Yesuni Venta Nenu Vembadinchu chunanu Naa Siluvanu Moyuchu Nenu || Songs Of Zion || Song No 374(774)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2024
  • SONG NO - 374(774)
    "యేసు ― ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తికొని నన్ను వెంబడింపవలెను." మత్తయి Matthew 16:24
    పల్లవి: యేసుని వెంట నేను - వెంబడించుచున్నాను (1)
    నా సిలువను మోయుచు నేను - వెంబడించుచున్నాను (1)
    అనుపల్లవి: తన హృదయానుసారునిగా
    ఉండుటకు సిద్ధపడుచున్నాను
    1. ఎంతో అద్భుతమైనది - నా ప్రభుని బలియాగం (2)
    సాదృశ్యముగ నా కొరకై
    ప్రాణమర్పించెను - ప్రాణమర్పించెను
    నా ప్రభుని తలచుచు నేను - వెంబడించుచున్నాను (2)
    2. ఈ లోక సౌదర్యము - నన్ను మోసగించదు
    సాతాను యుక్తులన్నియు
    నా మీద పనిచేయవు - నా మీద పనిచేయవు
    యేసుని స్వరము వినుచూ - వెంబడించుచున్నాను
    3. ఎంతో అద్భుతమైనది - నా ప్రభు నన్ను శిక్షించుట
    ప్రభు నన్ను సరిచేయుట
    తన ప్రేమయై యున్నది - తన ప్రేమయై యున్నది
    యేసుని స్వరము వినుచూ - వెంబడించుచున్నాను
    4. ఇబ్బందులెన్నో కలిగిన నా దృష్టి ప్రభు మీదనే
    శ్రమలే మాత్రము కదల్చవు
    అద్దరి అగుపడుచున్నది - అద్దరి అగుపడుచున్నది
    శీఘ్రముగానే చేరుటకు - వెంబడించుచున్నాను
    5. తన చిత్తములో నన్నుంచి - నా ప్రభు సంతోషించును
    మంచి మాటలన్నియు నేర్పి
    నను సిద్ధపరచుచున్నాడు - నను సిద్ధపరచుచున్నాడు
    మహిమను పొందుటకు నేను - వెంబడించుచున్నాను

ความคิดเห็น •