితులు చెప్తున్నారు. జ్యోతిషశాస్త్రపరంగా చెప్పాలంటే నల్లరంగు అంగారక గ్రహానికి చెందినది. ఎబోనీ మార్స్ ప్రభావాలను ఈ మాల నియంత్రించగలదని.. నల్లమచ్చతో చేసిన ఉత్పత్తులను ఉపయోగించే వారికి అనారోగ్య ప్రభావాలు కూడా తగ్గుతాయని తంత్రశాస్త్రంలో ఉందంటున్నారు తాంత్రికులు.
    కరుంగలి చెట్టుకు ఎన్నో ఔషధ గుణాలున్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇది రేడియేషన్‌ను గ్రహించి నిల్వచేసే గుణం కలిగి ఉంటుంది. ఈ చెట్టు వేరు, బెరడును ఔషధంగా ఉపయోగిస్తారు. మధుమేహం, పెద్దప్రేగు రుగ్మతలు, రక్తహీనత వల్ల వచ్చే వ్యాధులు కూడా నయమవుతాయి.
    ఈ చెట్టు వేరును తీసుకుని నీళ్లతో బాగా శుభ్రం చేసి మంచి నీళ్లలో నానబెట్టి ఆ నీటిని కషాయంగా చేసి తాగితే కడుపులో పుండ్లు తొలగి పోతాయి. ఇది పొట్టలో ఉన్న అనవసర కొవ్వును కరిగిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ చక్కెర స్థాయిలను తగ్గించుకోవడానికి ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు తీసుకోవచ్చని సూచిస్తున్నారు.
    కరుంగలి రక్తంలో ఐరన్‌ కంటెంట్‌ని పెంచుతుంది. పిత్తాన్ని తగ్గిస్తుంది. అధిక రక్త ప్రసరణ ఉన్న మహిళలకు ఇది చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని నిఫుణులు సూచిస్తున్నారు. అలాగే మహిళల్లో వైట్ డిశ్చార్జ్ సమస్యను సరిచేస్తుంది. కరుంగలి మాలను ధరిస్తే శరీరంలోని నరాల సమస్యను కూడా పరిష్కరిస్తుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు.
    కరుంగలి మాలను ఎవరు ధరించవచ్చు? ఏ రోజు ధరించాలి?
    కరుంగలి మాలను ఏదైనా మంచి రోజున మంచి సమయంలో ధరించవచ్చు. అయితే ఏదైనా మంగళవారం నాడు మురుగన్‌ ఆలయంలో కానీ, వారాహి మాత ఆలయంలో కానీ పూజ చేయించిన తర్వాత ధరిస్తే మంచిదని పండితులు సూచిస్తున్నారు. అదేవిధంగా, కుల, మతాలకు అతీతంగా ఎవరైనా దీనిని ధరించవచ్చు. కానీ రాత్రి నిద్రపోయే ముందు ఈ హారాన్ని తీసి ఇంట్లో దేవుడు దగ్గర పెట్టుకుని.. ఉదయం స్నానం చేసిన తర్వాత మళ్లీ ఈ మాలను ధరించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
    జ్యోతిషశాస్త్ర రీత్యా, కరుంగలి మాల అంగారక గ్రహానికి చెందినది. అంగారక గ్రహ ప్రభావాలను నియంత్రించే శక్తి ఈ మాలకు ఉందని, అలాగే ఈ హారం ధరించిన వ్యక్తి వారి జాతకంలో అంగారక గ్రహం చెడు ప్రభావాన్ని తగ్గిస్తుందంటున్నారు జ్యోతిష్య నిపుణులు. అలాగే విద్యార్థులు తమ జ్ఞాపకశక్తి , మేధో శక్తులను మెరుగుపరచడానికి , విద్యలో రాణించడానికి ఈ మాల ఉత్పత్తులను ఉపయోగించవచ్చని.. వ్యాపారాభివృద్ది కోసం ఉద్యోగార్ధులు, జాబ్ హోల్డర్లు మంచి ఉద్యోగం లేదా కేరీర్‌లో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఈ మాల ధరించవచ్చిన సూచిస్తున్నారు.
    ఇప్పుడు మార్కెట్లో లేదా ఆన్‌లైన్‌‌లో దొరికే మాలలన్నీ డూప్లికేట్‌ ఉండొచ్చని.. వాటి వల్ల మంచి జరగడం కన్నా చెడు జరిగే అవకాశాలు ఎక్కువని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒరిజినల్ మాలను తమిళనాడులోని పాతాశ శంభు మురుగన్‌ ఆలయం దగ్గర తీసుకోవడమే మంచిదని సూచిస్తున్నారు #karungalimalai #karungalimalatelugu

ความคิดเห็น • 81