11th July 2010

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ส.ค. 2024

ความคิดเห็น • 17

  • @venkataravikiranbanala1296
    @venkataravikiranbanala1296 7 หลายเดือนก่อน +1

    ఇది నిత్యం స్మరణ చేయాల్సిన అద్భుత బోధ! సద్గురు దేవుల పదాలకు శిరస్సు వంచి నమస్కారములు🙏

  • @janakisankara5936
    @janakisankara5936 4 ปีที่แล้ว +4

    మీరు వాడిన విడియో కెమెరా చాలా బాగుంది.మంచి విడియో చూస్తున్నట్లు కాక,గురువు గారినే చూస్తూ,వింటున్నట్లుంది.

  • @pavanpavan2852
    @pavanpavan2852 2 หลายเดือนก่อน +1

    Om namah shivanandha gurubyho namaha 🙏🙏🙏🙏

  • @hiranyam
    @hiranyam 4 ปีที่แล้ว +8

    Excerpts :
    11 జులై ముఖ్యమైన రోజుగా పరిగణిస్తూ ఉంటాను. దక్షిణాయన ప్రారంభం సుమారుగా ఈ ప్రాంతంలో వస్తుంది.
    వ్యక్తిగతంగా జ్యోతిష ఫలితాలడుగుతారు, గాని దేశభవిష్యత్తు గురించి అడగరు.
    నా భవిష్యత్తు ఈ ఏడాది ఎలా ఉండబోతోంది అని అడుగుతారు . ఓ ఏడాది బావుంటుంది మహా అయితే ఐదేళ్లు బావుంటుంది , శాశ్వతంగా బావుంటుందా?
    ప్రతి ఒక్కరూ సంఘ క్షేమం, దేశ క్షేమం కూడా కోరాలి. దేశక్షేమంలోనే నా క్షేమం ఉందని తెలుసుకోవాలి.
    దేశ క్షేమం దేనిమీద ఆధారపడి ఉంటుంది? గ్రహాలమీద ఆధారపడి ఉండదు , ధర్మం మీద ఆధారపడి ఉంటుంది. దేశంలో ఎంత ధర్మం ఉన్నదో అంత క్షేమం ఉంటుంది.
    గత 50 ఏళ్లుగా ఏం జరుగుంతోందో గుర్తు చేసుకోండి. పూర్వం ఒక్క కారు ఉన్న గ్రామంలో 50 కార్లు ఉన్నాయి . సిరిసంపదలు పెరిగిపోతున్నాయి దేశంలో , ఆనందం పట్టలేకపోతున్నాం. దీని వెనకాల వందల కోట్ల ఖర్చు పెట్టి ఫ్యాక్టరీ లు పెట్టి లాభాల కోసం బిజినెస్ ఉంటుంది. అంత దాకా బానే ఉంది - కానీ ప్రతి కారు వెనకాల , ప్రతి మోటారు సైకిలు వెనకాల అప్పు ఉన్నది. కావాలని కొనుక్కుని అప్పుల బాధ పడడం.
    50 ఏళ్ల పూర్వం ఆంధ్ర ప్రదేశ్ లో ఇన్ని రోడ్లు లేనప్పుడు రోజుకు నలుగురైదుగురు ప్రమాదాల్లో పోయినట్టు వినేవాళ్ళం. రోజుకు 400మంది పోతున్నట్టు ఇప్పుడు పేపర్లలో చూస్తున్నాం. స్టాటిస్టిక్స్ చూస్తే తెలుస్తుంది.
    మృత్యువును పెంచుకున్నాం, అప్పులు పెంచుకున్నాం.
    పోనీ, ఉద్యోగ వ్యాపారాలలో నిజాయితీ ఇప్పుడు ఎంత ?
    50 ఏళ్ల క్రితం అబద్దం ఆడదానికి కానీ లంచం తీసుకోవడానికి కానీ భయపడేవారు. ఇప్పుడీ భయం లేదు. ఇప్పుడు ఇచ్ఛే వాళ్ళూ, పుచ్చుకునే వాళ్ళూ పెరిగారు. అవినీతి పెరిగింది
    అంతేగాక, 50 సంవత్సరాలకు పూర్వం టీబీ వెయ్యిమందిలో ఒకడికి, HIV లాంటి వ్యాధులు ఐదువేలమందిలో ఒకడికి వచ్ఛేది. ఇప్పుడు ఈ ఐదు వందల మందిలో ఐదుగురికి వస్తోంది. ఈ విశాఖపట్నం లోనే స్టాటిస్టిక్స్ చూస్తే తెలుస్తుంది.
    టెర్మినల్ డిసీసెస్ - అంటే క్యూర్ లేనివి 50 సంవత్సరాలలో 18 రెట్లు పెరిగేయి.
    గట్టిగా ఆలోచిస్తే అధర్మం పెరిగిందని అర్థం అవుతుంది.
    ఈమధ్య కాలంలో ఏ రోజైనా సరే భారతదేశంలో 8 కోట్లమంది యాత్రలలో ఉంటున్నారని ఒకరు అంచనా వేశారు. శివరాత్రిలాంటి పర్వదినాలలో అయితే 22 కోట్లమంది యాత్రలలో ఉంటున్నారట. కనీసం ఊర్లో గుడికైనా వెళ్తున్నారు. అంటే భగవంతుడి మీద అంత నమ్మకం ఉంది ప్రజలలో.
    ధర్మమే భగంతుని రూపం.
    ఒక శక్తి ఉంది , ఆ శక్తి వల్లే మనకీ రూపాలు వస్తున్నాయి. ఒక ఎలుకకైనా, మరే పశువుకైనా మనిషికైనా.
    రూపం ఇచ్చి స్వేచ్ఛనిచ్చాడు.
    స్వర్గానికి వెళ్లే దారిలో ట్రాఫిక్ బాగా తగ్గిపోయింది. రెండో దారి బాగా జామ్ అయిపొయింది.
    పూర్వం భారతదేశంలో మహారాజు కూడా వైరాగ్యంతో, జ్ఞానంతో ఒక ధర్మప్రకారం పరిపాలించేవారు. అందుకే రాజ్యభోగం కాదు, రాజ్యభారం అన్నారు.
    పూర్వం చప్పన -64 రాజ్యాలలో 16 రాజ్యాలు ఇక్ష్వాకు వంశం వారివే. ఇవి బుద్దుడి కాలంలో కూడా ఉండేవి.
    వాళ్లు మేం ఇక్ష్వాకు వంశంలో వారిమి అని ధర్మంగా ఉండేవారు.
    ఇలాంటి దేశంలో కృష్ణుడి కాలంలో బ్రాహ్మణుల సమక్షంలో దేశాన్నేలే అతి బలమైన చక్రవర్తిసభలో ఒక రాజవంశపు స్త్రీకి అవమానం జరిగింది. శక్తి ఉండి, బ్రాహ్మణులు చూస్తూ ఊరుకున్నారు. ద్రోణాచార్యుడు, ఆయన కొడుకు, ఆయన బావమరిది చూస్తూ ఊరుకున్నారు. వీరు దాన్ని ఆపలేదు, ఆపే ప్రయత్నం కూడా చేయలేదు అనాల్సి వస్తుంది. మేం చెప్పేం, అయినా వినలేదు అనవచ్చుఁ.. అప్పుడేం చేయాలి ? రాజును వదిలిపెట్టి వెళ్ళిపోవాలి.
    సశేషం @13:00
    @27:40 onwards- climax call - all must listen
    Genetics scientists, volcanologists ఇలాంటి 8 రకాల fields లో experts రాబోయే సం॥లలో చెడును predict చేస్తున్నారు.
    ధర్మస్వరూపమైన భారతదేశాన్ని రక్షించమని భగవంతుడిని ప్రార్థించాలి.. ఈ యుగసంధిలో మంచివారు, ధర్మాత్ములు క్షేమంగా వుండాలని భగవంతుడిని అడగాలి.
    ధనానికి అనుచితమైన ప్రాధాన్యం గత యాభై సం॥లలోనే పెరిగింది. దుర్మార్గమైన, అధర్మమైన పద్దతిలో దోచుకున్న సంపద కలిసిరాదు.
    రాబోయే రెండు సం॥లలోనే significant events జరగనున్నాయి.
    German ఒకామె astrology లో చాలా deep గా study చేసి పలువురికి training ఇచ్చి నిపుణులుగా తయారు చేస్తున్నది. విదేశీయులుగదా, వారికేం తెలుస్తుంది అనుకోరాదు. వారుకూడా sincereగా study చేసినవారే.
    సర్వత్రా ఏదో జరగబోతోందనే ఆందోళన మొదలయ్యింది.
    Cosmic consciousness అనేది universal గా వుంటుంది. అందరిలో ఆందోళన కలుగుతోందంటే అది cosmic గా జరుగుతున్నదే.
    Valcano వస్తుందో Tidal waves వస్తాయో, tektronic movements వల్లనో రోగాలవల్లనో ఎలా జరుగుతుందో తెలియదు. అందరి క్షేమం కోరండి.
    గుప్పెడు బియ్యం ఎవరికైనా పెడితే ఆయుర్దాయం పెరుగుతుంది., సేరు బియ్యం తిరిగివస్తుంది.

  • @mastercln9551
    @mastercln9551 4 ปีที่แล้ว +2

    The real sage lived infront of us with rare qualities who stood as the unique role model .

  • @paddyl3664
    @paddyl3664 17 วันที่ผ่านมา

    🙏🙏🙏

  • @Jyothi-STL
    @Jyothi-STL 6 หลายเดือนก่อน

    🙏🏼🙏🏼🙏🏼

  • @kavithachimmapudi8449
    @kavithachimmapudi8449 ปีที่แล้ว

    🙏

  • @sujathaaravapalli8246
    @sujathaaravapalli8246 2 ปีที่แล้ว

    Om sri gurubhyo namaha

  • @N_JanakiVSK
    @N_JanakiVSK 3 ปีที่แล้ว

    శ్రీ శివాయ గురవేనమః.

  • @ashokkarne9147
    @ashokkarne9147 ปีที่แล้ว +1

    Nami namaha

  • @bandarumadhavi2491
    @bandarumadhavi2491 2 ปีที่แล้ว

    Shivaaya gurave namaha 🙏🙏

  • @KrishnaKumari-dg1xt
    @KrishnaKumari-dg1xt 4 ปีที่แล้ว

    Sivanandaya namha

  • @bayyanaanjalidevi2236
    @bayyanaanjalidevi2236 4 ปีที่แล้ว

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @balakrishna1972
    @balakrishna1972 4 ปีที่แล้ว +1

    Sivoham

  • @apiap621
    @apiap621 6 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @kamalkumarattinagaramu8065
    @kamalkumarattinagaramu8065 ปีที่แล้ว

    🙏🙏🙏