Garikapati Narasimha Rao :ఆందోళన నుంచి విముక్తి పొందాలంటే | EP -231 | ABN Devotional

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ต.ค. 2024
  • Garikapati Narasimha Rao :ఆందోళన నుంచి విముక్తి పొందాలంటే | EP -231 | ABN Devotional
    #garikapatinarasimharao #garikapati #pravachanalu #garikipatispeech #abndevotional #GarudaPuranam
    For All Political and Latest News Updates Subscribe to #ABNDevotional: bit.ly/abndevot...
    ABN Telugu ABN is a 24/7 Telugu news television channel run by Aamoda Broadcasting Network dedicated to the latest political news, live reports, exclusive interviews, breaking news, sports, weather updates, entertainment, business, and current affairs. #ABNLIVE #ABNNEWS #ABNLIVETELUGU
    ------------------------------------------------------------------------------------------
    Enjoy and stay connected with us!!
    ► Subscribe us on TH-cam: bit.ly/abndevot...
    ► Like us: / abntelugutv
    ► Follow us on Helo: ABN Andhrajyothy
    ► Follow us: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on ABN Web Portal: www.andhrajyot...
    ► Follow us on ABN Video Gallery: bit.ly/2Gfbg7P
    ABN App Links :
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/ABNAndhr...
    SUBSCRIBE ABN News Channels for Latest News Updates 24/7:
    SUBSCRIBE ABN News Channels for Latest News Updates 24/7:
    ► For ABN News Telugu:bit.ly/3cwIbD8/...
    ► For ABN Entertainment: bit.ly/ABNEnter...
    ► For ABN Indian Kitchen:bit.ly/indianki...
    ► For Something Special: bit.ly/2v6Ekfm
    ► For International News : bit.ly/ABNInter...
    ► For National News: bit.ly/ABNNational
    ► For ABN Telangana : bit.ly/abntelan...
    ► For ABN Breaking News : bit.ly/ABNBreak...
    ► For ABN Devotional: bit.ly/abndevot...

ความคิดเห็น • 4

  • @keshavgowda4785
    @keshavgowda4785 2 หลายเดือนก่อน

    శ్రీ గురుభ్యోనమః 💐🙏🙏💐

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 2 หลายเดือนก่อน +1

    దైవాసురసంపద్విభాగ యోగము
    శ్లో|| 5: దైవీ సమ్పద్విమోక్షాయ నిబన్ధాయాఽసురీ మతా ।
    మాశుచ స్సమ్పదం దైవీ మభిజాతోఽసి పాణ్డవ ! ||
    (దైవ, అసుర గుణము)
    భావము:- దైవ అంశ మోక్షమును కల్గించును. అసురాంశ బంధమే కల్గించును. నీవు దైవాంశ సంభూతుడవైనందు వలన బాధపడవలసిన పనిలేదు.
    వివరము:- దైవాంశ, రాక్షసాంశ అను రెండు భాగములలో దైవాంశ దైవము వైపు, రాక్షసాంశ జన్మలవైపు మార్గములై ఉన్నవి. దైవాంశ అనుదానిలో పుట్టినవారు దైవమునకు జ్ఞానమునకు విరుద్ధమైన పనులు చేయకుందురు. మంచి పనులు చేయుచు, వాటి వలన కొద్ది కొద్దిగ ఆలోచిస్తు, ఆ ఆలోచనల వలన కొద్ది కొద్దిగ జ్ఞానము మీద ధ్యాసకల్గుచు, గురు సన్నిధికి చేరుచుందురు. అక్కడ గురువు బోధించు జ్ఞానమును బట్టి కొన్ని జన్మలకైన మోక్షమును పొందగలరు. రాక్షసాంశయందు పుట్టినవారు దైవమునకు జ్ఞానులకు విరుద్ధమైన పనులు చేయుట వలన వారికి జ్ఞానమునకు మధ్య దూరమేర్పడును. జ్ఞానము మీద ధ్యాసలేని వారు గురువులను సహితము హేళనగా మాట్లాడుచుందురు. అటువంటి వారికి జ్ఞానము యొక్క గట్టు దొరకక జన్మ జన్మలకు దైవమునకు దూరమగుచు జన్మకర్మలను పొందుచునే ఉందురు. దైవికమైన విషయములందు విలువ, గౌరవమిచ్చు సజ్జనులు (దైవాంశపరులు) దైవికమైన శ్రద్ధను పొందుచు కొన్ని జన్మల తరువాత దైవమును గురించిన సమాచారము తెలియగలరు. ఇటువంటి వారిని గూర్చియే విజ్ఞాన యోగములో 19వ శ్లోకములో 'బహూనామ్ జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే ' అని అన్నారు. రాక్షసాంశ గలవారు దైవిక విషయములను చులకనగా చూస్తు జ్ఞానులను శత్రువులుగ లెక్కించుచుందురు. అటువంటివారు దేవతలకు భక్తులుకావచ్చును కాని పరమాత్మ విషయముల గురించి తెలియలేరు. జన్మ జన్మకు జ్ఞానము యొక్క గట్టుకు దూరమగుచు ఎప్పటికీ జ్ఞానమును తెలియలేరు. అర్జునుడు దైవాంశమున పుట్టినవాడు కనుక ఎన్నో జన్మల శ్రద్ధ చేత గురువుగ భగవంతుడే లభించాడు. దైవాంశములో పుట్టిన వారిని దేవతలని, రాక్షసాంశలో పుట్టిన వారిని రాక్షసులని అనుచున్నాము. పురాణాలలో చెప్పినట్లు వారెక్కడో లేరు. భూమి మీద మానవాకారులలోనే ఉన్నారు. దీని విషయము క్రింది శ్లోకములో చూడండి.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 2 หลายเดือนก่อน

    దైవాసురసంపద్విభాగ యోగము
    శ్లో|| 6: ద్వౌ భూతసర్గౌ లోకేఽస్మిన్‌ దైవ ఆసుర ఏవ చ ।
    దైవో విస్తరశః ప్రోక్త ఆసురం పార్థ! మే శృణు ||
    (దైవ, అసుర గుణములు)
    భావము:- లోకమున దైవ అసుర అను రెండు రకముల జీవులు పుట్టుచున్నారు. దైవ విషయముల వాటి గుణముల గురించి చెప్పివున్నాను. అసురులను గూర్చి చెప్పెదను వినుము.
    వివరము:- దేవతలు, రాక్షసులు అను రెండు రకములవారు భూమిమీద ఉన్నారంటే నమ్మలేని విషయముగ ఉంటుంది. కాని భగవంతుడు చెప్పిన మాట నిజము. దేవతలనువారు ఎక్కడో పై లోకాలలో ఉన్నారని అనుకోవడము పొరపాటు, దేవతలు రాక్షసులు నిజముగ భూమిమీదనే ఉన్నారు. కొంత జ్ఞానమున్నవారు వీరిని భూమిమీదనే గుర్తించవచ్చును. ఈ రెండు జాతులు గుణములను బట్టి ఏర్పడుచున్నవి. ఇక్కడ 'ద్వౌ భూతసర్గౌ లోకేఽస్మిన్ దైవ అసుర ఏవచ' అనడములో లోకములకు నిలయమైన భూమి మీదనే దేవతలు, రాక్షసులు పుట్టుచున్నారని చెప్పడము బాగుగ గ్రహించవచ్చును.
    దేవతలు ముప్పదిమూడు కోట్లు కలరని ప్రతీతి కలదు. వారెంత మందైనప్పటికి విష్ణు, ఈశ్వర, బ్రహ్మ మొదలుకొని చిన్న చిన్న దేవతల వరకు భూమి మీద విస్తరించి మనుషులరూపములో ఉన్నారు. ఇక్కడ కొందరికొక అనుమానము రావచ్చును. భూమిమీద దేవతలున్నట్లె కాదా! కనిపించలేదే! వారెక్కడ ఉన్నారు? వారెట్లున్నారు? అని అడుగవచ్చును. దానికి సమాధానము భగవంతుడు చెప్పినట్లు దేవతలు రాక్షసులు భూమి మీదనే కలరు. అయినప్పటికి వారిని మనము గుర్తించలేక పోవుచున్నాము. అలా ఎదుటి వారిని గుర్తించుటకు కొంతైనా జ్ఞానదృష్ఠి అవసరము. ఎదుటి వారిని గుర్తించలేక పోవడమే కాక మానవులలో దేవతలైనవారు వారిని వారు కూడ గుర్తించలేరు. ఎదుటి వారిని గుర్తించుటకు అవకాశమున్నది కాని ఎవరిని వారు గుర్తించుటకు అవకాశములేదు. ఎదుటి వారు దేవతలని గుర్తించుటకు జ్ఞానదృష్ఠి అవసరమన్నాము కదా! అలాంటి దృష్ఠిలేని వారికి అందరు మనుషులుగానే కనిపించుచుందురు. మనుషులలో గల తారతమ్యములు తెలియవు. చిన్న చిన్న దేవతలు మొదలుకొని విష్ణువు వరకు గల దేవతా వ్యత్యాసములు మానవులలోనే కలవు.
    జ్ఞానశక్తి ఉన్నవారంత దేవతలేనని చెప్పవచ్చును. వారి వారి జ్ఞానశక్తిని బట్టి దేవతలందు వ్యత్యాసములు కలవు. అత్యధిక జ్ఞానశక్తివున్న వాడు విష్ణువు. అతనికంటే కొంత తక్కువ కలవాడు రుద్రుడు. తరువాత బ్రహ్మ అలాగే జ్ఞానశక్తి తగ్గుకొలది వారిలో వ్యత్యాసములుండి ఆయా దేవతలుగ చెప్పబడుచున్నారు. దీనిని బట్టి జ్ఞానశక్తి ఉన్నవారంతా దేవతలని, జ్ఞానశక్తిలేని వారంతా రాక్షసులని చెప్పవచ్చును.
    దేవతలైన విష్ణు, ఈశ్వర, బ్రహ్మ మొదలగువారు ఈ కలియుగములో ఉన్నారా? విశేషమైన జ్ఞానశక్తి ఉన్న విష్ణు, ఈశ్వర, బ్రహ్మ మొదలగువారు పరమాత్మయందైక్యము చెందక కలియుగములో కూడా ఉన్నారా? వారికి ముక్తి రాలేదా? వారు కూడ అందరి మాదిరి జన్మ ఎత్తుచునే ఉన్నారా? అను ప్రశ్నలు అందరికి రావచ్చును. దానికి సమాధానమేమనగా!
    (తర్వాత కామెట్లో కంటిన్యూ అయింది చూడండి)

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 2 หลายเดือนก่อน

    ( ముందు కామెంటు కంటిన్యూ చేస్తూ)
    దేశములో రాజు, యువరాజు, ప్రధానమంత్రి, మంత్రి అను ఎన్నియో లెక్కలేనన్ని పదవులున్నవి కదా! ఆ పదవులు మొదటినుండి ఉన్నప్పటికి ఒక పదవిలో ఒకే మనిషి ఎప్పటికి లేడు. దేశానికి రాజు పదవి శాశ్వతమైనది. అయినప్పటికి రాజు మాత్రము శాశ్వతము కాదు. ఒకే రాజ్యానికి రాజుగ ఎంతో మంది మారివుండుట మనకు తెలిసిన విషయమే. అంత దూరమెందుకు ఇప్పుడున్న ప్రధాని పదివిలో ఎంతో మంది ప్రధానులుగ ఉండి మారిపోవుట చూచుచూనే ఉన్నాము కదా! ఎంతమంది ప్రధానులు మారినా ప్రధానమంత్రి పదవి మాత్రము అలాగే శాశ్వతముగ ఉన్నది కదా! అలాగే భూమిమీద విష్ణు, ఈశ్వర, బ్రహ్మ అను మొదలగు దేవతా పదవులు కలవు. ఈ పదవులకు అర్హత పొందిన జీవులు నిర్ణయించబడుచున్నారు. అలాగే ఒకే జీవుడు శాశ్వతముగ ఒక పదవికి అర్హుడుగ లేడు. అతను కొంత కాలముండగ, మరియొకడు కొంత కాలము అర్హత పొందుచున్నాడు. ఒక జీవుడు ప్రపంచమంతటిలోను జ్ఞానశక్తి (యోగాగ్ని)లో మొదటివాడైనాడనుకొనుము. యోగశక్తిలో మొదటివాడైన దానివలన అన్నిటికంటే పెద్ద దేవతా పదవియైన విష్ణు పదవికి అర్హత పొంది ఉండును. అప్పుడు ఆ జీవుడు స్త్రీ పురుషులలో ఏ శరీరము ధరించి ఉన్నప్పటికి అతడే విష్ణువు. అటువంటి వాడు కొద్దిపాటి కర్మతో పుట్టివుండును. ఆ జన్మలో పూర్తి జ్ఞానాగ్నిని సంపాందించుకొని, ఉన్న కొద్దిపాటి కర్మను కూడ లేకుండ చేసుకొని, ఆ జన్మలోనే మోక్షము పొందును. అప్పుడు తిరిగి ఆ పదివికి భూమి మీద ఎవడో ఒకడు జ్ఞానశక్తిలో అధికుడు అర్హత పొంది విష్ణువగును. ఈ విధముగ దేవతల పదవులు ఖాళీ ఏర్పడుచూనే ఉండును. తరువాత వాటికి ఇతరులు అర్హులగుచూనే ఉందురు. భూమిమీద జీవులే వారి వారి జ్ఞానశక్తిని బట్టి దేవతల యొక్క అర్హతలు పొందివున్నారని తెలియుచున్నది. విష్ణు, ఈశ్వర, బ్రహ్మలు కూడ భూమిమీద మనుషులేనని తెలియుచున్నది. అట్లు శరీరధారులైన దేవతలు యోగమాచరించి కర్మలేకుండ చేసుకొని మోక్షము పొందుచున్నారు. పెద్ద పెద్ద దేవతలు భూమి మీద ఉన్నప్పటికి, మాయా ప్రాబల్యము వలన వారెవరైనది వారికే తెలియదు. దేవతలైన వారు గురువులుగ, జ్ఞానులుగ, యోగులుగ, భక్తిపరులుగ, సన్న్యాసులుగ ఎందరో ఉండగ, వారికి విరుద్ధముగ ఎందరో రాక్షసులు కూడ భూమిమీదే మనుష్యుల రూపములో ఉన్నారు.
    జ్ఞానము కల్గిన వారికి విరుద్ధముగ ఉండు వారంత రాక్షసులే, వీరియందు జ్ఞానముకాని, జ్ఞానశక్తికాని ఏమాత్రముండదు. పరమాత్మ విషయములు వీరికి వ్యతిరేఖముగా ఉండును. ముఖ్యముగ తామసభక్తి గల రాక్షసులు తామే నిజమైన భక్తులమనుకొనుట కూడ కలదు. ఇంకనూ వారెట్లున్నారనగా క్రింది శ్లోకములు చూచెదము.