ayyo neneka annitikantey deelu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ต.ค. 2024

ความคิดเห็น • 9

  • @palakodetyvenkataramasharm2194
    @palakodetyvenkataramasharm2194 2 ปีที่แล้ว +1

    అద్భుతం

  • @vijayabharathialluri1023
    @vijayabharathialluri1023 ปีที่แล้ว +2

    Very good song Govinda Govinda Govinda🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tejaswini5789
    @tejaswini5789 3 ปีที่แล้ว +2

    🙏🌟

    • @yvgannamayyaaksharavedam6942
      @yvgannamayyaaksharavedam6942  3 ปีที่แล้ว +1

      Thank you very much for the like ...pl share and get subscribed with intrstd frnds and support the channel pl

  • @vijayalaxmimane1497
    @vijayalaxmimane1497 3 ปีที่แล้ว +1

    Govinda Govinda👣👣🌹🌹 🙏🙏

    • @yvgannamayyaaksharavedam6942
      @yvgannamayyaaksharavedam6942  3 ปีที่แล้ว

      Thank you Very Much For The Like . pl do subscribe and share to intrstd friends and support the channel for watching intresting annamacharya keertanas weekly episodes .

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam6942  3 ปีที่แล้ว +2

    *అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 71*
    ( *అయ్యో నేనే కా అన్నిటికంటెఁ దీలు ...*
    *గయ్యాళినై వృధా గర్వింతుఁ గాని ...*)
    🙏 *ఓం నమో వేంకటేశాయ*🙏
    *అందరికీ శుభ శనివారము*
    ✍️ *--- మీ వేణుగోపాల్*
    *అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 71 కి శుభ స్వాగతం*
    ✍️ *..మీ వేణుగోపాల్.*
    అ *తి* పాపకర్ములైనను
    స *త* తము నారాయణాఖ్య శబ్దము మదిలో
    వి *త* తంబుగ బఠియించిన
    చ *తు* రుల గొనియాడ కమలసంభవు వశమే ?
    ✍️ *పోతన భాగవతం*
    *భావం ః--*
    🌹అతి పాపకర్ములైననూ, యెల్లప్పుడూ నారాయణ నామ శబ్దమును విరివిగా , పఠించిన ,సద్గతిని పొందెదరు .🙏
    🌹ఇట్టి బుధ్ధి కుశలత కలిగిన వారిని కొనియాడుటకు బ్రహ్మదేవునికి కూడా అలవి కాదు . 🙏
    అని పోతన గారు భాగవతములో వర్ణించినట్టుగా,
    అన్నమాచార్యుల వారు కూడా , పాపకర్మలు చేసి అధముడను అని గ్రహింపక ,గర్వించువారు , నారాయణుని చేరుటకు యోగ్యులుగారు అని అంటున్నారు .🌹
    మరి ఇక ఏమిటి దిక్కు అంటే , మనము స్వామి ముందు అత్యల్పులమని ఎరుకతో ఉండి , గర్వముతో విర్రవీగక, స్వామి కరుణిస్తేనే , మనము ఆయనను పూజించుటకు యోగ్యత సాధిస్తామంటున్నారు అన్నమయ్య.🙏
    మరి ఆ చక్కటి సంకీర్తన అర్ధము తెలుసుకుని పాడుకుందామా ఈ వారము .🙏
    🌺 *అయ్యో !!* పరమాత్ముడా , అత్యల్పమైనది , అధమమైనది , అన్నిటికంటే దీనమైనది నా జన్మ అని భావించక , నిన్ను తలచితేనే అది సార్ధకమౌను అని తలపున లేక , వృధా గా ఈ జీవితమంతా గర్వముతో , అహంభావముతో గడిపేస్తున్నాను కదా !🙏
    🌺నేను ఏదో తడిపి ఉతికి శుభ్రముగా వేసుకున్న బట్టలు చూసుకుని పవిత్రముగా ఉన్నానకుంటున్నాను. కాని ఒక సారి వేసుకున్నవి పట్టు పీతాంబరములైనా మరలా నీ పూజకు వేసుకొనుటకు యోగ్యము కాదే !🙏 ఇంకెక్కడిదీ అధముడి పవిత్రత ?🙏
    🌺వనములో అప్పుడే వికసించిన కుసుమాలు నీ పూజకు పనికి వస్తాయి గాని , నేను ఒక్కసారి కొప్పున అలంకరించుకున్నా అవి ఇక ముట్టుకోవడానికి కూడా పనికి రావు కదా .ఇంతటి అల్పుడనైన నేను ఇక గర్వించుట ఎందుకు ? 🙏
    🌺శుచిగా సాత్విక మనస్సుతో వండిన పలు రకాల నైవేద్య భోజ్యములు , నీకు సమర్పించక ముందు ,
    నా చిన్న నాలుకను అంటితే , నీ మహా నివేదనకే పనికి రాకుండా అయిపోతున్నాయి కదా .
    ఇందులోనే తెలుసుకోవాలి కదా నీ మహోన్నతము అంటే ఏమిటో. 🙏
    🌺నీ ఆరాధనకై పక్కన పెట్టుకున్న , పరిమళ పుష్ప గంధాలు, నా నాసిక వాసన పీల్చనంతవరకే కదా యోగ్యమైనవి .నేను ఆస్వాదిస్తే అవి పనికిరానివే కదా ఇక.🙏
    🌺ఆకాశము నుండీ జాలువారిన పవిత్ర గంగా జలము అయినా సరే , నా అపవిత్రపు గోళ్లు తగిలితే , ఇక అవి నీ వినియోగమునకు పనికిరానిదైపోయెను కదా .🙏
    🌺నా ఇంద్రియ స్పర్శ తోనే అన్నీ అపవిత్రమౌతుంటే ,
    ఇక నేను ఎంత అధముడనో నీ ముందర , తెలుసుకోవాలి కదా.🙏
    🌺నీ కరుణా కటాక్ష వీక్షణము లేకపోతే , నేను అంటరాని వాడినే కదా.🙏
    🌺కావున *శ్రీ వేంకటేశ్వరా* నీవే నన్ను సదా రక్షించి అక్కున చేర్చుకుని , నీ కైంకర్యమునకు నన్ను యోగ్యుడను చెయ్యి తండ్రీ.🙏
    *ఓం శ్రీ ఆలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః*🙏🙏
    తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏🙏
    ( *అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 71* )
    ✍️ *-- మీ వేణుగోపాల్*
    🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺🍃
    🌹 *సంకీర్తన* 🌹👇👇
    అయ్యో నేనే కా అన్నిటికంటెఁ దీలు
    గయ్యాళినై వ్రిధా గర్వింతుఁ గాని
    ॥పల్లవి॥
    తడిపివుదికినట్టి ధౌతవస్త్రములు నా-
    యొడలు మోఁచినమీఁద యోగ్యము గావు
    వుడివోక వనములో వొప్పైనవిరులు నే-
    ముడిచి వేసినంతనే ముట్టరాదాయను
    ॥అయ్యో॥
    వెక్కసపు రచనల వేవేలు రుచులు నా
    వొక్కనాలుకంటితేనే యోగ్యముగావు
    పక్కన దేవార్హపుఁ బరిమళ గంధములు నా- ముక్కుసోఁకినంతలోన ముట్టరాదాయను
    ॥అయ్యో॥
    గగనాననుండి వచ్చేగంగాజలములైన
    వొగి నాగోరంటితేనే యోగ్యము గావు
    నగు శ్రీవేంకటపతి నన్నే రక్షించినదాఁక
    మొగడై యెరుక తుదిముట్టరాదాయను
    IIఅయ్యో॥

  • @yvgannamayyaaksharavedam6942
    @yvgannamayyaaksharavedam6942  3 ปีที่แล้ว +1

    *ANNAMAYYA AKSHARA VEDAM EPISODE -- 71*
    *AYYO NEENEGA ANNITIKANTEY DEELU*
    🌺 *Alas !!* Though Iam The Most Weary Being
    Than All in This World,
    Iam Behaving Insolently Wasting My Life In Pride And Ego .🌺🙏
    🌺No Matter How Freshly Laundered Pure White Clothes They Are, Once I wear Them On My Body They Become Unfit
    For The Divine Prayers Again .🌺🙏
    🌺The Deserving
    Garden Fresh Blossomming Flowers ,
    Become Unfit And Untouchable For The Divine If I Adorn Them once .🌺🙏
    🌺Though Excessively Made Sumptuous Prasadam
    Before offering To the Lord ,
    If My Tongue Tastes Even A little Bit Of It,
    The Whole Meal Offering To The lord Becomes Undeserved.🌺🙏
    🌺The Fragrant Flowers And Sandal Pastes Kept Beside The Lord's Worship Place,
    Once My Nose Smells Their Fragrance They Become Untouchable For Offering To The lord.🌺🙏
    🌺Even The Heavenly Purified Ganga Water From the Sky,
    If It is Touched By My Impure Nails ,
    It Turns Impure For The Lords Abhishekam .🌺🙏
    🌺Unless *Sri Lord Venkateswara* With His Smile
    Come To Our Rescue ,
    And Unless We Believe Firmly That *He Is Only Our Lord*
    We Are Untouchables For His holy Worship .🌺🙏
    *Om Namo Venkatesaya*🙏
    ✍️ *--VENUGOPAL*