Shakti Shri Devotional
Shakti Shri Devotional
  • 2
  • 980 632
Arunachalam Temple | 46 Energy Points అరుణాచల యాత్ర గిరి ప్రదక్షిణ పూర్తి సమాచారం #tiruvannamalai
Arunachalam Temple | 46 Energy Points అరుణాచల యాత్ర గిరి ప్రదక్షిణ పూర్తి సమాచారం #tiruvannamalai #giripradikshna #arunachalam
Arulmigu Arunachaleswarar Temple, Tiruvannamalai
Arunachaleshwara Temple, Tiruvannamalai
Arunachalam Temple is located in the town of Thiruvannamalai, which is situated in the state of Tamil Nadu, India. Thiruvannamalai
Arunachalam Temple - Timings, History, Accommodation
Arunachalam Temple Giri Pradakshina: A Spiritual
Arunachalam Temple Giri Pradakshina Full Details
Arunachaleshwara Temple, Tiruvannamalai
అరుణాచలక్షేత్ర మహత్యం
అరుణాచలక్షేత్ర మహత్యం! Arunachalam Temple,అరుణాచలక్షేత్ర మహత్యం! Arunachalam Temple Tiruvannamalai History
అరుణాచలం లేదా "అన్నామలై" తమిళనాడు రాష్ట్రములో ఉంది. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణభారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక.[1] అరుణాచలం అనగా అరుణ - ఎర్రని, అచలం - కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యం. అ-రుణ అంటే పాపములను పరిహరించునది అని అర్ధం. తమిళంలో "తిరువణ్ణామలై" అంటారు. తిరు అనగా శ్రీ, అణ్ణామలై అనగా పెద్దకొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. స్మరణ మాత్రం చేతనే ముక్తినొసగే క్షేత్రం. కాశీ, చిదంబరం, తిరువారూరుల కంటే మిన్నయని భక్తులు విశ్వసిస్తున్నారు. అరుణాచలం వేద, పురాణాలలో కొనియాడిన క్షేత్రం. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞచేత విశ్వకర్మచే నిర్మింపబడిందనీ, దాని చుట్టూ అరుణమనే పురం నిర్మింపబడినదనీ పురాణాలు తెలుపుతున్నాయి. అక్కడ జరుగవలసిన పూజావిధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచలమహాత్మ్యం తెలుపుతుంది. ఈ కొండ శివుడని పురాణాలు తెల్పుచుండటం చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరాలయం కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యమీయబడుతుంది. ఇది జ్యోతిర్లింగమని చెప్పుకొనబడుతుంది. ఇది తేజోలింగం గనుక అగ్ని క్షేత్రమంటారు.
ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లంగ స్వరూపం కావటంవలన దీనిని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు శివునికి ప్రదక్షిణం అని భక్తుల విశ్వాసం. రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదేపదే ఉద్ఘోషించి ఉన్నారు, పాదచారులై శివస్మరణగావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందుచేత నిత్యం, అన్నివేళలా ఎంతోమంది గిరిప్రదక్షిణం చేస్తూ ఉంటారు. గిరిపైన గల మహౌషధీ ప్రభావం వల్ల శరీరానికి, శివస్మరణవల్ల మనస్సుకూ, శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్ధత చేకూరుతుందని భక్తుల నమ్మకం. గిరిప్రదక్షణం చాలా వరకు తారు రోడ్డు పైనే జరుగుతుంది. ఈ మధ్య కాలంలో గిరిప్రదక్షణం చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడా వేసారు. ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం కనుక రాత్రి పూట లేదా తెల్లవారుజామున చేస్తారు. రమణాశ్రమానికి 2 కి.మీ. దూరం వెళ్ళిన తరువాత కుడివైపుకు తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది . అక్కడ నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది. గిరిప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. అందులో దారిలో వచ్చే మొత్తం 8 లింగాలను మనం దర్శించుకుంటూ వెళ్ళాలి. అరుణాచలం గిరి ప్రదక్షిణ మహోన్నత ఫలితాలను ఇస్తుంది
గిరిప్రదక్షణం చెప్పులు లేకుండా చేయాలి.
బరువు ఎక్కువగా ఉన్నవాటిని మీ కూడా తీసుకువెళ్ళకండి (సంచులు అలాంటివి)
గిరిప్రదక్షణం 14 కి.మీ దూరం ఉంటుంది.
ఉదయం పూట గిరిప్రదక్షణం చేయడం చాలా కష్టం. 9 లోపు ముగించడం మంచిది .
గిరి ప్రదక్షణం పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు.
చిల్లర తిసుకువెళ్ళడం మరిచిపొవద్దు.
గిరిప్రదక్షణంలో "నేర్ (ఎదురుగా) శివాలయం" అని ఉంది దానికర్ధం శిఖరానికి ఎదురుగా ఉన్న శివాలయం అని.
నిత్యానంద స్వామి అశ్రమం పక్కనే భక్త కన్నప్ప ఆలయం ఉంటుంది.
గిరిప్రదక్షణం ప్రతిరోజూ చేస్తారు .
అరుణాచల గిరి ప్రదక్షిణలో తప్పనిసరిగా అది అన్నామలై దేవాలయం తప్పక సందర్శించండి.
గిరి ప్రదక్షిణలో మీకు తోచిన సహాయం చెయ్యండి.
ఎంత త్వరగా గిరి ప్రదక్షిణ పూర్తి చేసాము అనేది కాకుండా, నిండు గర్భిణి వలే నిదానంగా అరుణాచల నామస్మరణ చేస్తూ వెళ్ళండి.
గిరి ప్రదక్షిణలో ప్రతి దేవాలయం వద్ద విభూతి ప్రసాదంగా ఇస్తారు అది తప్పక తీసుకోండి.
మీకు కుదిరితే ప్రదక్షిణలో కొద్ది మందికి అయినా అన్నం దానం చెయ్యండి.విశేష ఫలితం కలుగుతుంది.
అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మొదలుపెట్టడానికి ముందు తప్పనిసరిగా రాజగోపురం ముందు ఒక దీపం పెట్టి మనసులో " స్వామి నాకు ఏది ఇస్తే నేను ఆనందంగా ఉంటానో అదే నాకు ప్రసాధించు " అని కోరుకొని బయలుదేరండి.గిరి ప్రదక్షిణ మొత్తం శివ నామస్మరణ చేస్తూ వెళ్ళండి.
గిరి ప్రదక్షిణలో మీతో పాటు కొంచెం చిల్లర వెంట పెట్టుకొని వెళ్ళండి. సాధువులు ఎంతో మంది ఆ ప్రదక్షిణలో వుంటారు కాబట్టి వారికి తోచిన సహాయం చెయ్యండి.
గిరి ప్రదక్షిణ మొత్తం తారు రోడ్డు కాబట్టి వీలైతే ఉదయం 10 లోపు పూర్తి చెయ్యండి.సాయంత్రం 4 తరువాత మొదలు పెట్టండి.
గిరి ప్రదక్షిణలో రమణ మహర్షి ఆశ్రమం తప్పక సందర్శించండి. అక్కడ ఆశ్రమంలో ధ్యాన మందిరంలో ధ్యానం చేస్తే, విశేషమైన మానసిక ఆనందం కలుగుతుంది అని చాలా మంది అనుభవంతో చెప్పారు.
గిరి ప్రదక్షిణ కేవలం మనకు ఎడమవైపున మాత్రమే చెయ్యాలి. ఎందుకంటె కుడివైపు దేవతలు, సిద్దులు అదృశ్య రూపంలో గిరికి ప్రదక్షిణ చేస్తుంటారు. కాబట్టి మనం వారికి ఎదురుగా వెళ్ళకూడదు.
𝐂𝐨𝐩𝐲𝐫𝐢𝐠𝐡𝐭𝐬 ©: We all make mistakes. If you find any copyright-protected material in our videos, please let us know rather than submitting a copyright takedown notice. We don't intentionally plan to include copyright-protected material in our video, sometimes it happens by mistake. So, please notify us such that we will remove the content immediately.
มุมมอง: 1 574

วีดีโอ

Hyderabad To Arunachalam Tiruvannamalai Trains,Food,Rooms కాచిగూడ నుండి అరుణాచలం #arunachalam
มุมมอง 126K3 หลายเดือนก่อน
Hyderabad To Arunachalam Tiruvannamalai Trains,Food Rooms కాచిగూడ నుండి అరుణాచలం #arunachalam #train #food #tiruvannamalai #తాళపత్ర #jeevitasatyalu #lifequotesintelugu #teluguquote #talapatranidhi#darmasandehalu#jeevithasatyalu #తాళపత్ర #జీవితసత్యాలు #darmasandehalu #interestingquestionsintelugu#telugunews #తాళపత్ర#జీవితసత్యాలు #ధర్మసందేహాలు #తాళపత్రనిధి #తాళపత్రగ్రంధాలు #jeevitasatyalu #lifequ...