30 ఎకరాల్లో బొప్పాయి సాగు || ఎకరాకు 3 లక్షల ఆదాయం || ఆదర్శ బొప్పాయి రైతు || Karshaka Mitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ธ.ค. 2024
  • Successful Farmer in Papaya Cultivation || Papaya Farming in 30 Acres || 35 Ton's yield / acre
    బొప్పాయి సాగులో ఆదర్శంగా నిలుస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా రైతు
    పండ్లతోటల సాగులో బొప్పాయికి పెరుగుతున్న మార్కెట్ ప్రాధాన్యత దృష్ట్యా మెట్ట వ్యవసాయంలో ఈ పంట సాగు వేగంగా విస్తరిస్తోంది. ఎకరాకు 900 మొక్కలు నాటుతున్న రైతులు 7 వ నెల నుండి ఫలసాయం తీస్తున్నారు. తైవాన్ రెడ్ లేడీ - 786 అధిక విస్తీర్ణంలో సాగులో వుంది. ఈ రకంలో ఒక్కో కాయ బరువు 2 నుండి 5 కిలోలు బరువు తూగటం ఎకరాకు 25 నుండి 50 టన్నుల దిగుబడినివ్వటం విశేషం. మార్కెట్ ఒడిదుడుకులు వున్నా ఎకరాకు 50 వేల నుండి 3 లక్షల నికరలాభం సాధించే అవకాశం ఈ పంట సాగు కల్పిస్తోంది. గతంలో 2 సంవత్సరాల వరకు ఈ పంట సాగు కొనసాగేది. అయితే వైరస్ తెగుళ్ల బెడద ఎక్కువ అవటంతో రైతులు 12 నుండి 16 నెలల వరకు మాత్రమే పంటను కొనసాగిస్తున్నారు. గత 15 సంవత్సరాలుగా బొప్పాయిని సాగుచేస్తూ... ఎకంగా 30 ఎకరాలకు తోటను విస్తరించిన పశ్చిమ గోదావరి జిల్లా, లింగపాలెం మండలం, లింగపాలెం గ్రామ రైతు శాఖమూడి శ్రీనివాస రావు ( 9618808577 ) అనుభవాలతో బొప్పాయి సాగు వివరాలను మీకు అందిస్తోంది కర్షక మిత్ర. #KARSHAKAMITRA #papayafarming #papayacultivation #KARSHAKAMITRAPAPAYAFARMING
    Facebook : mtouch.faceboo...

ความคิดเห็น • 57