శ్రీ కాళహస్తీశ్వర మహత్యం || Kalahasthiswara Mahatyam || తిన్నడు భక్త కన్నప్ప గా మారిన వైనం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
  • శ్రీ కాళహస్తీశ్వర మహత్యం ద్యాపరయుగములో అర్జనుడే కలియుగములో తిన్నడిగా అవతరించాడు. ఆ తిన్నడే కాలక్రమేణ భక్తకన్నప్పగా మారాడు. అర్జనుడు ఆ జన్నలో శివసాయుజ్యము పొందలేక పోవడముతో మరో జన్మ ఎత్తవలసివచ్చింది. తిన్నడు కాళహస్తి సమీపములోని ఒక కుగ్రామము. బోయ కుటుంబములో పుట్టినవాడు కాబట్టి వేటడడము కోసము ప్రతిరోజు అడవికి పోయేవాడు. తిన్నడు నాస్తికుడు దైవం అంటే గిట్టదు. పందెములో తను ప్రేమించిన మామ కూతురును దక్కించుకొని, మామ అమ్మకు మ్రొక్క మంటే, మీఅందరికి మ్రొక్కుతాను, కాని ఈ బొమ్మకు మ్రొక్కను, అని చెప్పి, గూడెము వదలి, కాళహస్తి దేవాలయ, సమీప అడవిలో ఒక కుటీరము ఏర్పరచు కొని చిలక గోరింగల వుంటారు. తిన్నని మార్చడము కోసము ఆలయ పెద్ద పూజారి దగ్గరకు పిలుచుక పోతుంది భార్య. ఆమెను చూసినదే తడువుగా, మోహావేశమునకు లోనైతాడు పెద్ద పూజారి, ఎలాగైనా లోబరుకోవలనే ఉద్దేశం తొ, మీ ఇంటికి నేనే వస్తాను. అని చెప్పి తిన్నడు లేని సమయములో పోయి, ఆమెను బలవంతం, చేయబోతాడు. అప్పుడే వచ్చిన తిన్నాడు, పూజారికి, బడిత పూజ చేస్తాడు. పెద్ద పూజారి తిన్నడిని ఎలాగైనా ఎదో ఒక నేరము మీద ఇరికించాలని మనసులో అనుకుంటాడు. శివరాత్రి రోజు వేటకుపోయిన తిన్నడికి ఏ జంతువు కనపడలేదు. తిన్నడిని మార్చాలనే ఉద్దేశంతొ శివుడు మారువేషముతొ వచ్చి, అతనిలో మార్పు వచ్చే తట్టు చేస్తాడు. మారిన తిన్నడు, ఆలయములోకి పోయి, అక్కడ శుభ్రం చేసి అదే ధ్యాసలో ఉంటాడు. ఇదే అదనుగా పెద్దపూజారి స్వామి దగ్గరి గొలుచు దొంగలించి, నేరము తిన్నడి మీద వేస్తాడు. పెద్దపూజారి కొడుకు చాల మంచివాడు, ఈ విషయము తెలుచుకొని, ఆ గ్రామపెద్దలను పిలుచుకొని వాళ్ళ నాయన ఉంపుడు గత్తె దగ్గరకు పోయి ఆ గొలుసు వారికి ఇప్పిస్తాడు. ఒకరోజు తిన్నడు ఆలయమునకు పోతే శివలింగము కన్ను నుండి రక్తం కారడము చూసి ఆకులతో వైద్యము చేస్తాడు. కన్ను నుండి రక్తం కారుతూనే వుండును. ఇక లాభము లేదనుకొని కన్నుకు, కన్నె వైద్యము అనుకోని తన కన్నును తీసి స్వామి కన్నుకు పెడుతాడు. కన్నీరు ఆగిపోతాయి. కొద్దిసేపటికి రెండో కన్నులో నీరు వస్తుంది. నా దగ్గర వైద్యం ఉంది అని రెండో కన్ను తీయబోతాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షముఅయి, అతని భక్తిని కొనియాడి, శివ సాయుజ్యము ప్రసాదిస్తాడు. అప్పటి నుండే తిన్నడు భక్త కన్నప్ప గా పిలువబడతాడు.

ความคิดเห็น • 69