హుస్నాబాద్ లో నిరుద్యోగ కళాకారుల ఐక్యవేదిక సమావేశం...PRP NEWS

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 พ.ย. 2024
  • సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో హుస్నాబాద్ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కళాకారులకు రాష్ట్ర సంస్కృతిక సారధిలో ఉద్యోగాలు ఇప్పించాలని కోరుతూ తెలంగాణ ధూమ్ ధం కవి కళాకారుడు నేర్నల కిషోర్ కు వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర ముఖ్యమైనదని కళాకారులు తెలిపారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ సాంస్కృతిక సారధి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారాన్నారు. ఈ విషయమై హైకోర్టును ఆశ్రయిస్తే మళ్లీ తూతూ మంత్రంగా ఎంపిక ప్రక్రియ చేపట్టి తిరిగి పాత వారికే ఉద్యోగాలు ఇచ్చారన్నారు. మొదటి దశలో ఉద్యోగాలు రాని వారికి రెండో దఫాలో ఇస్తామని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై నేర్నల కిషోర్ మాట్లాడుతూ నిరుద్యోగ కళాకారుల విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, నిరుద్యోగ కళాకారులను ఆదుకోవాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ప్రస్తుత రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్ గా గద్దర్ కుమార్తె వెన్నెల గద్దర్ ను నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నిరుద్యోగ కళాకారుల సమస్య విషయమై వెన్నెల గద్దర్ కృషి చేస్తారని ఆకాంక్షించారు.

ความคิดเห็น •