SRI PRASANNA TIRUPATHI GANGAMMA JATHARA KUPPAM 2023 - INVIATION AND PROGRAMS. జాతర కుప్పం 2023

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ก.ย. 2024
  • SRI PRASANNA TIRUPATHI GANGAMMA JATHARA KUPPAM 2023 - INVIATION AND PROGRAMS.
    శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర కుప్పం 2023 - విమానయానం మరియు కార్యక్రమాలు.
    స్వస్తి శ్రీ శోభాకృత్ నామ సంవత్సరం, వైశాఖ బహుళ చతుర్థి, చిత్రనెల 26 కి సరియగు, 9-5-2023 వ తేదీ, మంగళవారము ఉదయం, 10:30 నిమిషములకు అమ్మవారికి అభిషేకము. మధ్యాహ్నం 12 గంటలకు పైన, దేవాలయ ఆవరణములో అంబిలి పోయుట, రాత్రి 12 గంటలకు పైన జాతర చాటింపుతో, చిత్తూరు జిల్లా, కుప్పం మండలం, కుప్పంలో నెలకొని ఉండు, శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర కార్యక్రమం ప్రారంభం కానుంది. కావున భక్తదులెల్లరు వారి శక్తిఅనుసారం ధన, ధాన్య, వస్తు, వాక్ సహాయములు చేసి, విరివిగా విరాళము లోసంగి, అమ్మవారి కైంకర్యములలో పాల్గొని, అమ్మవారి కృప కటాక్షములకు, పాత్రులు కావాలని ఆలయ చైర్మన్, మరియు కమిటీ తెలియజేశారు.
    జాతర కార్యక్రమంలో భాగంగా, 17-5-2023 బుధవారం రాత్రి 7 గంటలకు, శ్రీ వినాయక స్వామి వారి ఉత్సవ ఊరేగింపు జరుగును. 18-5-2023 గురువారం రాత్రి 7 గంటలకు, శ్రీ ప్రసన్న ముత్తుమారెమ్మ అమ్మవారి రెండు ఉత్సవములు ఊరేగింపు జరపబడును. 19-5-2023 శుక్రవారం పగలు ఒంటి గంటకు అన్నదాన కార్యక్రమం. అదే రోజు రాత్రి 7 గంటలకు, శ్రీ ప్రసన్న ముత్తుమారెమ్మ అమ్మవారి శేష వాహనం, రెండు ఉత్సవములు ఊరేగింపు జరపబడును.
    20-05-2023 శనివారం రాత్రి 7 గంటలకు, శ్రీ ప్రసన్న ముత్తుమారెమ్మ అమ్మవారి సింహ వాహనం, రెండు ఉత్సవములు ఊరేగింపు జరుగును. 21-5-2023 ఆదివారం రాత్రి 7 గంటలకు, శ్రీ ప్రసన్న ముత్తుమారెమ్మ అమ్మవారి అశ్వవాహనం రెండు ఉత్సవములు ఊరేగింపు జరపబడును. 22-5-2023 సోమవారం రాత్రి 7 గంటలకు, శ్రీ ప్రసన్న ముత్తుమారెమ్మ అమ్మవారి తెర తొలగించి, పూజారాదన మరియు అగ్నిగుండ ప్రవేశము, పుష్ప పల్లకి, గెరిగ, నయండి, బాన వేడుకలు, అత్యంత వైభవంగా జరుపబడును. 23-5-2023 మంగళవారం ఉదయం ఏడు గంటల 15 నిమిషములకు, శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ శిరసుకు తెర తొలగించి, శిరస్సు ఊరేగింపు, పూజా ఆరాధన, గెరిగే, బాన వేడుకలు, పంబ వాద్యములు, గారడి బొమ్మలాట, సేవా గాండ్లట, పలక డాన్సులతో, ఊరేగింపు జరపబడును.
    24-5-2023 వ తేదీ ఉదయం 8 గంటలకు, కుప్పం వేద పండితులు, పూజారుల బృందం, మరియు ఆలయ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో, శ్రీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి సహోదరి అయిన, శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ అమ్మవారి జాతర మహోత్సవ సందర్భముగా, అమ్మవారికి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానము వారిచే మెయిల్ చాట్ వస్త్రం సారే ను అమ్మవారికి అలంకరించబడును. మరియు శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర యొక్క కీలక ఘట్టం అయిన, విశ్వరూప దర్శనం 24-5-2023 బుధవారం ఉదయం ఏడు గంటల 15 నిమిషములకు, శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ అమ్మవారికి పూజారాదన, పొంగళ్ళు, దీపారాధనలతో, ఉదయం 9 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు, విశ్వరూప దర్శనము, అమ్మవారికి వజ్ర కిరీట అలంకరణ, రాత్రి 11 గంటల పైన అమ్మవారి జలవాసమగుట జరపబడును.
    25-5-2023 గురువారం ఉదయం 10 గంటలకు, జాతర హుండీల లెక్కింపు నిర్వహించబడును.
    ఆలయ చైర్మన్ మరియు కమిటీ వారిచే భక్తాదులందరికీ విన్నపం. అగ్ని గుండ ప్రవేశమునకు 14 సంవత్సరాల లోపు గల వారిని. అగ్నిగుండ ప్రవేశమునకు అనుమతించబడదు. మరేణి వివరముల కొరకు దాతలు మరియు బక్తధులు 93953 11109 మొబైల్ నెంబర్కు సంప్రదించగలరు.

ความคิดเห็น • 3