*3వ భాగం* వ్యక్తి గతంగా, కర్ణుడు తాను చాలా పరాక్రమ వంతుడు అయినా సూత పుత్రుడనై పోయానే అనే ఆత్మ న్యూనతా భావాన్ని పెంచుకొని,దాని పై ఈర్ష్య,అసూయా ద్వేషాలను మూట కట్టుకుని , వాటిని నరనరానా జీర్ణించుకొని, తామసుడై, ఉచితానుచితాలు మరచి, దుర్యోధనుని మెప్పు కోసం, పాండవులపై, ప్రత్యేకించి అర్జునుని పై ద్వేషం పెంచుకొని, చేయని పాపం లేదు. పరశురాముని వద్ద, రాజపుత్రుడనని చెప్పి గురువును వంచించిన ఘోర పాపం, ద్రౌపదీ వస్త్రాపహరణ సందర్భంలో తాను మాట్లాడిన హీనమైన మాటలు, అభిమన్యుడిని చంపడంలో తాను చేసిన అత్యంత హేయమైన పని, కర్ణుడి ని ధీరోదాత్తుడిగా ఒక్క నాటికీ నిలుప జాలవు.ఈ క్రమంలోనే, ధీరుని కన్నా భీరువు గా, ఉదాత్తుని కన్నా కపటుడిగా ,ఉత్తముని కన్నా నీచునిగా,దుష్ట చతుష్టయం లో ఒకడు గా మిగిలి పోయాడు. కర్ణుడి చావుకు ఎన్ని కారణాలున్నా, అతడు చేసిన నీచపు పనులే ఆ లెక్కకు మించి ఉన్నాయి. దాన వీర శూర కర్ణుడు అన్నది తెలుగు వారిలో కొందరి ఊహాపోహల కల్పిత పాత్ర మాత్రమే కానీ,యదార్ధ భారత పాత్ర మాత్రం అది కాదు. ఇకపోతే, "కర్ణుడు లేని భారతమా!" అని అన్నారు కాబట్టి కర్ణుడు ఎంత గొప్ప వాడయితే, ఆ మాట అంటారు అని కొంత మంది వ్యాఖ్యానిస్తుంటారు. కానీ ,దాని అర్థం కర్ణుడు చాలా గొప్పవాడు అని కానే కాదు. తను అర్జునుడికి సమ ఉజ్జీ కాదని తెలిసి తెలిసి కూడా, తను ఒక్కడే అర్జుడుని జయించగలిగిన వీరుడినని దుర్యోధనుడిని, ఎప్పటికప్పుడు కేవలం మాటల ద్వారా నమ్మిస్తూ, యుద్ధం దాకా తెచ్చాడని, లేకపోతే ఒకప్పుడు కాకపోతే ఇంకొకప్పుడయినా అర్జునుడిని తాను జయించలేననే భావనతోనో, భయంతోనో, భీష్మాది కురు వృద్ధులు చెప్పిన మాటలు విని దుర్యోధనుడు సంధికి సిద్ధపడే వాడేమో అనే అర్థంలో కర్ణుడు లేని భారతమా అని అంటారు. కర్ణుడే కనుక లేకపోతే భారత యుద్ధం జరిగేది కాదు అని దాని అర్థం. భారతం చదువుతున్నప్పుడు నిజానికి కొన్ని కొన్ని సందర్భాల్లో , కర్ణుడు రాజుని మించిన రాజ భక్తిని ప్రదర్శిస్తూ, దుష్ట బుద్ధి లో దుర్యోధనుడినే మించి పోయాడు అని మనకు అనిపిస్తుంది,కనిపిస్తుంది. ఆ విధంగా ఒక సాధారణమైన వ్యక్తిత్వ శీలాలు కలిగిన వాడిగనే కర్ణుడు భారతం లో మనకు కనిపిస్తాడు తప్ప,మనం భుజాలకెత్తుకొని మోసినంత గొప్ప తనం కనపడదు..
ఇప్పటిదాకా సమానులే కానీ ఇక్కడ్నుంచి అర్జునుడు ఎన్నో తపస్సులు సాధనలు చేశాడు కర్ణుడు కంటే వయస్సులో చాలా చిన్నవాడు అయినప్పటికీ అప్పటికే బ్రహ్మ శిరోమణి బ్రహ్మాస్త్రం లాంటి దివ్య ఆస్త్రాలు ఉన్నాయి కర్ణుడు దగ్గర ఏమున్నాయి సూర్య ప్రసాదితమైన కవచకుండలాలు
*1వభాగం* ఇటీవలి రోజుల్లో కర్ణుడు అనుకున్నంత గొప్పవాడు కాదని కొందరంటే, ఎంతో మంది పెద్దలు మెచ్చి , హెచ్చించిన కర్ణుని గొప్పతనాన్ని కాదంటారా అని మరి కొందరు; ఈవిధంగా భారతం లోని కర్ణుని గొప్పతనం మీద ఖండన మండన వ్యాఖ్యానాలు బాగా వేడె క్కుతున్నాయి. ఈ సందర్భం లో కర్ణుడి గురించి మరో సారి గుర్తు చేసుకుందాం. కర్ణుడు దాన శీలి, వీరుడు . సందేహం లేదు. కానీ, అతడు దాన వీరత్వ, వీర శూరత్వాలకు ప్రతీకా? ఉన్నతుడా?? అన్న ప్రశ్నలకు మాత్రం అవునని చెప్పడం కుదరదు. *కర్ణుడు దాన వీరుడా లేక దాతా?* మహా దాత గా బ్రహ్మాండం గా వాసికెక్కిన పురాణ పురుషుడు కర్ణుడు. కానీ నిజానికి అంత కీర్తి వైభవానికి అర్హుడా అనే సందేహం కూడా అతడి జీవితాన్ని పరిశీలించిన ప్పుడు కలుగుతుంది. 1) అసలు మొదట చెప్పుకోవాల్సిందేమిటంటే , భారతం మొత్తం లో అతి పెద్ద దాన గ్రహీత కర్ణుడే. తన అర్హతానర్హతలు లెక్కచేయకుండా, దుర్యోధనుడు పాండవుల పట్ల ద్వేష భావంతో కర్ణుడికి ఏకంగా అంగరాజ్యాన్నే (దానంగా) ఇచ్చాడు. ఇది కర్ణుడు ఏ యుద్ధాలలోనో గెల్చుకున్నది కాదు. ఒక కుపిత, ఈర్ష్యాళువు వద్ద పుచ్చుకున్న నికృష్ట దానం. ఇలా ఎందుకు అనవచ్చు అంటే, దానం చేసే వాడు నిర్మల సత్వ మనస్కుడై, నిష్కామంగానో,పుణ్యార్థి గానో చేసిన దానం పవిత్రమైనది. దుర్యోధనుడు ఎప్పుడు, ఏ సందర్భంలో,ఎందుకు, ఈ దానం చేశాడో అందరికీ తెల్సిందే. అసలు ఈ దానం చేసే అర్హత కూడా అప్పటికి దుర్యోధనునికి లేదు. ఒక అనర్హుడు, కుపితుడై, తనది కాని దానిని దానం చేస్తే, ఆ నిక్రృష్ట దానానికి ఒడిపట్టి పుచ్చుకొని, తాను కూడా ఒక రాజే అని చెప్పుకో గలిగినందుకు గాను, ఆ లంపటంలో పడి, జీవితమంతా తన అంతరాత్మను చంపుకొని, ఆత్మ వంచనతో, ఒక బానిస (స్నేహితుడి)గా మారి దుర్యోధనుని ప్రీతి కోసం ఎన్నో దుష్కృత్యాలకు ఒడిగట్టిన వాడు కర్ణుడు. అలా, హోల్ సేల్ గా ఒక అపవిత్ర దానం పట్టి, అందులో నుంచి రిటైల్ గా దానాలు చేస్తూ,దాతృత్వాన్ని చాటుకున్నట్టి కర్ణుడు నిజం గా దాన వీరత్వం గల వాడా?? ఇంకొక విషయం చూద్దాం. ఇంద్రుడు తన కవచకుండలాల కోసం వస్తున్నాడని ముందే తెలుసుకొని తాను ఇవ్వబోయే దానికి, బదులుగా ఏమి తీసుకోవాలో కూడా ముందే నిర్ణయించుకొని సిద్ధంగా ఉన్నాడు. అజేయమని చెప్పబడే తన కవచ కుండలాలను ఇచ్చి, ప్రతిగా అంతకంటే గొప్పదైనది, అప్రతిహతమైన శక్తి ఆయుధాన్ని ఇంద్రుని వద్ద తీసుకున్నాడు. ఇది దానం అనే ప్రసక్తే లేదు.ఇచ్చి పుచ్చుకునే బేరం మాత్రమే. ఇక్కడకూడా పుచ్చుకున్నదే విలువైనది.కవచకుండలాలు ఉన్నప్పుడే చాలా సార్లు కర్ణుడు ఓటమి పాలైనాడు. శక్తి అర్జునుడిని సైతం దెబ్బతీయ గలిగినది. కానీ, కర్ణుడు శాపోపహతుడే కాదు, దైవోపహతుడు కూడా కాబట్టి, విధి వశాత్తూ,అది ముందే వృధా అయింది.అది వేరే విషయం.
2 వ భాగం) *కర్ణుడు వీర శూరుడా?* కర్ణుడు మహా వీరుడే. కానీ అంత శూరుడు,ఇంత శూరుడు, ,కవచ కుండలాలు ఉన్నాయి,అసలుఅజేయుడు అనడం , కేవలం ఈనాటి కర్ణుడి అభిమాన సంఘాల కల్పన మాట, ఇంకా చెప్పాలంటే,ఆ పాత్రను ధరించిన చలన చిత్ర రంగం లో ఎదురులేని కొంత మంది హీరోలకు నచ్ఛే మాట మాత్రమే. కానీ వాస్తవం వేరు. మహాభారతంలో కర్ణుడు ఎన్నిసార్లు, ఎవరెవరి చేతిలో ఓడిపోయాడు, అంటే లెక్క పెట్టుకోవాల్సిందే. చాలాసార్లు. (1) ద్రోణునికి గురుదక్షిణ కోసం ద్రుపదునితో చేసిన యుద్ధంలో, (2) ద్రౌపదీ స్వయంవరంలో బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుని చేతిలో, (3) పాండవులు అరణ్యవాసం చేస్తూ ఉండగా వాళ్ళను అవమానించడం కోసం చేసిన ఘోష యాత్రలో, అక్కడ చిత్రసేనుడు అనే గంధర్వుడు కర్ణుని చావగొట్టి పంపించాడు. తననే నమ్ముకొని, ఈ దుస్సాహసానికి ఒడిగట్టిన తన స్నేహితుడు దుర్యోధనుడిని సైతం గాలికి వదిలేసి పారి పోయిన స్నేహ శీలి. (4) విరాటుని ఉత్తర గోగ్రహణ యుద్ధంలో ఒక్కడుగా వచ్చిన అర్జునుని చేతిలో అందరితో పాటు ఓడిపోయాడు. (5) కురుక్షేత్రంలో 13వ రోజున అభిమన్యుని చేతిలో 4సార్లు, (6) 14వ రోజు యుద్ధం లో భీముని చేతిలో 5సార్లు, అర్జునుడి చేతిలో 3సార్లు ఓడి చావు తప్పి కన్ను లొట్ట పోయి బ్రతుకు జీవుడా అంటూ పలాయనం చిత్తగించాడు . 7) అలాగే, సాత్యకి, ధృష్టద్యుమ్నుని చేతిలో 2సార్లు ఓడిపోయాడు (8) 17వ రోజు ధర్మరాజు చేతిలో ఒక సారి, భీముని చేతిలో 2 సార్లు ఓడిపోయాడు. (9) పాపాలన్నీ శాపాలుగా పరిణమించి, చివరిగా అర్జునుని చేతిలో మరణించాడు. తన తండ్రి చేతిలో చావ వలసిన వాడు అని ముద్ర వేసి కర్ణుడిని అభిమన్యుడు వదిలేశాడు కానీ,అభిమన్యుడి చేతిలోనే హతమవ్వ వలసిన వాడు కర్ణుడు. సంకుల సమరం లో ఎవరు ఎవరిని ఎన్నిసార్లు గెలిచారు అనేది ఇదమిద్ధం గా చెప్పడం కష్టం. అందువల్ల పైన చెప్పిన సంఖ్యలతో కొంత మంది విభేదించనూ వచ్చు . భారత వీరుడంటూ కర్ణుడు కావ్యాల్లో ప్రశంస కెక్కాడు కానీ, మూల భారతం చూస్తే, అసలు భారత వీరులు అర్జునాభిమన్యులే!! ఇదీ *కర్ణుని వీర శూరత్వం* మొత్తంగా కర్ణుని *దాన వీర శూర* గుణ వైభవం!!!!
sorry sire. mari yendhuku kunthi karnudu ni vadhilesindhi. malla last lo naaa kodukulani yemi cheyodhu ani pradheyapadendhi(karnudu pedda koduku kada). y yaar swamy....?
*3వ భాగం* వ్యక్తి గతంగా, కర్ణుడు తాను చాలా పరాక్రమ వంతుడు అయినా సూత పుత్రుడనై పోయానే అనే ఆత్మ న్యూనతా భావాన్ని పెంచుకొని,దాని పై ఈర్ష్య,అసూయా ద్వేషాలను మూట కట్టుకుని , వాటిని నరనరానా జీర్ణించుకొని, తామసుడై, ఉచితానుచితాలు మరచి, దుర్యోధనుని మెప్పు కోసం, పాండవులపై, ప్రత్యేకించి అర్జునుని పై ద్వేషం పెంచుకొని, చేయని పాపం లేదు. పరశురాముని వద్ద, రాజపుత్రుడనని చెప్పి గురువును వంచించిన ఘోర పాపం, ద్రౌపదీ వస్త్రాపహరణ సందర్భంలో తాను మాట్లాడిన హీనమైన మాటలు, అభిమన్యుడిని చంపడంలో తాను చేసిన అత్యంత హేయమైన పని, కర్ణుడి ని ధీరోదాత్తుడిగా ఒక్క నాటికీ నిలుప జాలవు.ఈ క్రమంలోనే, ధీరుని కన్నా భీరువు గా, ఉదాత్తుని కన్నా కపటుడిగా ,ఉత్తముని కన్నా నీచునిగా,దుష్ట చతుష్టయం లో ఒకడు గా మిగిలి పోయాడు. కర్ణుడి చావుకు ఎన్ని కారణాలున్నా, అతడు చేసిన నీచపు పనులే ఆ లెక్కకు మించి ఉన్నాయి. దాన వీర శూర కర్ణుడు అన్నది తెలుగు వారిలో కొందరి ఊహాపోహల కల్పిత పాత్ర మాత్రమే కానీ,యదార్ధ భారత పాత్ర మాత్రం అది కాదు.
ఇకపోతే,
"కర్ణుడు లేని భారతమా!" అని అన్నారు కాబట్టి కర్ణుడు ఎంత గొప్ప వాడయితే, ఆ మాట అంటారు అని కొంత మంది వ్యాఖ్యానిస్తుంటారు. కానీ ,దాని అర్థం కర్ణుడు చాలా గొప్పవాడు అని కానే కాదు. తను అర్జునుడికి సమ ఉజ్జీ కాదని తెలిసి తెలిసి కూడా, తను ఒక్కడే అర్జుడుని జయించగలిగిన వీరుడినని దుర్యోధనుడిని, ఎప్పటికప్పుడు కేవలం మాటల ద్వారా నమ్మిస్తూ, యుద్ధం దాకా తెచ్చాడని, లేకపోతే ఒకప్పుడు కాకపోతే ఇంకొకప్పుడయినా అర్జునుడిని తాను జయించలేననే భావనతోనో, భయంతోనో, భీష్మాది కురు వృద్ధులు చెప్పిన మాటలు విని దుర్యోధనుడు సంధికి సిద్ధపడే వాడేమో అనే అర్థంలో కర్ణుడు లేని భారతమా అని అంటారు. కర్ణుడే కనుక లేకపోతే భారత యుద్ధం జరిగేది కాదు అని దాని అర్థం. భారతం చదువుతున్నప్పుడు నిజానికి కొన్ని కొన్ని సందర్భాల్లో , కర్ణుడు రాజుని మించిన రాజ భక్తిని ప్రదర్శిస్తూ, దుష్ట బుద్ధి లో దుర్యోధనుడినే మించి పోయాడు అని మనకు అనిపిస్తుంది,కనిపిస్తుంది. ఆ విధంగా ఒక సాధారణమైన వ్యక్తిత్వ శీలాలు కలిగిన
వాడిగనే కర్ణుడు భారతం లో మనకు కనిపిస్తాడు తప్ప,మనం భుజాలకెత్తుకొని మోసినంత గొప్ప తనం కనపడదు..
ఇప్పటిదాకా సమానులే కానీ ఇక్కడ్నుంచి అర్జునుడు ఎన్నో తపస్సులు సాధనలు చేశాడు కర్ణుడు కంటే వయస్సులో చాలా చిన్నవాడు అయినప్పటికీ అప్పటికే బ్రహ్మ శిరోమణి బ్రహ్మాస్త్రం లాంటి దివ్య ఆస్త్రాలు ఉన్నాయి కర్ణుడు దగ్గర ఏమున్నాయి
సూర్య ప్రసాదితమైన కవచకుండలాలు
*1వభాగం* ఇటీవలి రోజుల్లో కర్ణుడు అనుకున్నంత గొప్పవాడు కాదని కొందరంటే, ఎంతో మంది పెద్దలు మెచ్చి , హెచ్చించిన కర్ణుని గొప్పతనాన్ని కాదంటారా అని మరి కొందరు; ఈవిధంగా భారతం లోని కర్ణుని గొప్పతనం మీద ఖండన మండన వ్యాఖ్యానాలు బాగా వేడె క్కుతున్నాయి. ఈ సందర్భం లో కర్ణుడి గురించి మరో సారి గుర్తు చేసుకుందాం.
కర్ణుడు దాన శీలి, వీరుడు . సందేహం లేదు. కానీ, అతడు దాన వీరత్వ, వీర శూరత్వాలకు ప్రతీకా? ఉన్నతుడా?? అన్న ప్రశ్నలకు మాత్రం అవునని చెప్పడం కుదరదు. *కర్ణుడు దాన వీరుడా లేక దాతా?* మహా దాత గా బ్రహ్మాండం గా వాసికెక్కిన పురాణ పురుషుడు కర్ణుడు. కానీ నిజానికి అంత కీర్తి వైభవానికి అర్హుడా అనే సందేహం కూడా అతడి జీవితాన్ని పరిశీలించిన ప్పుడు కలుగుతుంది.
1) అసలు మొదట చెప్పుకోవాల్సిందేమిటంటే , భారతం మొత్తం లో అతి పెద్ద దాన గ్రహీత కర్ణుడే. తన అర్హతానర్హతలు లెక్కచేయకుండా, దుర్యోధనుడు పాండవుల పట్ల ద్వేష భావంతో కర్ణుడికి ఏకంగా అంగరాజ్యాన్నే (దానంగా) ఇచ్చాడు. ఇది కర్ణుడు ఏ యుద్ధాలలోనో గెల్చుకున్నది కాదు. ఒక కుపిత, ఈర్ష్యాళువు వద్ద పుచ్చుకున్న నికృష్ట దానం. ఇలా ఎందుకు అనవచ్చు అంటే, దానం చేసే వాడు నిర్మల సత్వ మనస్కుడై, నిష్కామంగానో,పుణ్యార్థి గానో చేసిన దానం పవిత్రమైనది. దుర్యోధనుడు ఎప్పుడు, ఏ సందర్భంలో,ఎందుకు, ఈ దానం చేశాడో అందరికీ తెల్సిందే. అసలు ఈ దానం చేసే అర్హత కూడా అప్పటికి దుర్యోధనునికి లేదు. ఒక అనర్హుడు, కుపితుడై, తనది కాని దానిని దానం చేస్తే, ఆ నిక్రృష్ట దానానికి ఒడిపట్టి పుచ్చుకొని, తాను కూడా ఒక రాజే అని చెప్పుకో గలిగినందుకు గాను, ఆ లంపటంలో పడి, జీవితమంతా తన అంతరాత్మను చంపుకొని, ఆత్మ వంచనతో,
ఒక బానిస (స్నేహితుడి)గా మారి దుర్యోధనుని ప్రీతి కోసం ఎన్నో దుష్కృత్యాలకు ఒడిగట్టిన వాడు కర్ణుడు. అలా, హోల్ సేల్ గా ఒక అపవిత్ర దానం పట్టి, అందులో నుంచి రిటైల్ గా దానాలు చేస్తూ,దాతృత్వాన్ని చాటుకున్నట్టి కర్ణుడు నిజం గా దాన వీరత్వం గల వాడా??
ఇంకొక విషయం చూద్దాం. ఇంద్రుడు తన కవచకుండలాల కోసం వస్తున్నాడని ముందే తెలుసుకొని తాను ఇవ్వబోయే దానికి, బదులుగా ఏమి తీసుకోవాలో కూడా ముందే నిర్ణయించుకొని సిద్ధంగా ఉన్నాడు. అజేయమని చెప్పబడే తన కవచ కుండలాలను ఇచ్చి, ప్రతిగా అంతకంటే గొప్పదైనది, అప్రతిహతమైన శక్తి ఆయుధాన్ని ఇంద్రుని వద్ద తీసుకున్నాడు. ఇది దానం అనే ప్రసక్తే లేదు.ఇచ్చి పుచ్చుకునే బేరం మాత్రమే. ఇక్కడకూడా పుచ్చుకున్నదే విలువైనది.కవచకుండలాలు ఉన్నప్పుడే చాలా సార్లు కర్ణుడు ఓటమి పాలైనాడు. శక్తి అర్జునుడిని సైతం దెబ్బతీయ గలిగినది. కానీ, కర్ణుడు శాపోపహతుడే కాదు, దైవోపహతుడు కూడా కాబట్టి, విధి వశాత్తూ,అది ముందే వృధా అయింది.అది వేరే విషయం.
2 వ భాగం) *కర్ణుడు వీర శూరుడా?*
కర్ణుడు మహా వీరుడే. కానీ అంత శూరుడు,ఇంత శూరుడు, ,కవచ కుండలాలు ఉన్నాయి,అసలుఅజేయుడు అనడం , కేవలం ఈనాటి కర్ణుడి అభిమాన సంఘాల కల్పన మాట, ఇంకా చెప్పాలంటే,ఆ పాత్రను ధరించిన చలన చిత్ర రంగం లో ఎదురులేని కొంత మంది హీరోలకు నచ్ఛే మాట మాత్రమే. కానీ వాస్తవం వేరు. మహాభారతంలో కర్ణుడు ఎన్నిసార్లు, ఎవరెవరి చేతిలో ఓడిపోయాడు, అంటే లెక్క పెట్టుకోవాల్సిందే.
చాలాసార్లు.
(1) ద్రోణునికి గురుదక్షిణ కోసం ద్రుపదునితో చేసిన యుద్ధంలో,
(2) ద్రౌపదీ స్వయంవరంలో బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుని చేతిలో,
(3) పాండవులు అరణ్యవాసం చేస్తూ ఉండగా వాళ్ళను అవమానించడం కోసం చేసిన
ఘోష యాత్రలో, అక్కడ చిత్రసేనుడు అనే గంధర్వుడు కర్ణుని చావగొట్టి పంపించాడు. తననే నమ్ముకొని, ఈ దుస్సాహసానికి ఒడిగట్టిన తన స్నేహితుడు దుర్యోధనుడిని సైతం గాలికి వదిలేసి పారి పోయిన స్నేహ శీలి.
(4) విరాటుని ఉత్తర గోగ్రహణ యుద్ధంలో ఒక్కడుగా వచ్చిన అర్జునుని చేతిలో అందరితో పాటు ఓడిపోయాడు.
(5) కురుక్షేత్రంలో 13వ రోజున అభిమన్యుని చేతిలో 4సార్లు,
(6) 14వ రోజు యుద్ధం లో భీముని చేతిలో 5సార్లు, అర్జునుడి చేతిలో 3సార్లు ఓడి చావు తప్పి కన్ను లొట్ట పోయి బ్రతుకు జీవుడా అంటూ పలాయనం చిత్తగించాడు .
7) అలాగే, సాత్యకి, ధృష్టద్యుమ్నుని చేతిలో 2సార్లు ఓడిపోయాడు
(8) 17వ రోజు ధర్మరాజు చేతిలో ఒక సారి, భీముని చేతిలో 2 సార్లు ఓడిపోయాడు.
(9) పాపాలన్నీ శాపాలుగా పరిణమించి, చివరిగా అర్జునుని చేతిలో మరణించాడు. తన తండ్రి చేతిలో చావ వలసిన వాడు అని ముద్ర వేసి కర్ణుడిని అభిమన్యుడు వదిలేశాడు కానీ,అభిమన్యుడి చేతిలోనే హతమవ్వ వలసిన వాడు కర్ణుడు. సంకుల సమరం లో ఎవరు ఎవరిని ఎన్నిసార్లు గెలిచారు అనేది ఇదమిద్ధం గా చెప్పడం కష్టం. అందువల్ల పైన చెప్పిన సంఖ్యలతో కొంత మంది విభేదించనూ వచ్చు . భారత వీరుడంటూ కర్ణుడు కావ్యాల్లో ప్రశంస కెక్కాడు కానీ, మూల భారతం చూస్తే, అసలు భారత వీరులు అర్జునాభిమన్యులే!!
ఇదీ *కర్ణుని వీర శూరత్వం*
మొత్తంగా కర్ణుని *దాన వీర శూర* గుణ వైభవం!!!!
Karna is great
Nancens
Karna is not hero
Ippduaina telinsida karndu tappu kadu
sorry sire.
mari yendhuku kunthi karnudu ni vadhilesindhi.
malla last lo naaa kodukulani yemi cheyodhu ani pradheyapadendhi(karnudu pedda koduku kada).
y
yaar swamy....?