Amberwood_2024_08_Telugu Bhasha Dinotsavam
ฝัง
- เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024
- మా పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రంగురంగు పూలతో మామిడితోరణాలతో పాఠశాలను అలంకరించారు. మన తెలుగు వారి సంస్కృతి సాంప్రదాయాలను వివరిస్తూ తెలుగు భాష గొప్పతనాన్ని కొనియాడారు.
కార్యక్రమంలో శాస్త్రీయ నృత్యాలు అందరినీ ఆకట్టుకొన్నాయి. విద్యార్థులు ఆలపించిన మా తెలుగు తల్లి, తెలుగోళ్ళ౦ పాటలు వీనుల విందు చేశాయి మరియు చిన్నారులు తెలియచేసిన పొడుపుకథలు, సామెతలు, పద్యాలు ఎంతో హృద్యంగా ఉన్నాయి. ఇక తెలుగు భాష గురించి తెలియచేసిన కవిత అందరి మన్ననలు అందుకొన్నది. తెలుగు భాషలో ఇన్ని యాసలు ఉన్నాయని అందరినీ ఆలోచింపచేసే హాస్యనాటకం అందరి ప్రశంసలు అందుకొన్నది.