సంక్షోభంలోనూ సంక్షేమ ఫలాలు అందిస్తున్న గొప్ప పరిపాలనా దక్షుడు చంద్రబాబు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ก.ย. 2024
  • రాష్ట్రాన్ని వంద రోజుల్లో పాలన పెట్టాం
    -- మాజీ ఎమ్మెల్యే ఇంచార్జ్ శ్రీ మీనాక్షి నాయుడు అన్న గారి. ఆధ్వర్యంలో టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు అన్నగారి, ఆదోని మాజీ శాసనసభ్యులు ప్రకాష్ జయం, స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసులు పాల్గొనడం జరిగింది.
    ఆదోని మండలం, నాగలాపురం, మంత్రికి గ్రామంలో పాల్గొన్నారు.
    కూటమి ప్రభుత్వం వంద రోజుల్లోనే ఎంతో అభివృద్ధి చేసి చూపించిందని ఎమ్మెల్యే శ్రీ మీనాక్షి నాయుడు అన్నారు. మంగళవారం మండలం నాగలాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించారు. గ్రామస్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, ‘వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. రూ.12లక్షల కోట్ల అప్పులే మిగిల్చారన్నారు. ప్రస్తుతం వాటికి ఏటాకు రూ.20వేల కోట్ల వరకూ వడ్డీ చెల్లించాల్సి ఉంది. ఆర్థికవ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే విపత్తులు తోడయ్యాయని, అవాంతరాలను అధిగమిస్తూ.. అభివృద్ధి దిశగా అడుగులేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి కొంతమేర ఊరట లభిస్తోంది. ధాన్యం కొనుగోలు బిల్లు రూ.1600కోట్లు పెండింగ్‌ ఉండగా.. ఇటీవల వాటిని విడుదల చేశామన్నారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేశామన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం పంచాయతీలకు రూ.2500కోట్లు నిధులు మంజూరు చేశాం. ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేపట్టి.. సాగునీరు అందించామని తెలిపారు. ‘వైసీపీ పాలనలో డ్వాక్రా సంఘాల పేరిట రూ.కోట్లు కొల్లగొట్టారు. ఇంటింటికీ తాగునీటి సరఫరాకు చర్యలు చేపడతాం. దీపావళికి ఉచిత గ్యాస్‌ సిలెండర్లు అందజేస్తాం. గృహ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి ఆదోని మండలంలోని రెండు కోట్లు గ్రాంటు రిలీజ్ అయింది దీన్ని కొంతమంది కాంట్రాక్టర్లు పని చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ జరగవని ఏ గ్రామాల్లో గ్రామ సర్పంచ్ గ్రామంలో ఉన్న నాయకులు మాత్రమే పనిచేయాలి అని మాజీ ఎమ్మెల్యే శ్రీ మీనాక్షి నాయుడు అన్న గారు భరోసా ఇచ్చారు.
    ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, గ్రామ నాయకులు కార్యకర్తలు ప్రజలు, సచివాలయ ఉద్యోగస్తులు పాల్గొనడం జరిగింది పాల్గొనడం జరిగింది.

ความคิดเห็น • 1