కామాక్షి విలాసం స్నానం చేసే ముందే ఇది చదువుకుంటే.. | Kamakshi Vilasam | Sravanthi | Red TV Bhakthi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 พ.ย. 2024
  • శ్రీ గురుభ్యో నమః
    గురుమూర్తే త్వాం నమామి కామాక్షీ!!
    మార్కండేయ పురాణాంతర్గత శ్రీ కామాక్షీ విలాసం - ఒక అద్భుతమైన స్తోత్రం. ఈ స్తోత్రవైభవం చెప్పాలి అంటే, పరమపూజ్యులు, ప్రాతఃస్మరణీయులు, నడిచే దేవుడు కంచి పరమాచార్య శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారే స్వయంగా బ్రహ్మశ్రీ వేదపురి వారికి ఈ స్తోత్రం పారాయణ చెయ్యమని, అందరికీ ఈ శ్లోకం గురించి చెప్పమని బోధించారు. ఈ స్తోత్రం ప్రతీ రోజూ స్నానం చేసే ముందు చదువుకుంటే, కామాక్షీ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అంతేకాదు, ఎవరైతే ప్రతీ రోజూ కంచి కామాక్షీ అమ్మవారిని దర్శించుకోలేరో, ఈ కామాక్షీవిలాసం అనే స్తోత్రం పఠించడం వలన ప్రతీ రోజూ కామాక్షీ దర్శన ఫలితాన్నే పొందుతారు అని పరమాచార్య స్వామి వారి వాక్కు.
    ఈ కామాక్షీ విలాసంలో, అమ్మవారి యొక్క వైభవం విస్తారంగా వర్ణింపబడినది. అంతేకాదు, కంచిలోని శివ, విష్ణు, గణేశ, సుబ్రహ్మణ్యుల దేవాలయాలు అమ్మ వారి ప్రథాన ఆలయం నుంచి ఎంతెంత దూరంలో ఉన్నాయో కూడా వర్ణించబడినది. కామాక్షీ విలాసంలో ఆగమ శిల్ప శాస్త్రాలకు సంబంధించి అనేక విషయాలు కూడా ఉన్నాయి అని పెద్దలు చెప్తారు. అన్ని శివాలయాలలోని అమ్మవారి గర్భగుడిని "కామకోష్ఠం" అని శిల్ప శాస్త్రాలు వర్ణిస్తాయి.కాబట్టి మనమందరమూ కూడా ఈ పరమ పవిత్రమైన కామాక్షీవిలాసం అనే స్తోత్రాన్ని ప్రతీ రోజూ స్నానం చేసేముందు పఠించి, కామాక్షీ అమ్మవారి, ఏకామ్రేశ్వర స్వామివారి మరియు జగద్గురువులు పరమాచార్య స్వామి వారి అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఈ స్తోత్ర లిపి తెలుగులో ఈ క్రింద వ్రాశాను. అక్షరదోషాలు ఏమైనా కనిపిస్తే, పెద్దలు సరిచేయగలరు.
    II శ్రీ కామాక్షీ విలాసమ్ II
    స్వామిపుష్కరిణీ తీర్థం పూర్వసింధుః పినాకినీ I
    శిలాహ్రదశ్చతుర్మధ్యం యావత్ తుండీరమండలమ్ II 1 II
    మధ్యే తుండీరభూవృత్తం కమ్పావేగవతీ ద్వయోః I
    తయోర్మధ్యం కామకోష్ఠం కామాక్షీ తత్ర వర్తతే II 2 II
    స ఏవ విగ్రహో దేవ్యా మూలభూతోಽద్రిరాడ్భువః I
    నాన్యోಽస్తి విగ్రహో దేవ్యా కాంచ్యాం తన్మూలవిగ్రహః II 3 II
    జగత్కామకలాకారం నాభిస్థానం భువః పరమ్ I
    పదపద్మస్య కామాక్ష్యాః మహాపీఠముపాస్మహే II 4 II
    కామకోటిః స్మృతః సోಽయం కారణాదేవ చిన్నభః I
    యత్ర కామకృతో ధర్మో జన్తునా యేన కేన వా I
    సకృత్వాಽపి సుధర్మాణాం ఫలం ఫలతి కోటిశః II 5 II
    యో జపేత్ కామకోష్ఠేಽస్మిన్ మన్త్రమిష్టార్థదైవతమ్ I
    కోటివర్ణఫలేనైవ ముక్తిలోకం స గచ్ఛతి II 6 II
    యో వసేత్ కామకోష్ఠేಽస్మిన్ క్షణార్ధం వా తదర్ధకమ్ I
    ముచ్యతే సర్వపాపేಽభ్యః సాక్షాద్దేవీ నరాకృతిః II 7 II
    గాయత్రీ మంటపాధారం భూనాభిస్థానముత్తమమ్ I
    పురుషార్థప్రదం శమ్భోర్బిలాభ్రం తం నమామ్యహమ్ II 8 II
    యః కుర్యాత్ కామకోష్ఠస్య బిలాభ్రస్య ప్రదక్షిణమ్ I
    పదసఙ్ఖ్యాక్రమేణైవ గోగర్భ జననం లభేత్ II 9 II
    విశ్వకారణనేత్రాఢ్యాం శ్రీమత్ త్రిపురసుందరీమ్ I
    బన్ధకాసురసంహంత్రీం కామాక్షీం తామహం భజే II 10 II
    పరాజన్మదినే కాంచ్యాం మహాభ్యన్తర మార్గతః I
    యోಽర్చయేత్ తత్ర కామాక్షీం కోటిపూజాఫలం లభేత్ I
    తత్ఫలోత్పన్నకైవల్యం సకృత్ కామాక్షీ సేవయా II 11 II
    త్రిస్థాననిలయం దేవం త్రివిధాకారమచ్యుతమ్ I
    ప్రతిలిఙ్గాగ్రసంయుక్తానాం భూతబంధం తమాశ్రయే II 12 II
    య ఇదం ప్రాతురుత్థాయ స్నానకాలే పఠేన్నరః I
    ద్వాదశశ్లోకమాత్రేణ శ్లోకోక్తఫలమాప్నుయాత్ II
    II ఇతి శ్రీ కామాక్షీ విలాసే త్రయోవింశే అధ్యాయే శ్రీకామాక్షీ మాహాత్మ్యం సంపూర్ణమ్ II
    సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.
    Welcome to Our Channel. RedTV Bhakti to explain ancient science and technology and the scientific basis behind rituals of Indian health information, Inner Engineering and tips, and mind-blowing facts.
    An educational channel dedicated to academic, non-sectarian study. We strive to raise the level of conversation about Indian Culture & Traditions on TH-cam by exploring surprising facts about humanity's beliefs and rituals through an anthropological, sociological, and archaeological lens.
    a lot of information.
    Like | Share | Subscribe

ความคิดเห็น • 7

  • @mudduvenkatasubbalakshmi1993
    @mudduvenkatasubbalakshmi1993 6 หลายเดือนก่อน

    చక్కని స్తోత్రం సాహిత్యంతో అందించినందుకు ధన్యవాదాలు అండి 🙏

  • @OfficialVedha
    @OfficialVedha 8 หลายเดือนก่อน

    Amma namaskaram mimmalni chusthene chala santhoshamga anpisthindhi Amma chala dhanyavadhalu🙏🙏

  • @bhoopathimamidala7328
    @bhoopathimamidala7328 8 หลายเดือนก่อน +1

    Thanks univese thanks madam

  • @satyavathipeyyala6355
    @satyavathipeyyala6355 8 หลายเดือนก่อน +1

    Hi Padmini akka hi sravanthi garu mee vedios Anni super madam

  • @sandhyabindhu9928
    @sandhyabindhu9928 8 หลายเดือนก่อน

    Screen minda pettandi madam garu meru please

  • @lathayadav5835
    @lathayadav5835 8 หลายเดือนก่อน

    Chala baga chepparu mam edhariki chala chala 🙏