|| maredumilli tour trip in 2days in low budget మారేడుమిల్లి టూర్ 2రోజులలో తకువ ఖర్చులో

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2023
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రికి 87 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం మారేడుమిల్లి. విలక్షణమైన గిరిజన జీవనశైలి, విభిన్నమైన ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. నదులు, జలపాతాలతో పాటు సుందరమైన క్యాంపింగ్ ప్రాంతాలు కూడా ఇక్కడ ఉన్నాయి. వారాంతాల్లో సరదాగా పిక్నిక్ లకు వెళ్లేందుకు ఇది సరైన ప్రాంతం. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలాల్లో ఈ ప్రాంతం పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది. ఆకుపచ్చ లోయలు, వృక్షజాలం పరవశింపజేస్తాయి. ఇక్కడికి హైదరాబాద్, కాకినాడ, విశాఖపట్నం నగరాల నుంచి సులభంగా చేరుకోవచ్చు. ఎక్కువగా సందర్శకులు తెల్లవారేసరికి ఇక్కడికి చేరుకుని సాయంత్రానికి తిరుగు ప్రయాణం అవుతారు. విశాఖపట్నం నుంచి మారేడుమిల్లి 225 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నాలుగు గంటల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. మీ వీకెండ్ లో మారేడుమిల్లి సందర్శనకు వెళ్లాలనుకుంటే అక్కడ చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాల జాబితాను ఇక్కడ 1. జలతరంగిణి జలపాతాలు:
    మారేడుమిల్లి, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక నీటి మడుగులు, జలపాతాలు కనిపిస్తాయి. కొండలపై నుంచి దూకుతూ దట్టమైన అడవుల్లోకి ప్రవహించే జలపాతాల దృశ్యాలు పర్యాటకులకు మరపురాని జ్ఞాపకాలను అందిస్తాయి. ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక చక్కని గమ్యస్థానం. మారేడుమిల్లి ప్రాంతం పరిధిలో అనేక చిన్న జలపాతాలతో పాటు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో జలతరంగిణి జలపాతాలు ఉన్నాయి. ప్రధాన రహదారికి ఈ ప్రదేశం కాస్త దగ్గరగా ఉంటుంది. ద్విచక్ర వాహనాలపై ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు.
    2. స్వర్ణధార, రంప జలపాతాలు:
    జలతరంగిణి జలపాతాల నుంచి 20 కిలోమీటర్ల దూరంలో స్వర్ణధార జలపాతాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో భారీ మామిడి చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి మర్రిచెట్ల మాదిరిగా పెద్దగా ఉంటాయి. దట్టమైన, లోతైన అటవీ మార్గంలో ఉన్న ఈ ప్రదేశానికి ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లవచ్చు. మార్గమధ్యంలో నెమళ్లను, ఇతర పక్షులను కూడా చూసే అవకాశం ఉంటుంది.
    అలాగే మారేడుమిల్లి నుంచి 36 కిలోమీటర్ల దూరంలో రంప జలపాతాలు ఉన్నాయి. రంప చోడవరం నుండి రంప జలపాతం వరకూ జీప్ లో ప్రయాణం చేస్తూ చేరుకోవడం గొప్ప అనుభవం. 10 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసుకుంటూ కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ జలపాతం యొక్క నీరు తియ్యని రుచితో ఉంటుంది. జలపాతానికి సమీపంలో పాత శివాలయం కూడా ఉంది. అనేక ఔషధ మొక్కలు, వెదురు చెట్లు ఈ ప్రాంతంలో కనిపిస్తాయి.
    3. కార్తీక వనం, వాలీ సుగ్రీవ ఔషధ మొక్కల పరిరక్షణ ప్రాంతం:
    కార్తీక వనం ప్రాంతం అరుదైన మొక్కలు, వృక్ష జాతులకు ప్రధాన ఆవాసం. సహజసిద్ధ ప్రకృతి అందాలతో ఈ ప్రదేశం పర్యాటకుల మనసు దోచుకుంటుంది. ఉసిరి, మారేడు, గూస్ బెర్రీ, బేల్ వంటి అనేక రకాల మొక్కల జాతులు ఇక్కడ కనిపిస్తాయి. అరుదైన ఔషధ మొక్కలపై పరిశోధనలు చేసేందుకు ఇది ఒక బహిరంగ ప్రయోగశాలగా ఉపయోగపడుతుంది. దాదాపు 203 జాతుల ఔషధ మొక్కలను ఇక్కడ చూడవచ్చు. స్వచ్చమైన గాలి, వాతావరణం మధ్య ఇక్కడ అమూల్యమైన సమయాన్ని గడపవచ్చు.
    Read Also: విజయవాడలో తప్పక చూడాల్సిన టూరిస్ట్ ప్రదేశాలు.. ఫోటో కలెక్షన్
    4. మదనికుంజ్-విహార స్థల్:
    మారేడుమిల్లి ప్రాంతంలో ఉన్న మరో అద్భుతమైన విహార ప్రదేశం మదనికుంజ్-విహార స్థల్. ప్రకృతి ఒడిలో సేద తీరే ప్రముఖ పిక్నిక్ స్పాట్ గా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. బంగారు వర్ణంలో ఉండే వెదురు చెట్లు, వందల ఏళ్ల నాటి వృక్షాలు ఇక్కడ అధిక సంఖ్యలో ఉంటాయి. పులులు, అడవి కోళ్లు, అడవి దున్నలు, నల్ల చిరుతలు, నెమళ్లతో పాటు విభిన్న రకాల సీతాకోక చిలుకలు ఇక్కడ కనిపిస్తాయి.
    5. జంగిల్ స్టార్:
    ఇక్కడ పర్యాటకులను ఆకర్షించే ప్రాంతాల్లో జంగిల్ స్టార్ ఒకటి. ఇది వలమూరు నదికి సమీపంలో ఉంటుంది. తూర్పు కనుమలకు సమీప అడవుల్లో మూడు వైపులా పొంగి పొర్లే ప్రవాహాల మధ్య రాత్రి పూట క్యాంపింగ్ అనుభూతిని ఇక్కడ పొందవచ్చు. రామాయణానికి చెందిన వాలి, సుగ్రీవులు ఈ ప్రాంతంలోనే పోరాడినట్లు చెబుతారు. ఈ ప్రాంతంలో పర్యటన టూరిస్టులకు పురాణ గాధలను గుర్తుచేస్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అటవీ శాఖ ఇక్కడ ట్రెక్కింగ్ కు అవకాశం కల్పిస్తుంది. అడ్వెంచర్ ట్రెక్కింగ్ తో పాటు క్రాస్ కంట్రీ ట్రెక్కింగ్ కు కూడా ఇక్కడ అవకాశం ఉంది.
    మారేడుమిల్లిలో పర్యాటకులు చెట్ల నీడన పకృతి అందాలను చూస్తూ సమయం గడిపేందుకు వీలుగా అనేక రిసార్ట్స్ అందుబాటులో ఉన్నాయి. రిసార్ట్స్ లోపల టూరిస్టులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఇక్కడ పరిసరాల్లో సాంప్రదాయ పాటలు వింటూ నృత్యాలను కూడా చూడవచ్చు. మారేడుమిల్లి ఫారెస్ట్ రిజర్వేషన్ ప్రాజెక్ట్, ఎకో టూరిజం ప్రాజెక్ట్ లు టూరిస్టులకు గొప్ప అనుభూతిని అందిస్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఇక్కడి రిసార్ట్స్ లో ఒకటి లేదా రెండు రోజులు గడపడం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది.#maredumilli #waterfall#forest#maredumillitouristplaces#teluguvlogs

ความคิดเห็น • 13

  • @user-le3hi4lx7u
    @user-le3hi4lx7u 7 หลายเดือนก่อน

    Wow

  • @gopiteluguvlogs
    @gopiteluguvlogs 7 หลายเดือนก่อน

    My favourite place #gudisa

  • @gopiteluguvlogs
    @gopiteluguvlogs 7 หลายเดือนก่อน

    TQ for sharing

  • @user-tj7nr5sl5s
    @user-tj7nr5sl5s 7 หลายเดือนก่อน

    Chala chala bagundandi. Manchi video echaru.thq Andi .trip chala easy chesaru.

  • @georgemular5357
    @georgemular5357 7 หลายเดือนก่อน +1

    మీరు చూపించే. ప్రతి వ్యూ కి ఒక లైక్ 👍 చెయ్యాలనిపిస్తుంది❤ కానీ ఒకటే ఉంది😊
    "మారేడుమిల్లి అందాలని చాలా అద్భుతంగా చూపించారు..!❤