APGEA condemns the comments made on Govt Employees in ABN Channel which went viral in social media
ฝัง
- เผยแพร่เมื่อ 18 พ.ย. 2024
- ఏపీ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘ (APNGO) నాయకులు ఒక పక్క అధికారపార్టీకి అనుభందంగా పనిచేస్తున్నరనే అభిప్రాయం ఉందని ఆ ముసుగులో తొలగించుకొని ఉద్యోగుల సమస్యల పరిష్కారం సాధనకై వెళ్దామని చెప్తూ ఇంకోపక్క ఈరోజు ఒక రాజకీయ పార్టీకి లబ్ధి చేకూరే విధంగా ప్రకటనలను పత్రికలలో ఇవ్వటంపై APGEA అధ్యక్షులు శ్రీ కె.ఆర్.సూర్యనారాయణ ఖండనను తెలియచేసారు. పార్టీలకు అతీతంగా పని చెయ్యవలసిన ఉద్యోగ సంఘాలు కొన్ని రాజకీయ పార్టీలకు వత్తాసు పలకటంపై శ్రీ కె.ఆర్.సూర్యనారాయణ ఆవేదన వ్యక్తంచేశారు. అదేవిధంగా ఒక పార్టీ నాయకుడు ఉద్యోగులకు CPS విధానాన్ని రద్దు చేస్తామని హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘ నాయకులను సస్పెండ్ చేయడం, అధికారపార్టీకి వత్తాసు పలికిన వారిని ఏమీ చేయకపోవడం అనేది ప్రభుత్వ అధికారుల పక్షపాత ధోరణికి నిదర్శనమని తెలిపారు.
ఉద్యోగులపై ఒక మీడియా వారు, సి. యమ్ తో ఇంటర్వ్యూలో అసభ్య పదజాలంతో మాట్లాడినట్లుగా దానిని సి. యమ్ గారు సపోర్ట్ చేస్తూ మాట్లాడినట్లుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వీడియో మరియు దానిపై ఒక పత్రికలో వచ్చిన కథనాలు ఉద్యోగులను కించపరిచే విధంగా ఉన్నాయని తెలిపారు ఉద్యోగులకు అయ్యే ఖర్చులోఅసెంబ్లీ మరియు ఎమ్మెల్యే జీతాలు, మినిస్టర్ పర్యటన ఖర్చులు లగ్జరీ మరియు వైద్య ఖర్చులు (ఒక మంత్రి గారికి ఒక పన్ను వైద్య ఖర్చు మూడు లక్షలు ఇలాంటివి), ప్రభుత్వ ఖర్చుతో మొదటి, చివరి పేజీల ఫుల్ పేజ్ యాడ్ లాంటి ఖర్చులుంటాయనే స్ప్రురణ వీరికి లేదంటే "గురువింద గింజ" సామెత గుర్తుకు వస్తుంది. ఇటువంటి ప్రకటనలు ఉద్యోగులపై వారికున్న నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తుంది. కావున రాజకీయ నాయకులు, మీడియా వారు ఇటువంటి ప్రకటనలు మాని ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కోరుకుంటుంది.