Govindhudey Koka Song | Dhanunjay & Sunitha Performance | Swarabhishekam | 14th July 2024 | ETV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ธ.ค. 2024

ความคิดเห็น • 3

  • @jalanderarsha6340
    @jalanderarsha6340 4 หลายเดือนก่อน

    Super singing sunitha madam and dhanunjay

  • @PavanKumar-ng4mo
    @PavanKumar-ng4mo 3 หลายเดือนก่อน +3

    గోపాల బాలకృష్ణ గోకులాష్టమీ
    ఆబాల గోపాల పుణ్యాల పున్నమి
    ముకుంద పదముల ముగ్గుల ఇల్లే బృందావని
    నంద నందనుడు నడచినచోటే నవ నందనవనీ..
    గోపికా ప్రియ కృష్ణహరే
    నమో కోమల హృదయ కృష్ణహరే
    వేవేల రూపాల వేదహరే
    నమో వేదాంగ దివ్యా కృష్ణ హరే ||2||
    ఆఆఆ.. ఆఆఆఆ....
    గోవిందుడే కోక చుట్టి గోపెమ్మ వేషం కట్టి
    ముంగోల చేత బట్టి వచ్చెనమ్మా ||2||
    నవ మోహన జీవన వరమిచ్చెనమ్మా
    ఇకపై ఇంకెపుడు నీ చేయివిడిచి వెళ్లనని
    చేతిలోన చెయ్యేసి ఒట్టేసెనమ్మా
    దేవకీవసుదేవ పుత్ర హరే
    నమో పద్మ పత్రనేత్ర కృష్ణహరే
    యదుకుల నందన కృష్ణహరే
    నమో యశోద నందన కృష్ణహరే
    ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు
    ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు వెన్నుడొచ్చేనమ్మా .
    ఎన్నెన్నో చుక్కల్లో నన్ను మెచ్చేనమ్మా
    వెన్న పాలు ఆరగించి విన్నపాలు మన్నించి||2||
    వెండివెన్నెల్లో ముద్దులిచ్చెనమ్మా
    కష్టాల కడలి పసిడి పడవాయెనమ్మా
    కళ్యాణ రాగ మురళి కళలు చిలికినమ్మా
    మా కాపురాన మంచి మలుపు తిప్పెనమ్మా
    వసుదైక కుటుంబమనే గీత చెప్పెనమ్మా
    గోవర్ధనోద్దార కృష్ణహరే
    నమో గోపాల భూపాల కృష్ణహరే
    గోవింద గోవింద కృష్ణహరే
    నమో గోపిక వల్లభ కృష్ణహరే
    తప్పటడుగు తాండవాలు చేసెనాడమ్మా
    తన అడుగుల ముగ్గులు చూసి మురిసి నాడమ్మా
    మన అడుగున అడుగేసి మనతోనే చిందేసి||2||
    మన తప్పటడుగులు సరి దిద్దినాడమ్మా
    కంసారి సంసారిని కలిసిమెరిసేనమ్మా
    కలకాల భాగ్యాలు కలిసోచ్చేనమ్మా
    హరిపాదం లేని చోటు మరుభూమేనమ్మా
    శ్రీ పాదం ఉన్నచోట సిరులు విరుయునమ్మా
    ఆపదోద్దారక కృష్ణహరే
    నమో ఆనంద వర్ధక కృష్ణహరే
    లీలా మానుష కృష్ణహరే
    నమో ప్రాణ విలాస కృష్ణహరే ||2||
    గోవింద గోవింద కృష్ణహరే
    నమో గోపిక వల్లభ కృష్ణహరే
    గోవర్ధనోద్దార కృష్ణహరే
    నమో గోపాల భూపాల కృష్ణహరే ||2||

  • @raghuvarma7285
    @raghuvarma7285 5 หลายเดือนก่อน +1

    Dhanunjay❤❤❤❤❤