Gajendramoksham (వేంకటరమణ దాసు)
Gajendramoksham (వేంకటరమణ దాసు)
  • 891
  • 302 620
కృష్ణుడు శివుడని రెండుగా కనబడుతున్నది! ఒకటే తత్వము!!
Courtesy & Credits: All rights and credit for the content used in this video go to:
bhagavatamanimutyalu.org/a_animutyalu_Telugu/iBam10.html
Sri Parthasarathy Nemani garu
పద్యము: 10.297
తనువున నంటిన ధరణీపరాగంబు; పూసిన నెఱి భూతిపూఁత గాఁగ;
ముందఱ వెలుగొందు ముక్తాలలామంబు; తొగలసంగడికాని తునుక గాఁగ;
ఫాలభాగంబుపైఁ బరఁగు కావిరిబొట్టు; కాముని గెల్చిన కన్ను గాఁగఁ;
కంఠమాలికలలోని ఘన నీలరత్నంబు; కమనీయ మగు మెడకప్పు గాఁగ;
(ఆటవెలది)
హారవల్లు లురగ హారవల్లులు గాఁగ;
బాలులీలఁ బ్రౌఢబాలకుండు
శివుని పగిది నొప్పె శివునికిఁ దనకును
వేఱులేమిఁ దెలుప వెలయునట్లు.
సందర్భం:
కొన్ని ఘనకార్యాలు చక్కబెట్టడానికి స్వామి వాసుదేవుడు అవసరమైనప్పుడల్లా అవనికి దిగివస్తూ ఉంటాడు. వినోదంగా ఒక తోడును కూడా తెచ్చుకుంటాడు. ఆ స్వామియే నందగోపబాలుడు కన్నయ్య. తోడై వచ్చిన మహాత్ముడు ఆదిశేషుని అంశమైన బలరాముడు. పసితనపు పరువంలోని గోపబాలుని పరికించి చూచేవారికి పరమశివుని దర్శనం కూడా అవుతున్నది.
తాత్పర్యము
కన్నయ్య తన అన్నయ్యతో పాటు ఆడుకొంటున్నాడు. ఒడలంతా దుమ్ము దుమ్మైపోయింది. అది పరమశివుడు పూసుకొన్న విభూతిలాగ వెలిగిపోతున్నది. తలమీద తెలికాంతులు వెదజల్లుతున్న ముత్యాలహారం చంద్రశేఖరుని తలమీది జాబిల్లిని తలపింపచేస్తున్నది. అమ్మ నొసటిమీద ఎఱ్ఱటి తిలకం చక్కగా పెట్టింది. అది కాముణ్ణి కాల్చివేసిన మూడవ కన్నులాగా ప్రకాశిస్తున్నది. యశోదమ్మ మెడచుట్టి వచ్చేట్టుగా ఒక చక్కనిహారం వేసింది. దానిమధ్య ఇంద్రనీలమణి మనోజ్ఞకాంతులతో ఒప్పారుతున్నది. అది శివమహాదేవుని మెడలోని నీలిమను తోపచేస్తున్నది. నిలువెల్లా హారాలే కదలాడుతూ ఉన్నాయి. అవి శివుని దేహంమీద తిరుగాడే పాములా అన్నట్లున్నాయి. ఇలా ఆ గోపబాలుడు, నిజానికి గొప్ప ప్రౌఢుడు, బాలలీలలతో ఫాలలోచనుని వలె భాసిల్లుతున్నాడు. బహుశః, మేమిద్దరము కాదయ్యా! ఆయనే నేను, నేనే ఆయన అని లోకాలకు తెలియజెప్పాలి అనే కోరిక కలిగి ఉంటుంది.
มุมมอง: 43

วีดีโอ

మనసులోనే పుట్టే! మాయ సంసారం!!
มุมมอง 59วันที่ผ่านมา
The illusion of samsara that arises in the mind
భగవద్గీత లోని ఏ ఒక్క శ్లోకాన్ని ఆచరణలో పెట్టిన? అపరిమిత ఆనందం వస్తుంది.
มุมมอง 105วันที่ผ่านมา
Who has put into practice any verse from the Bhagavad Gita? Unlimited joy comes.
1959 నాటి ఒకటవ తరగతి వాచకము
มุมมอง 1514 วันที่ผ่านมา
1959 నాటి ఒకటవ తరగతి వాచకము
అంబులెన్స్ ప్రయాణం: సురక్షితంగా ఉండటానికి అవలంబించాల్సిన జాగ్రత్తలు
มุมมอง 3414 วันที่ผ่านมา
Stay Safe in an Emergency: Essential Ambulance Precautions for Everyone
ఆరోగ్య సమస్యలపై! ఎక్కువగా ఆందోళన చెందకండి!!
มุมมอง 55914 วันที่ผ่านมา
Health Problems? Don't Worry Too Much
ఆసుపత్రిలో చేరడానికి ముందు! తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు!!
มุมมอง 30914 วันที่ผ่านมา
Hospital Services: Essential Points You Need to Know For any information, please drop a mal to : jbossramana@gmail.com
Telugu Devotional Songs Event - 02
มุมมอง 178หลายเดือนก่อน
Telugu Devotional Songs Event - 02
Telugu Devotional Songs Event - 1
มุมมอง 253หลายเดือนก่อน
Telugu Devotional Songs Event - 1
చేసే పనిలోనే! విశ్రాంతి పొందాలి!!
มุมมอง 662 หลายเดือนก่อน
చేసే పనిలోనే! విశ్రాంతి పొందాలి!!
శ్రీరామచంద్రుని పట్టాభిషేకం - శ్రీ కడలి సురేష్ గారు
มุมมอง 962 หลายเดือนก่อน
శ్రీరామచంద్రుని పట్టాభిషేకం - శ్రీ కడలి సురేష్ గారు
01-దేవి వైభవం
มุมมอง 1732 หลายเดือนก่อน
01-దేవి వైభవం
02-దేవి వైభవం
มุมมอง 2582 หลายเดือนก่อน
02-దేవి వైభవం
A Fun-Filled Event for Kids! Echo-Friendly Sri Durga Mata Celebration!!
มุมมอง 1252 หลายเดือนก่อน
A Fun-Filled Event for Kids! Echo-Friendly Sri Durga Mata Celebration!!
అరుణాచల శివ! నీ సృష్టి అద్భుతం!!
มุมมอง 313 หลายเดือนก่อน
అరుణాచల శివ! నీ సృష్టి అద్భుతం!!
లేవండి.. మేల్కొనండి.. గమ్యం చేరేవరకు ఆగకండి
มุมมอง 243 หลายเดือนก่อน
లేవండి.. మేల్కొనండి.. గమ్యం చేరేవరకు ఆగకండి
04-Devotional Songs - Lord Shiva Family
มุมมอง 2633 หลายเดือนก่อน
04-Devotional Songs - Lord Shiva Family
03-Devotional Songs - Lord Shiva Family
มุมมอง 2543 หลายเดือนก่อน
03-Devotional Songs - Lord Shiva Family
02-Devotional Songs - Lord Shiva Family
มุมมอง 1313 หลายเดือนก่อน
02-Devotional Songs - Lord Shiva Family
01-Devotional Songs - Lord Shiva Family
มุมมอง 1423 หลายเดือนก่อน
01-Devotional Songs - Lord Shiva Family
శ్రీమతి కొమ్మూరి రాజేశ్వరి గారికి సత్కారం
มุมมอง 1793 หลายเดือนก่อน
శ్రీమతి కొమ్మూరి రాజేశ్వరి గారికి సత్కారం
02-"వినాయక చవితి" నాటకం
มุมมอง 2513 หลายเดือนก่อน
02-"వినాయక చవితి" నాటకం
01-"వినాయక చవితి" నాటకం
มุมมอง 1563 หลายเดือนก่อน
01-"వినాయక చవితి" నాటకం
"వినాయక చవితి" నాటకం (preview)
มุมมอง 2503 หลายเดือนก่อน
"వినాయక చవితి" నాటకం (preview)
జ్ఞాన సంబంధర్ జీవిత చరిత్ర ద్వారా! పిల్లలు ఏం నేర్చుకోవాలి!!
มุมมอง 743 หลายเดือนก่อน
జ్ఞాన సంబంధర్ జీవిత చరిత్ర ద్వారా! పిల్లలు ఏం నేర్చుకోవాలి!!
భక్త మార్కండేయ జీవిత చరిత్ర ద్వారా! పిల్లలు ఏం నేర్చుకోవాలి!!
มุมมอง 1043 หลายเดือนก่อน
భక్త మార్కండేయ జీవిత చరిత్ర ద్వారా! పిల్లలు ఏం నేర్చుకోవాలి!!
ధృవుడి జీవిత చరిత్ర ద్వారా! పిల్లలు ఏం నేర్చుకోవాలి!!
มุมมอง 213 หลายเดือนก่อน
ధృవుడి జీవిత చరిత్ర ద్వారా! పిల్లలు ఏం నేర్చుకోవాలి!!
వినాయకుని నుంచి! మనం ఎంతో నేర్చుకోవచ్చు!!
มุมมอง 2233 หลายเดือนก่อน
వినాయకుని నుంచి! మనం ఎంతో నేర్చుకోవచ్చు!!
సహనం ఉంటే! సర్వం ఉన్నట్టే!!
มุมมอง 533 หลายเดือนก่อน
సహనం ఉంటే! సర్వం ఉన్నట్టే!!
వినాయకుని పుట్టినరోజు! ఇలా చేద్దామా!!
มุมมอง 2204 หลายเดือนก่อน
వినాయకుని పుట్టినరోజు! ఇలా చేద్దామా!!