గద్దర్ పొడుస్తున్న పొద్దు l Gaddar Songs l Galamethina Pata l Jupaka Shiva l Dekka Ashok l Galam Tv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • గద్దర్ పొడుస్తున్న పొద్దు l Gaddar Songs l Galamethina Pata l Jupaka Shiva l Dekka Ashok l Galam Tv
    గళమెత్తిన పాట
    Producer: Dr. TN Vidya Sagar
    Co-Producer: Dasari Bhaskar
    Writer: Dekka Ashok
    Singer's: Jupaka Shiva, Golusula Ranjith, Dekka Ashok
    Music: Wilson
    Dop Editting: Santosh Star
    పొడుస్తున్న పొద్దు మీద పోరు జెండా ఏడ్చిందో
    నడుస్తున్న కాలమేమో గద్దరన్ననడిగిందో
    కనకనమని మోగిన డప్పే దరువులేసు డాపిందో
    గలగల మని ఆడిన మువ్వలా సవ్వడాగిపోయిందో
    పొడుస్తున్న...
    పొడుస్తున్న...
    పొడుస్తున్న పొద్దు మీద పోరు జెండా ఏడ్చిందో
    నడుస్తున్న కాలమేమో గద్దరన్ననడిగిందో...
    సాయుధరైతంగా పోరులో ఆయుధమై తిరిగిన తీరు
    రగల్ జెండా చేతబట్టి రణం చేసినా వీరుడు
    నక్సలు బరిపోరులోన లక్షల వీరుల నందించి
    అణువణువు అలజడి రేపిన ప్రజాయుద్ధనౌకేడి
    పొడుస్తున్న...
    పొడుస్తున్న...
    పొడుస్తున్న పొద్దు మీద పోరు జెండా ఏడ్చిందో
    నడుస్తున్న కాలమేమో గద్దరన్ననడిగిందో...
    ఎర్రటి ఆ నెత్తుటి మరకల కత్తుల వంతెన దాటిండు
    విప్లవాల వీరుల జెండాను ఎదల నిండ నింపుకున్నడు
    బంధాలే వదిలేసి ఉద్యమాలకుపిరి పోసి
    బీద సాధ పేదల పోరుకు ప్రపంచానికే వేదికైనడు
    పొడుస్తున్న...
    పొడుస్తున్న...
    పొడుస్తున్న పొద్దు మీద పోరు జెండా ఏడ్చిందో
    నడుస్తున్న కాలమేమో గద్దరన్ననడిగిందో...
    అమరుల త్యాగాలను తలసి వెన్నుల తూటాలను మోసి
    వెనకబడిన బతుకుల చూసి ఎర్రజెండా నీడైనాడు
    ప్రభుత్వాల మెడలను వంచి ప్రజలకెన్నో భూములు పంచి
    వీరుడై వెలుగులు పంచిన సూర్యుడాడ పోయిండని
    పొడుస్తున్న...
    పొడుస్తున్న...
    పొడుస్తున్న పొద్దు మీద పోరు జెండా ఏడ్చిందో
    నడుస్తున్న కాలమేమో గద్దరన్ననడిగిందో
    పొడుస్తున్న పొద్దు మీద పోరు జెండా ఏడ్చిందో
    నడుస్తున్న కాలమేమో గద్దరన్ననడిగిందో...
    Special Song On Gaddar Anna | Podusthunna Poddumeeda l Gaddar New Songs
    #gaddarsongs పోరుజెండాఏడ్చిందో గళమెత్తినపాట l #jupakashiva l #galamtv #dekkaashok పొడుస్తున్నపొద్దుమీద #gaddarsong
    #golusularanjith #singergolusularanjith #dekkaashok #dekkaashoksongs
    #galamtvchannel #galamtvsongs #dasaribhaskar #galamtv #galammusic #galamtvfolksongs #galamtvnewfolksongs

ความคิดเห็น • 47