శ్రీ సాయిబాబా మహాసమాధి లీలల పాట//Shiridi saibaba Akravachan//saibaba ekadasa vachanam//saibaba bajan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2021
  • శ్రీ సాయిబాబా మహాసమాధి లీలలు తెలుసుకోవాలంటే ఈ అద్భుతమైన పాట వినాల్సిందే!!! Special Song On Sri Sai Baba Maha Samadhi // Sai Baba Songs Sai Tv
    హిందువులలో నెవరైన మరణించుటకు సిద్ధముగా నున్నప్పుడు, మత గ్రంథములు చదివి వినిపించుట సాధారణాచారము. ఏలన ప్రపంచ విషయములనుండి అతని మనస్సును మరలించి భగవద్విషయములందు లీనమొనర్చినచో నతడు పరమును సహజముగాను, సులభముగాను పొందును. పరీక్షిన్మహారాజు బ్రాహ్మణ ఋషి బాలునిచే శపింపబడి, వారము రోజులలో చనిపోవుటకు సిద్ధముగా నున్నప్పుడు గొప్ప యోగియగు శుకుడు భాగవతపురాణమును ఆ వారములో బోధించెను. ఈ అభ్యాసము ఇప్పటికిని అలవాటులో నున్నది. చనిపొవుటకు సిద్ధముగా నున్నవారికి గీతా, భాగవతము మొదలగు గ్రంథములు చదివి వినిపించెదరు. కాని బాబా భగవంతుని యవతారమగుటచే వారికట్టిది యవసరము లేదు. కాని, యితరులకు ఆదర్శముగా నుండుటకు ఈయలవాటును పాటించిరి. త్వరలోనే దేహత్యాగము చేయనున్నామని తెలియగనే వారు వజే యను నాతని బిలిచి రామవిజయమను గ్రంథమును పారాయణ చేయుమనిరి. అతడు వారములో గ్రంథము నొకసారి పఠించెను. తిరిగి దానిని చదువుమని బాబా యాజ్ఞాపింపగా అతడు రాత్రింబవళ్ళు చదివి దానిని మూడు దినములలో రెండవ పారాయణము పూర్తిచేసెను. ఈ విధముగా 11 దినములలో రెండవ పారాయణము పూర్తిచేసెను. ఈ విధముగా 11 దినములు గడచెను. అతడు తిరిగి 3 రోజులు చదివి యలసిపోయెను. బాబా అతనికి సెలవిచ్చి పొమ్మనెను. బాబా నెమ్మదిగా నుండి ఆత్మానుసంధాములో మునిగి చివరి క్షణముకయి యెదురు చూచుచుండిరి.
    రెండుమూడుదినముల ముందునుండి బాబా గ్రామము బయటకు పోవుట, భిక్షాటనము చేయుట మొదలగునవి మాని మసీదులో కూర్చుండిరి. చివరవరకు బాబా చైతన్యముతో నుండి, అందరిని ధైర్యముగా నుండుడని సలహా ఇచ్చిరి. వారెప్పుడు పోయెదరో ఎవరికిని తెలియనీయలేదు. ప్రతిదినము కాకాసాహెబు దీక్షితు, శ్రీమాన్ బుట్టీయు వారితో కలిసి మసీదులో భోజనము చేయుచుండెడివారు. ఆనాడు (అక్టోబరు 15వ తారీఖు) హారతి పిమ్మట వారిని వారివారి బసలకుబోయి భోజనము చేయుమనెను. అయినను కొంతమంది లక్షీబాయి శిందే, భాగోజి శిందే, బాయాజి, లక్షణ్ బాలాషింపి, నానాసాహెబు నిమోన్కర్ యక్కడనే యుండిరి. దిగువ మెట్లమీద శ్యామా కూర్చొనియుండెను. లక్షీబాయి శిందేకు 9 రూపాయలను దానము చేసినపిమ్మట, బాబా తనకాస్థలము (మసీదు) బాగలేదనియు, అందుచేత తనను రాతితో కట్టిన బుట్టీ మేడలోనికి దీసికొని పోయిన నచట బాగుగా నుండుననియు చెప్పెను. ఈ తుదిపలుకు లాడుచు బాబా బాయాజీ శరీరముపై ఒరిగి ప్రాణములు విడిచెను. భాగోజీ దీనిని గనిపెట్టెను. దిగువ కూర్చొనియున్న నానాసాహెబు నిమోన్కర్కు ఈ సంగతి చెప్పెను. నానాసాహెబు నీళ్ళు తెచ్చి బాబా నోటిలో పోసెను. అవి బయటకు వచ్చెను. అతడు బిగ్గరగా ఓ దేవా! యని యరచెను. బాబా తన భౌతికశరీరమును విడిచిపెట్టెనని తేలిపోయెను.
    బాబా సమాధి చెందెనని సంగతి శిరిడి గ్రామములో కార్చిచ్చు వలె వ్యాపించెను. ప్రజలందరు స్త్రీలు, పురుషులు, బిడ్డలు మసీదుకు పోయి యేడ్వసాగిరి. కొందరు బిగ్గరగా నేడ్చిరి. కొందరు వీథులలో నేడ్చుచుండిరి. కొందరు తెలివితప్పి పడిరి. అందరి కండ్లనుండి నీళ్ళు కాలువలవలె పారుచుండెను. అందరును విచారగ్రస్తు లయిరి.
    నేను అనగా నెవ్వరో సాయిబాబా యెన్నోసార్లు బోధించెను. వారిట్లనిరి. "నన్ను వెదుకుటకు నీవు దూరము గాని మరెచ్చటికి గాని పోనక్కరలేదు. నీ నామము నీ యాకారము విడిచినచో నీలోనేగాక యన్ని జీవులలోను, చైతన్యము లేదా యంతరాత్మ యని యొకటి యుండును. అదే నేను. దీనిని నీవు గ్రహించి, నీలోనేగాక అన్నిటిలోను నన్ను జూడుము. దీనిని నీవభ్యసించినచో, సర్వవ్యాపకత్వ మనుభవించి నాలో ఐక్యము పొందెదవు."
    హేమడ్ పంతు చదువరులకు ప్రేమతో నమస్కరించి వేడునదేమన వారు వినయవిధేయతలతో దైవమును, యోగులను, భక్తులను ప్రేమింతురుగాక! బాబా పెక్కుసారులు "ఎవరయితే ఇతరులను నిందించుదురో వారు నన్ను హింసించినవారగుదురు. ఎవరయితే బాధలనుభవించెదరో, ఓర్చుకొందురో వారు నాకు ప్రీతి గూర్చెదరు" అని చెప్పిరిగదా! బాబా సర్వవస్తుజీవసముదాయములో నైక్యమైయున్నారు. భక్తులకు నలుప్రక్కలనిలచి సహాయపడెదరు. సర్వజీవులను ప్రేమించుట తప్ప వారు మరేమియు కోరరు. ఇట్టి శుభమయిన పరిశుభ్రమయిన యమృతము వారి పెదవులనుండి స్రవించుచుండెను. హేమడ్ పంతు ఇట్లు ముగించుచున్నారు. ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరో, ఎవరు దానిని భక్తితో వినెదరో, ఉభయులును సాయితో నైక్యమగుదురు.

ความคิดเห็น • 99

  • @subbammanerella5441
    @subbammanerella5441 2 ปีที่แล้ว +4

    Om sai ram om sai ram om sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajyalakshmiakunuri9694
    @rajyalakshmiakunuri9694 2 ปีที่แล้ว +4

    అనిల్ గారు మీరు రాసే ప్రతి పాట అద్భుతం ఈ పాటలు విన్నా మేము కూడా ఎంతో పుణ్యం చేసుకున్నము

  • @punnamvenkatalakshmisai3185
    @punnamvenkatalakshmisai3185 2 ปีที่แล้ว +9

    ఎన్నిసార్లు విన్నా, మళ్లీ మళ్లీ వినాలపించే మంచి సాహిత్యం, అనిల్ గారికి ధన్యవాదాలు🙏

  • @mallikarjunakarnamomsairam5177
    @mallikarjunakarnamomsairam5177 2 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹ఓంశ్రీసాయినాదాయనమః

  • @pabbusreenu5217
    @pabbusreenu5217 2 ปีที่แล้ว +4

    Om sai ram

  • @venupulgala6864
    @venupulgala6864 2 ปีที่แล้ว +2

    అద్భుతమైన పాట పాడిన ఇచ్చినందుకు కృతజ్ఞతలు

  • @srilakshmi8032
    @srilakshmi8032 2 ปีที่แล้ว +4

    సాయి మా సాయి దేవ నిన్ను తలిస్తేనే నీ భక్తుల మనసు పరవసించెనె బాబా. ......Omsairam. 🙏🏻🕉️🕉️🕉️🕉️🕉️🙏🏻

  • @radhikareddy2835
    @radhikareddy2835 2 ปีที่แล้ว +2

    Om sri sai ram Om sri sai ram Om sri sai ram Om sri sai ram Om sri sai ram Om thrayambakam yajamahe sugandim pushti vardanam urvarikmiv bandhanaan mruthyomukshiya mamrithath om srimathre namah

  • @mayurihome5330
    @mayurihome5330 2 ปีที่แล้ว +4

    సుపర్

  • @harikrankran6721
    @harikrankran6721 2 ปีที่แล้ว +3

    🌺🌿 Om Sai 🌺🌿🙏🌿🌺 Om Sai 🌿🌺

  • @subhasinikarnam2939
    @subhasinikarnam2939 2 ปีที่แล้ว +3

    Omsairam🙏🙏🙏🙏🙏💖💖💖💖💖💖💖💖

  • @ismartchinnuchannel1398
    @ismartchinnuchannel1398 2 ปีที่แล้ว +13

    అద్భుతమైన పాటల నిలయం మన సాయి టివి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @karimulla2494
    @karimulla2494 2 ปีที่แล้ว +1

    ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి రామ్ నాకు ఆరోగ్యం బాగుండేలా చెయ్యండి బాబా ఓంసాయి రాం 🥥🥥🥥🥥🌷🌹🌹💐🌸🌺🌺🌺🌺🌺🌸🌸💐🌹🌹🌹🌹🌹🌹

  • @harikrankran6721
    @harikrankran6721 2 ปีที่แล้ว +2

    🌺🌿 Om Sai 🌺 Om Sai 🌺 Om Sai 🌿🌺

  • @prasanthivaikar1173
    @prasanthivaikar1173 2 ปีที่แล้ว +2

    🙏💐om sai ram💐🙏

  • @sripadpriya5543
    @sripadpriya5543 2 ปีที่แล้ว +2

    Om sai sri sai jaya jaya sai

  • @omsairam6450
    @omsairam6450 2 ปีที่แล้ว +3

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @shortfilmzone8170
    @shortfilmzone8170 2 ปีที่แล้ว +3

    Om sri sairam 🙏

  • @mounikaammu4157
    @mounikaammu4157 2 ปีที่แล้ว +2

    Om sai sri Sai jayajaya sai

  • @mandavasrinivas1675
    @mandavasrinivas1675 2 ปีที่แล้ว +2

    Om Sai Sri Sai Jaya Jaya Sai