సోమవారం కలెక్టరేట్లోని సమావేశ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • యాంకర్‌ - ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించే అర్జీలకు అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్‌ శివ శంకర్‌ లోతేటి అధికారులను ఆదేశించారు.
    వాయిస్‌ - సోమవారం కలెక్టరేట్లోని సమావేశ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ శివ శంకర్‌ లోతేటి తోపాటు జాయింట్‌ కలెక్టర్‌ గణేష్‌ కుమార్, డీఆర్వో గంగాధర్‌ గౌడ్‌లు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ శివ శంకర్‌ లోతేటి మాట్లాడుతూ అర్జీలకు అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అర్జీదారుడు సంతృప్తిచెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా నాణ్యమైన పరిష్కారం చూపాలని సూచించారు. అనంతరం కలెక్టర్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించి పరిష్కార నిమిత్తం సంబంధిత అధికారులకు సిఫార్సు చేశారు. అంతకుముందు జిల్లా కలెక్టర్‌ శివ శంకర్‌ కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల రిజిస్ట్రేషన్‌ ను పరిశీలించి, ఎలా చేసున్నారని, అక్కడి సిబ్బంది తో మాట్లాడి వివరాలు తెలుసు కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ความคิดเห็น •