Spiritual Journey Official
Spiritual Journey Official
  • 307
  • 2 236 894
వీరితో అస్సలు సహవాసం చెయ్యకూడదు | Telugu Christian Messages Latest | RRK Murthy Messages in Telugu
యూదుడు యూదుని గూర్చి యూదులకు వ్రాసిన సువార్తయే మత్తయి సువార్త. ఇందు మత్తయి రచీత, యూదులు చదవరులు, యేసుక్రీస్తును గూర్చిన ప్రస్తావన. యేసును యూదుల రాజుగా, దీర్ఘకాలము నుండి ఎదురు చూస్తున్న మెస్సీయగా తెలియజేయుటయే మత్తయి యొక్క ఉద్దేశం. ఆయన వంశావళి, బాప్తిస్మము, అద్భుత కార్యములు మొదలగునవన్నియు యేసు రాజని మార్పులేని ఒకే ఉద్దేశములోనికి చదవరుల దృష్టిని నడిపించుచున్నవి. ఈ రాజు మరణము చెందుట వలన మొదట తన దృష్టికి ఓటమిగా అనిపించినప్పటికీ ఆయన పునరుత్థానము చెందుట ద్వారా విజయకరముగా మారెనని భావించెను. యూదుల రాజు జీవించుచుండెను అను సందేశము పదే, పదే ప్రతిధ్వనించుచుండెను.
మత్తయి అనే పేరుకు దేవుని దానం అనే అర్థం కలదు. మత్తయికి లేవీ అనే మరొక పేరు కూడా కలదు. (మార్కు 2:14; లూకా 5:27)
ఉద్దేశము : నిత్యుడైన రాజు, మెస్సీయ అని యేసును నిరూపించుట.
గ్రంథకర్త : మత్తయి (లేవీ)
కాలము : క్రీ.శ 60 - 65కు మధ్యలో
గత చరిత్ర : రోమా గౌరవ్నమెంటు కోసం సుంకమును వసూలు చేయు ఒక ఉద్యోగస్తుడైన మత్తయి. ఇతడు యేసు ప్రభువు యొక్క శిష్యుడుగా మారెను. ప్రవచనముల నెరవేర్పుకు దృఢత చేకూర్చుట ద్వారా యీ సువార్తను పాత, క్రొత్త నిబంధనలను కలిపె గొలుసువలె నుండెను.
ముఖ్య వచనములు : ధర్మశాస్త్రమునైనను, ప్రవక్తల వచనముల నైనను కొట్టివేయు వచ్చితినని తలంచవద్దు నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు మత్తయి 5:17
ప్రముఖ వ్యక్తులు : యేసు, మరియ, యోసేపు, బాప్తీస్మమిచ్చు యోహాను, యూద మత గురువులు పెద్దలు, కయప, ఫిలాతు, మగ్దలేనే మరియ, యేసు శిష్యులు.
ముఖ్య స్థలములు : బెత్లెహేము, యెరూషలేము, కపెర్నహూము, గలలియ, యూదయ.
గ్రంథ విశిష్టత : ఈ సువార్త ఒక మెస్సీయ శైలిలో రచింపబడెను. (ఉదాహరణకు దావీదు సంతతివాడు అని పలుమారు ఉపయోగించెను. పాత నిబంధన వాక్యములు యాభైమూడు, స్పష్టముగా లేని డెభైరు హెచ్చరికలు ఇందులో కలవు, సంభవములు కాలక్రమమును అనుసరించి ఇవ్వబడలేదు. యేసును మెస్సీయగాను రాజుగా నిరూపించుటయే ముఖ్య ఉద్దేశం.
ముఖ్య పద సముదాయము : యేసు అను రాజు.
ముఖ్య వచనములు : మత్తయి 16:16-19; 28,19-20}
ముఖ్య అధ్యాయము : 12
పండ్రెండ అధ్యాయములో పరిసయ్యులు యేసును ఇశ్రాయేలు జనులకు నాయకత్వం వహించు స్థానము నుండి బహిరంగముగా ఆయనను తృణీకరించెను. యేసు ప్రభువు యొక్క శక్తి దేవునిని నుండి కాక సాతాను నుండి వచ్చుచున్నదని వారు చెప్పుటతో మత్తయి సువార్త ఒక మలుపు తిరుగుచున్నది. సాధారణ ప్రజలకు యేసు ప్రభువు బోధించునపుడు ఉపమానములతో బోధించుచు ఆయన శ్రద్ధ ముఖ్యంగా తన శిష్యులకు తర్ఫీదునిచ్చునట్లు త్రిపచుండెను. ఈ సందర్భములోనే తన సిలువ మరణము సమీపించుచున్నదని పలుమార్లు చెప్పుచుండెను.
గ్రంథ విభజన : మత్తయి సువార్తను క్రొత్త నిబంధనలో మొదటి గ్రంథముగా చేర్చుటతో కొన్ని కారణములు లేకపోలేదు. 1వ అధ్యాయము, 1వ వాక్యము గమనించినచో అబ్రాహాము కుమారుడగు దావీదు. కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. ఈ ప్రారంభములోని సత్యమును పలుమారు మారులు చెప్పుట ద్వారా ఈ సువార్త పాత, క్రొత్త నంబంధనలను కలిపే వంతెన వలె ఉండెను. యేసుక్రీస్తు యొక్క ప్రాముఖ్య మైన ఐదు ప్రసంగము యీ సువార్తలో నుండెను. కొండ మీద ప్రసంగము (Mat,5,3-7,27) శిష్యులకు కావలసిన బోధ (మత్తయి 10:5-42) పరలోక రాజ్యమును గూర్చిన ఉపమానములు (మత్తయి 13:3-52) శిష్యత్వమునకు కావలసిన విధులు (మత్తయి 9:3-38) ఒలీవ కొండ పై ప్రసంగం (Mat,24,3-25,46) మొదలగునవన్ని యేసు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తుగా చూపుచున్న ఈ సువార్త గ్రంథ విభజన ఈ క్రింది విధముగా నున్నది.
రాజు వంశావళి, రాకడ Mat,1,1-4,11. • రాజు కట్టడలు Mat,4,12-7,29. రాజు అధికారము Mat,8,1-11,1. • రాజు తృణీకరింపబడుట Mat,11,2-16,12. • రాజు రాయబారుల సిద్ధపాటు Mat,16,13-20,28. • రాజుగా నగర ప్రవేశము, నిరాకరింపబడుట Mat,20,29-27,66. • రాజు అధికార నిరూపణ మత్తయి 28:1-20.
సంఖ్యా వివరములు : - పరిశుద్ధ గ్రంథములో ఇది 40వ పుస్తకము; అధ్యాయములు 28; వచనములు 1071; ప్రశ్నలు 177; నెరవేరిన పాతనిబంధన ప్రవచనములు 25; క్రొత్త నిబంధన ప్రవచన వాక్యములు 47; చరిత్రాత్మక వచనములు 815; ప్రవచన వాక్యములు 256; నెరవేరిన ప్రవచనములు 164; నెరవేరని ప్రవచనములు 92.
#rrk
#rrkmurthy
#rrkmurthymessages
#rrkfamily
#telugugospel
#teluguchristian
#bellampalli_praveen_kumar
#calvary
#calvaryministries
#calvarytemple
#calvarytemplelive
#christ
#drjohnwesly
#drjayapaul
#drjohnwesleymessages
#drasherandrew
#thandri_sannidhi_ministries
#thandrisannidhi
#thandrisannidi
#thandrisannidhiministries
#thandrisannidhisongs
#vkr_cgti_ministries
#vkrlive
#jyothiraju
#emmanuelministries
#emmanuel
#emmanuelministrieshyderabad
#emmanuelministriesmadanapalle
#rajprakashpaulsongs
#rajprakashpaul
#rajprakashpaulmessages
#rakshanatv
#rakshanatvlive
#drsatishkumar
#drpsatishkumar
#pjstephenpaul
#pjstephenpaulmessages
#pjsstephenpaul
#blessiewesly
#telugugospel
#teluguchristian
#teluguchristianlatestmessages
#hosannaministriessongs
#hosanna
#hosannaministries
#joshuashaiksongs
#blessiewesly
#samuelkarmoji
#samuelkarmojisongs
#samuelkarmojiministries
#vijayprasadreddy
มุมมอง: 10 606

วีดีโอ

విశ్వాసి యొక్క దుఃఖాలకు అంతం | Telugu Christian Messages Latest | @ProfRRKMurthy | Telugu Messages
มุมมอง 8934 หลายเดือนก่อน
క్రీస్తు మరణం. (33-41) యూదులు ధర్మసూర్యుడిని అస్పష్టం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేయడంతో, మధ్యాహ్నం నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు భూమిని దట్టమైన చీకటి కప్పివేసింది. ఈ చీకటి క్రీస్తు మానవ ఆత్మను చుట్టుముట్టిన ప్రగాఢమైన వేదనకు ప్రతీకగా ఆయన తనను తాను పాపానికి బలిగా అర్పించుకున్నాడు. అతను తన శిష్యులు తనను విడిచిపెట్టినందుకు విలపించలేదు, కానీ తన తండ్రిని విడిచిపెట్టాడు. ఈ క్షణంలో, అతను మా కోసం పాపం...
నీవు ఆశీర్వాదం కొరకు చేయవలసింది ఇదే | Telugu Christian Messages | Latest | @ProfRRKMurthy |
มุมมอง 6654 หลายเดือนก่อน
మార్కు సువార్త 15 పిలాతు ముందు క్రీస్తు. (1-14) వారు యేసును బంధించారు మరియు మన కొరకు ఆయన ఎలా బంధించబడ్డాడో మనం తరచుగా గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. రాజును అప్పగించడం ద్వారా, వారు దేవుని రాజ్య పాలనను సమర్ధవంతంగా అప్పగించారు మరియు ఆ విధంగా, తమ అధికారాన్ని ఇష్టపూర్వకంగా వదులుకున్నారు, దానిని మరొక దేశానికి బదిలీ చేశారు. యేసు నేరుగా పిలాతు ప్రశ్నలకు ప్రతిస్పందించాడు, కానీ సాక్షుల ఆరోపణలు అబద్ధమని తెలి...
పస్కా పశువు వధించబడింది | Telugu Christian Bible Messages | @ProfRRKMurthy | RRK. Murthy Messages
มุมมอง 3794 หลายเดือนก่อน
మార్కు సువార్త 14 క్రీస్తు బేతనియలో అభిషేకించబడ్డాడు. (1-11) "క్రీస్తు మనకోసం తన ప్రాణాన్ని ఇచ్చాడా, దానికి ప్రతిఫలంగా అందించలేని విలువైనదేదైనా మనం పరిగణించగలమా? మన ప్రగాఢమైన ఆప్యాయత అనే అమూల్యమైన లేపనాన్ని ఆయనకు సమర్పించగలమా? మన ఉత్సాహం మరియు ఆప్యాయత కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకున్నప్పటికీ, హృదయపూర్వకంగా ఆయనను ప్రేమిద్దాం. లేదా విమర్శించబడింది.అదృష్టవంతులకు దాతృత్వం చూపడం అనేది యేసుప్రభువు...
బీదవిధవరాలి దాతృవం | Telugu Christian Bible Messages Latest | @RRKMurthy | Telugu Messages | Bible
มุมมอง 4194 หลายเดือนก่อน
మార్కు సువార్త 13 - ఆలయ విధ్వంసం గురించి ముందే చెప్పబడింది. (1-4) హృదయంలో నిజమైన స్వచ్ఛత లోపించినప్పుడు, గొప్పతనం యొక్క బాహ్య ప్రదర్శనలకు క్రీస్తు ఎంత తక్కువ ప్రాముఖ్యతనిస్తాడో గమనించండి. అమూల్యమైన ఆత్మలు క్షీణించడాన్ని అతను కనికరంతో చూస్తాడు మరియు వారి కోసం కన్నీళ్లు పెట్టుకుంటాడు, అయినప్పటికీ అతను ఒక సంపన్నమైన భవనం నాశనం చేయడం గురించి అలాంటి ఆందోళనను వ్యక్తం చేసినట్లు ఎటువంటి ఖాతా లేదు. కాబట్...
ద్రాక్షతోట గురించిన ఉపమానము | Telugu Christian Bible Messages Latest | @ProfRRKMurthy
มุมมอง 3064 หลายเดือนก่อน
Mark - మార్కు సువార్త 12 ద్రాక్షతోట మరియు వ్యవసాయదారుల ఉపమానం. (1-12) ఉపమానాలలో, క్రీస్తు యూదు చర్చిని పక్కన పెట్టాలనే తన ఉద్దేశ్యాన్ని వివరించాడు. చర్చి యొక్క అధికారాలను ఆస్వాదించిన వారి నుండి దేవుని నమ్మకమైన పరిచారకులు చరిత్ర అంతటా అనుభవించిన దుర్వినియోగం గురించి ఆలోచించడం నిరుత్సాహపరుస్తుంది, కానీ సంబంధిత ఆధ్యాత్మిక ఫలాలను ఉత్పత్తి చేయడంలో విఫలమైంది. చివరికి, దేవుడు తన ప్రియమైన కుమారుడిని పం...
మీరు శోధనలలో పడకుండా మెళకువకలిగి ప్రార్ధించుడి | Telugu Christian Messages Latest | @ProfRRKMurthy
มุมมอง 6694 หลายเดือนก่อน
తోటలో క్రీస్తు వేదన. (32-42) క్రీస్తు బాధలు అత్యంత తీవ్రమైన వేదనతో మొదలయ్యాయి, ముఖ్యంగా అతని ఆత్మలో. మత్తయి సువార్తలో స్పష్టంగా ఉపయోగించని పదాలు కానీ అర్థాన్ని సమృద్ధిగా ఉపయోగించడం ద్వారా అతను చాలా ఆశ్చర్యపోయాడు. దేవుని భయాందోళనలు ఆయనకు వ్యతిరేకంగా తమను తాము ఏర్పాటు చేసుకున్నాయి మరియు వాటిని ఎదుర్కోవడానికి ఆయన తనను తాను అనుమతించాడు. ఆ సమయంలో, అతని దుఃఖం అసమానమైనది. మా పూచీకత్తుగా చట్టం యొక్క శా...
మీరు అడుగుచున్న వాటినెల్ల పొందియున్నామని నమ్ముడి | Telugu Christian Messages Latest | @ProfRRKMurthy
มุมมอง 5154 หลายเดือนก่อน
Mark - మార్కు సువార్త 11 జెరూసలెంలోకి క్రీస్తు విజయవంతమైన ప్రవేశం. (1-11) ఈ అద్భుతమైన రీతిలో యెరూషలేములోనికి క్రీస్తు ప్రవేశం శక్తివంతమైన విరోధులు మరియు దురాచారాల నేపథ్యంలో అతని నిర్భయతను ప్రదర్శిస్తుంది. భయంతో పోరాడుతున్న ఆయన శిష్యులకు ఆయన ధైర్యం ఒక ప్రోత్సాహకరమైన ఉదాహరణగా పనిచేసింది. అంతేకాకుండా, రాబోయే బాధలను ఎదుర్కొనే అతని ప్రశాంతత అతని వినయాన్ని నొక్కిచెప్పింది, ఉన్నత స్థానాలను వెతకడం కంటే...
బర్తేమియాకు వున్న విశ్వాసం మీకువుందా | Telugu Christian Messages Latest | RRK Murthy | Bible Today |
มุมมอง 7704 หลายเดือนก่อน
మార్కు సువార్త 10: క్రీస్తు తన బాధలను ముందే చెప్పాడు. (32-45) మానవాళి యొక్క మోక్షానికి తన మిషన్ పట్ల క్రీస్తు యొక్క అచంచలమైన నిబద్ధత అతని శిష్యులను ఎల్లప్పుడూ ఆశ్చర్యానికి గురిచేస్తుంది మరియు ఎప్పటికీ ఉంటుంది. భూసంబంధమైన ప్రతిష్ట తరచుగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది మరియు క్రీస్తు స్వంత అనుచరులు కూడా కొన్నిసార్లు దాని మెరుపుతో ఆకర్షితులయ్యారు. అతనితో పాటు ఎలా సహించాలో అర్థం చేసుకోవడానికి మనకు జ్ఞానం...
దేవునికి సమస్తమును సాధ్యమే | Telugu Bible Message Latest | @RRK Murthy | Telugu Bible | Word of GOD
มุมมอง 1.8K4 หลายเดือนก่อน
మార్కు సువార్త 10 విడాకుల గురించి పరిసయ్యుల ప్రశ్న. (1-12) యేసు ఎక్కడికి వెళ్లినా, పెద్ద సమూహాలు ఆయనను వెంబడించాయి మరియు అతను నిరంతరం బోధించడంలో మరియు బోధించడంలో నిమగ్నమయ్యాడు. క్రీస్తు యొక్క సాధారణ అభ్యాసం అతని బోధనలను తెలియజేయడం. ఈ సందర్భంలో, మోషే చట్టం విడాకులను అనుమతించడానికి కారణం ప్రజల కఠిన హృదయాల కారణంగా ఉందని, అయితే వారు ఈ అనుమతిని వెంటనే పొందకూడదని అతను వివరించాడు. దేవుడే భార్యాభర్తలను...
యేసు నామమును వాడే అబద్దబోదకులారా జాగ్రత్త | Telugu Christian Latest Message | #FakePastors
มุมมอง 5584 หลายเดือนก่อน
అపొస్తలులు మందలించారు. (30-40) క్రీస్తు రాబోయే బాధల సమయం ఆసన్నమైంది. ఆయనను ఈ విధంగా ప్రవర్తించిన రాక్షసులకు అప్పగిస్తే ఆశ్చర్యం కలుగక మానదు, కానీ తమను రక్షించడానికి వచ్చిన మనుష్యకుమారుని ప్రజలు అవమానకరంగా ప్రవర్తించడం నిజంగా విశేషమైనది. క్రీస్తు తన మరణం గురించి మాట్లాడినప్పుడల్లా, అతను తన పునరుత్థానాన్ని కూడా ప్రస్తావించాడు, తద్వారా తన నుండి అవమానాన్ని తొలగించాడు మరియు అతని శిష్యుల దుఃఖాన్ని తగ...
నమ్ముట నీవలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమే | Telugu Christian Messages Latest | RRK Murthy
มุมมอง 1.5K4 หลายเดือนก่อน
Join our telegram Channel: t.me/Spiritualjourneyofficial మార్కు సువార్త 9 రూపాంతరము. (1-13) క్రీస్తు రాజ్యం యొక్క ఆసన్న రాక గురించి ఇక్కడ ఒక సూచన ఉంది. క్రీస్తు రూపాంతరం సమయంలో ఆ రాజ్యం యొక్క సంగ్రహావలోకనం వెల్లడైంది. ప్రాపంచిక ఆందోళనల నుండి విడిచిపెట్టి, క్రీస్తుతో ఒంటరిగా గడపడం నిజంగా అద్భుతమైనది మరియు పరిశుద్ధులందరితో పాటు పరలోకంలో మహిమపరచబడిన క్రీస్తుతో కలిసి ఉండటం మరింత అద్భుతమైనది. అయినప్...
విశ్వాసం ద్వారా క్రీస్తుపై ఆధారపడేవారు భయపడాల్సిన అవసరం లేదు | Telugu Christian Messages
มุมมอง 3504 หลายเดือนก่อน
విశ్వాసం ద్వారా క్రీస్తుపై ఆధారపడేవారు భయపడాల్సిన అవసరం లేదు | Telugu Christian Messages
జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనను క్రీస్తు వున్నాడు | Latest Telugu Christian Messages | RRK
มุมมอง 2014 หลายเดือนก่อน
జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనను క్రీస్తు వున్నాడు | Latest Telugu Christian Messages | RRK
31st August 2024 Promise Verse | Today Promise
มุมมอง 874 หลายเดือนก่อน
31st August 2024 Promise Verse | Today Promise
క్రీస్తు మనకొరకు సమస్తమును బాగుగా చేసియున్నాడు | Telugu Christian Messages Latest | RRK Murthy
มุมมอง 4204 หลายเดือนก่อน
క్రీస్తు మనకొరకు సమస్తమును బాగుగా చేసియున్నాడు | Telugu Christian Messages Latest | RRK Murthy
నీవు నూరంతలుగాను ఫలింపవలెను | Latest Telugu Christian Messages | RRK murthy messages latest
มุมมอง 2614 หลายเดือนก่อน
నీవు నూరంతలుగాను ఫలింపవలెను | Latest Telugu Christian Messages | RRK murthy messages latest
పాపులమైన మనకొరకు వచ్చిన క్రీస్తు | Latest Telugu Christian Messages | Latest RRK Murthy Messages
มุมมอง 2534 หลายเดือนก่อน
పాపులమైన మనకొరకు వచ్చిన క్రీస్తు | Latest Telugu Christian Messages | Latest RRK Murthy Messages
వేకువనే యేసును వెదకుడి అప్పుడు మీకు సకల సమృద్ధి కలుగును | Latest Telugu Christian Messages | RRK
มุมมอง 55K4 หลายเดือนก่อน
వేకువనే యేసును వెదకుడి అప్పుడు మీకు సకల సమృద్ధి కలుగును | Latest Telugu Christian Messages | RRK
దేవుడు మనకిచ్చిన గొప్ప వరం క్రీస్తు | Latest Telugu Christian Messages | Latest RRK Murthy Messages
มุมมอง 1.3K4 หลายเดือนก่อน
దేవుడు మనకిచ్చిన గొప్ప వరం క్రీస్తు | Latest Telugu Christian Messages | Latest RRK Murthy Messages
చేతబడి నుండి విడుదల పొందడం ఎలా | Latest Telugu Christian Messages | How to live Happy Life
มุมมอง 1904 หลายเดือนก่อน
చేతబడి నుండి విడుదల పొందడం ఎలా | Latest Telugu Christian Messages | How to live Happy Life
ఆసెనతు చరిత్ర ద్వారా ప్రతి స్త్రీ నేర్చుకోవలసిన విషయాలు | Telugu Christian Messages latest |
มุมมอง 3595 หลายเดือนก่อน
ఆసెనతు చరిత్ర ద్వారా ప్రతి స్త్రీ నేర్చుకోవలసిన విషయాలు | Telugu Christian Messages latest |
మీరు అవమానము నొందిన స్థలములోనే మిమ్మును హెచ్చింతును | telugu Christian Messages latest |
มุมมอง 7535 หลายเดือนก่อน
మీరు అవమానము నొందిన స్థలములోనే మిమ్మును హెచ్చింతును | telugu Christian Messages latest |
నీ హస్తము నీ విరోధులమీద ఎత్తబడియుండును గాక | | Christian Messages Telugu | Telugu Messages
มุมมอง 1245 หลายเดือนก่อน
నీ హస్తము నీ విరోధులమీద ఎత్తబడియుండును గాక | | Christian Messages Telugu | Telugu Messages
నీకు కల్గిన ఆపదలలోనుండి విడిపించు నీ దేవుడు సజీవ సాక్ష్యం | #teluguchristiantestimonies #testimonies
มุมมอง 2316 หลายเดือนก่อน
నీకు కల్గిన ఆపదలలోనుండి విడిపించు నీ దేవుడు సజీవ సాక్ష్యం | #teluguchristiantestimonies #testimonies
సృష్టి రహస్యం భాగం 1 | Secret of Creation Part 1
มุมมอง 2796 หลายเดือนก่อน
సృష్టి రహస్యం భాగం 1 | Secret of Creation Part 1
దేవుని వాక్యపఠనమే నిన్ను బ్రతికిస్తుంది | RRK Murthy Messages Telugu | Telugu Messages
มุมมอง 1.2K6 หลายเดือนก่อน
దేవుని వాక్యపఠనమే నిన్ను బ్రతికిస్తుంది | RRK Murthy Messages Telugu | Telugu Messages
మీకు దేవునియొద్దనుండి గొప్ప సహాయము కలుగును | RRK Murthy Messages Telugu | Telugu Messages
มุมมอง 2.6K6 หลายเดือนก่อน
మీకు దేవునియొద్దనుండి గొప్ప సహాయము కలుగును | RRK Murthy Messages Telugu | Telugu Messages
మీ ప్రతిష్టార్పణములను దేవుని సన్నిధికి తెండి | RRK Murthy Messages Telugu | Telugu Messages
มุมมอง 7496 หลายเดือนก่อน
మీ ప్రతిష్టార్పణములను దేవుని సన్నిధికి తెండి | RRK Murthy Messages Telugu | Telugu Messages
నీ అపకీర్తి దేవునికి ఎంతో విచారం కలిగిస్తుంది | RRK Murthy Messages Telugu | Telugu Messages
มุมมอง 5876 หลายเดือนก่อน
నీ అపకీర్తి దేవునికి ఎంతో విచారం కలిగిస్తుంది | RRK Murthy Messages Telugu | Telugu Messages