IFB Washing Machine continues taking water, Program not running and water sensor switch not working

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
  • 04-01-2023 Experience: Water continuse గా తీసుకొంటుంది, ప్రోగ్రామ్ (Timer) run అవ్వడం లేదు Timer ని move చేసి spinning మీదకి తీసుకెళ్తే drum స్పీడ్ గా run అవుతుంది అంటే drum run అవుతుంటే PCB Cricuit ఏమీ ప్రాబ్లెమ్ లేదు అని అర్దం (IFB వాళ్ళు చెప్పారు) నేను Timer run అవడం లేదు కాబట్టి Timer ప్రాబ్లెమ్ ఏమో అనుకున్నాను...
    IFB వాళ్ళు ఈ మోడల్ spares ఇప్పుడు కంపెనీ ఇవ్వడం లేదు మీరు exchange చేసుకోండి అని ఉచిత సలహాలు ఇవ్వడం స్టార్ట్ చేశారు వీళ్ళకి ఎక్సేంజ్ చేసి అమ్మడంలో వున్న శ్రద్ధ దీన్ని రిపేర్ చేద్దాం అని అస్సలు లేదు, repairing లో కంటే వీళ్ళకి అమ్మడం లోనే ఎక్కువ లాభం వొచ్చెట్లుగా వుంది...
    IFB technician Timer, Over Flow Sensor పోయింది ఇవి ఇప్పుడు కంపెనీ వాళ్ళు తయారుచేయడం లేదు అని చెప్పి వెళ్ళిపోయారు.... నేను ఈ Timer, Over Flow Sensor ని secunderabad, Ranigunj లో తీసుకొచ్చి రెండింటినీ మార్చాను కానీ No use ప్రాబ్లెమ్ సాల్వ్ అవ్వలేదు, ఎందుకంటే అందులో Cloths, Water వుండడం వల్ల drum ఆల్రెడీ క్రిందికి అవడంతో Vacume జెనరేట్ అవ్వక (గాలి) సెన్సార్ స్విచ్ ని press చేయలేక పోయింది దీనితో వాటర్ cut-off అవకుండా వాటర్ కంటిన్యూస్ గా తీసుకొంటూ వాటర్ ని బయటకు పంపిస్తూ వుంది.... దీనివలన అర్దం చేసుకోవాల్సింది కొత్త Sensor switch మార్చినప్పుడు drum లో వుండే వాటర్ మొత్తం drain అయ్యాక మాత్రమే ప్రోగ్రామ్ first నుండి strat చేయాలి.
    మా సంఘటనలో వాటర్ ప్రెషర్ కొరకు మోటార్ వరకు వున్న wire ఎలుకలు కొట్టడం వల్ల Phase, Nutal షార్ట్ అయి prasure sensor switch డ్యామేజ్ అయి రెండు స్విచ్ ల్లో ఒకే స్విచ్ పనిచేయడం వల్ల వాటర్ cut-off అవ్వకపోవడం ప్రోగ్రామ్ run కాకపోవడం జరిగింది...
    అలాగే పాత స్విచ్ నీ, కొత్త స్విచ్ నీ గట్టిగా వూది (వీడియోలో చూపించినట్లుగా) సెన్సార్ లో ఉండే రెండు స్విచు లూ పని చేస్తున్నాయా లేదా ఒకే స్విచ్ పనిచేస్తుందా అని సరిగా గమనించాలి.... నేను కొనుకొచ్చిన కొత్త Timer తీసి పాతది వేసాక కూడా michine బాగానే పనిచేస్తుంది, ప్రోగ్రామ్ run అవక పోవడం, వాటర్ cut-off అవక పోవడం అనేది only సెన్సార్ ప్రాబ్లమ్ మాత్రమే, Timer ది కాదు
    Note : Some times Air flow pipe is fill with mud, Rust and Dust Clean it once if sensor is good

ความคิดเห็น • 10