ఏమి లేని నన్ను కోరుకున్నా నేను ఉన్న చోటు చేరుకున్నా పావనుండైన ఆ దేవుడు ప్రేమతో ఇల జన్మించెను పాపితో స్నేహం చెయ్యాలని యేసు క్రీస్తు తానే మానవుడాయెను దూత దేవ దూత శుభవార్త ప్రకటించె ధాత శాంతి ధాత ఆగమనం వివరించె గాలిలో ఎదో కొత్త పాట సాగెనె హాయి నీయగా గుండెలో ఉన్న భారమంత దూరమై సేద తీరగ సత్యమాయెనే కల తార వింత తార తూర్పు వైపు కనిపించె జాడ యేసు జాడ విదితము గావించె పాకలో ఉన్న తొట్టిలొన బాలుడు పవళించగా ధన్యురాలైన తల్లి నోట స్తోత్రమే పల్లవించగా వేడుకాయెనే ఇల
ఏమి లేని నన్ను కోరుకున్నా
నేను ఉన్న చోటు చేరుకున్నా
పావనుండైన ఆ దేవుడు
ప్రేమతో ఇల జన్మించెను
పాపితో స్నేహం చెయ్యాలని
యేసు క్రీస్తు తానే మానవుడాయెను
దూత దేవ దూత శుభవార్త ప్రకటించె
ధాత శాంతి ధాత ఆగమనం వివరించె
గాలిలో ఎదో కొత్త పాట
సాగెనె హాయి నీయగా
గుండెలో ఉన్న భారమంత
దూరమై సేద తీరగ
సత్యమాయెనే కల
తార వింత తార తూర్పు వైపు కనిపించె
జాడ యేసు జాడ విదితము గావించె
పాకలో ఉన్న తొట్టిలొన
బాలుడు పవళించగా
ధన్యురాలైన తల్లి నోట
స్తోత్రమే పల్లవించగా
వేడుకాయెనే ఇల
Excellent mighty 👌 👏
Billions of thanks for bringing such a beautiful composition ❤
Thank you praise God Brother
thank brother